భారతదేశంలో ఉపయోగించబడే ఉపరితల నీటిలో 80% కంటే ఎక్కువ వ్యవసాయం వినియోగించుకుంటుంది*, ఇది భూగర్భ జల నిరంతర క్షీణతకు కూడా కారణం అవుతుంది. త్రాగునీటి యొక్క నాణ్యత క్షీణించిపోవడం అనేది గ్రామీణ ప్రాంతాల్లో మరొక ప్రధానమైన సమస్యగా ఉంది. నీటి నిర్వహణ సమస్యల దిశగా హక్కుదారుల యొక్క బాధ్యతను పెంపొందించడానికి ఎఫ్ఎంసి ఇండియా తన భవిష్యత్ కృషి పట్ల కట్టుబడి ఉంది. నీటి వాడకాన్ని సానుకూలం చేయడానికి మరియు గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి నాణ్యతను మెరుగుపరచడానికి సమర్థవంతమైన మరియు సుస్థిరమైన పద్ధతులను ఇది ప్రోత్సహిస్తుంది.
తన బహుళ-సంవత్సర కార్యక్రమం – సమర్థ్ తో, ఎఫ్ఎంసి ఇండియా నీటి నిర్వహణ బాధ్యతను ముందుకు తీసుకువెళ్ళడం ద్వారా గ్రామీణ సమాజాలను సాధికారపరుస్తోంది, ఉత్తరోత్తరా అది వారి జీవన నాణ్యతను పెంపొందిస్తుంది. 'సమర్థ్' అనేది ఒక హిందీ పదం, దాని అర్థం సాధికారపరచడం. కార్యక్రమం యొక్క 3 ప్రధాన పునాదులు ఇవి – ఆరోగ్యం కోసం నీరు, నీటి సంరక్షణ మరియు ప్రతి చుక్కకూ ఎక్కువ పంట.
ప్రాజెక్ట్ సమర్థ్ 2019 లో ఉత్తర ప్రదేశ్ నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించింది మరియు ఈ రోజున ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించబడింది. కార్యక్రమం యొక్క కొన్ని ముఖ్యాంశాలు దిగువన ఇవ్వబడ్డాయి –
ముఖ్యాంశాలు దశ 1, 2019
- గంటకు 2000 లీటర్లు, రోజుకు 48 కిలోలీటర్ల నీటిని వడబోసే సామర్థ్యంతో ఉత్తర ప్రదేశ్‌లో 15 నీటి వడబోత ప్లాంటులు నెలకొల్పబడ్డాయి.
- ప్లాంటుల ద్వారా త్రాగునీరు అందజేయబడే 60 లబ్ధిదారు గ్రామాల్లో దాదాపుగా 40000 రైతు కుటుంబాల యొక్క సురక్షిత త్రాగునీటి అవసరాలను తీర్చడం.
- డిస్పెన్సింగ్ యూనిట్లు స్వైప్ కార్డుల ద్వారా నియంత్రించబడతాయి.
- ప్రతి లబ్ధిదారు కుటుంబానికీ ఒక స్వైప్ కార్డు కేటాయించబడుతుంది, అది వారికి రోజుకు 20-లీటర్ల త్రాగునీటిని పొందడానికి అర్హత కల్పిస్తుంది.
- ఈ ప్లాంటులను గ్రామ సమాజాలు నిర్వహిస్తాయి. ఎఫ్ఎంసి క్షేత్రస్థాయి సిబ్బంది శిక్షణ మరియు నిర్వహణపై స్థానిక కమ్యూనిటీలకు మద్దతు ఇస్తారు.
ముఖ్యాంశాలు దశ 2, 2020
- ఉత్తర ప్రదేశ్‌లో 18 కొత్త కమ్యూనిటీ వాటర్ ఫిల్ట్రేషన్ ప్లాంటులు నెలకొల్పబడ్డాయి.
- పంజాబ్ లో 9 కొత్త కమ్యూనిటీ వాటర్ ఫిల్ట్రేషన్ ప్లాంటులు నెలకొల్పబడ్డాయి.
- 100 గ్రామాల వ్యాప్తంగా ఉన్న 80,000 రైతు కుటుంబాలు సేవలు అందించడమే లక్ష్యంగా ఉంది.
- డిస్పెన్సింగ్ యూనిట్లు స్వైప్ కార్డుల ద్వారా నియంత్రించబడతాయి.
- రోజుకు 20-లీటర్ల నీటి కేటాయింపుతో ప్రతి కుటుంబమూ ఒక స్వైప్ కార్డును పొందుతుంది.
- ఎఫ్ఎంసి సిబ్బంది, శిక్షణ మరియు నిర్వహణ కోసం స్థానిక కమ్యూనిటీలకు మద్దతు ఇస్తుంది.
ప్రణాళికలు 2021
- ఉత్తర ప్రదేశ్ మరియు పంజాబ్ కాకుండా 5 కొత్త రాష్ట్రాలకు ప్రాజెక్ట్ విస్తరించబడుతుంది.
- గ్రామీణ భారతదేశంలో ఆవశ్యకత అంచనా వేయబడిన ప్రదేశాలలో 30 కొత్త కమ్యూనిటీ వాటర్ ఫిల్ట్రేషన్ ప్లాంటులు నెలకొల్పబడతాయి.
నీటి నిర్వహణను ప్రోత్సహించడం
- ఫిబ్రవరి 22 2021 నాడు ఎఫ్ఎంసి, 18 రాష్ట్రాల వ్యాప్తంగా 400+ రైతు సమావేశాల ద్వారా నీటి నిర్వహణ బాధ్యతను ప్రోత్సహిస్తూ, 14000 కంటే ఎక్కువ రైతు కమ్యూనిటీలను చేరుకుంటూ ప్రపంచ నీటి దినోత్సవం 2021 ని జరుపుకొంది.
- ఆర్థిక సంవత్సరం 2021 లో తన పనోలి తయారీ సైట్ వద్ద నీటి సమర్థ వినియోగాన్ని ఎఫ్ఎంసి 26% మెరుగుపరచింది.
2021 లో కూడా అదనపు విధులతో సమర్థ్ విస్తరించబడుతుంది. మరిన్ని వివరాల కొరకు ఈ చోటును చూడండి.