ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

గోప్యతా విధానం

గోప్యతా విధానం | మా నిబద్ధత:

ఎఫ్ఎంసి కార్పొరేషన్ వద్ద, మేము డేటా గోప్యత మరియు భద్రతను సంరక్షించడానికి కట్టుబడి ఉన్నాము. ఎఫ్ఎంసి కార్పొరేషన్ లేదా ఈ విధానాన్ని ప్రదర్శించే దాని అనుబంధ సంస్థలు (ఈ విధానంలో ఎఫ్ఎంసి కార్పొరేషన్ మరియు దాని అనుబంధ సంస్థలను సంయుక్తంగా "ఎఫ్ఎంసి" లేదా "మేము" లేదా "మమ్ములను" అని సూచించబడుతుంది) ఎలా మా విక్రేతలు మా సరఫరాధారుల యొక్క; మా వినియోగదారుల యొక్క; మా సంభావ్య విక్రేతలు, సరఫరాధారులు మరియు వినియోగదారుల యొక్క; మరియు ఈ వెబ్‌సైట్‌ను సందర్శించే, లేదా ఎఫ్ఎంసి మొబైలు యాప్‌ను వినియోగించే లేదా ఎఫ్ఎంసి సోషల్ మీడియా పేజీలను సందర్శించే వ్యక్తుల యొక్క గోప్యతకి రక్షణను ఎలా అందిస్తుందో ఈ గోప్యతా విధానం ("విధానం") వివరిస్తుంది.

ఈ పాలసీని ప్రదర్శిస్తున్న ఎఫ్ఎంసి కార్పొరేషన్ లేదా దాని అనుబంధ సంస్థ ఈ పాలసీలో కవర్ చేయబడిన వ్యక్తిగత సమాచారం కోసం డేటా కంట్రోలర్‌గా ఉంటుంది. ఈ పాలసీ "వ్యక్తిగత సమాచారము" నకు వర్తిస్తుంది, అనగా వర్తించే గోప్యతా చట్టానికి అనుగుణంగా మాకు అందుబాటులో ఉన్న ఇతర సమాచారంతో ఒక్కరుగా గానీ లేదా సమ్మేళనముతో గానీ గుర్తించదగిన ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారం అని అర్థం.

ఈ పాలసీ ఈ క్రింది వాటిని కలిగి ఉంటుంది:

సంగ్రహము

మేము సేకరించే సమాచారం

ఆవశ్యకతలు

మార్కెటింగ్

సమ్మతి

వ్యక్తిగత సమాచార సేకరణపై పరిమితులు

వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించడం, బహిర్గతం చేయడం మరియు నిలిపి ఉంచడానికి పరిమితులు

ఖచ్చితత్వం

వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితం చేయడం

మా వెబ్‌సైట్ యొక్క ప్రత్యేక ఫీచర్లు లేదా ప్రాంతాల ఉపయోగం

నిష్కాపట్యత

ప్రాప్యతను అందించుట

పిల్లల గోప్యత

ఇతర వెబ్‌సైట్లకు లింకులు

పాలసీలో మార్పులు

ఎఫ్ఎంసిని సంప్రదించండి

సంగ్రహము

ప్రస్తుత మరియు సంభావ్య విక్రేతలు, సరఫరాదారులు, కస్టమర్లు; వెబ్‌‌సైట్ సందర్శకులు; ఎఫ్ఎంసి మొబైల్ యాప్స్ యొక్క వాడుకదారులు మరియు ఎఫ్ఎంసి సోషల్ మీడియా పేజీల సందర్శకుల గురించి మేము ఏయే రకాల సమాచారాన్ని సేకరించి మరియు ట్రాక్ చేస్తామో ఈ పాలసీ వివరిస్తుంది. మేము ఈ సమాచారాన్ని ప్రధానంగా మా వ్యాపారాన్ని నిర్వహించడానికి మరియు మా ఉత్పత్తుల గురించి సమాచారాన్ని అందించడానికి ఉపయోగిస్తాము. మేము ఈ సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎఫ్ఎంసి గ్రూప్ లోపున మరియు మాకు సేవలను సరఫరా చేసే లేదా మేము వ్యాపారం చేసే తృతీయ పక్షాలతో పంచుకుంటాము. మీకు ఈ పాలసీ గురించి ఏవైనా ప్రశ్నలు ఉంటే DataPrivacy@FMC.com ని సంప్రదించండి.

మేము సేకరించే సమాచారం

మిమ్మల్ని గుర్తించడానికి లేదా నేరుగా మిమ్మల్ని సంప్రదించడానికి గాను ఎఫ్ఎంసి మీ పేరు, పోస్టల్ చిరునామా, కంపెనీ, హోదా, ఇ-మెయిల్ చిరునామా మరియు ఫోన్ నంబర్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుంది. మా నుండి వ్యాపారాన్ని అభ్యర్థించడం, మాతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం, ఒక ఆన్‌లైన్ ఫారమును పూర్తి చేయడం, సమాచారం లేదా సేవల కోసం రిజిస్టర్ చేసుకోవడం (ఒక ట్రేడ్ షో లేదా అలాంటి ఈవెంట్‌తో సహా), ఒక ఉద్యోగం కోసం దరఖాస్తు చేయడం, ఉత్పత్తి వాడకము సమాచారాన్ని అందించడం, లేదా ఇతరత్రా మాకు పంపడం ద్వారా మీకు తెలిసీ అందించే వ్యక్తిగత సమాచారాన్ని మేము సేకరిస్తాము. మీరు రిజిస్ట్రేషన్ ఫారంలను పూర్తి చేసినప్పుడు; మీరు మాతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని కోరినప్పుడు లేదా కుదుర్చుకున్నప్పుడు మాతో బిజినెస్ కావాలని మీరు కోరినప్పుడు; లేదా మా వెబ్‌సైట్ ద్వారా, మా సోషల్ నెట్‌వర్క్ పేజీలపై, మొబైల్ యాప్స్ లేదా ఇ-మెయిల్ ద్వారా మీరు ఇతర సమాచారాన్ని అందించేటప్పుడు మేము ముఖ్యంగా నేరుగా ఈ సమాచారాన్ని సేకరిస్తాము.

ప్రస్తుత మరియు సంభావ్య విక్రేతలు, సరఫరాదారులు, కస్టమర్లు వంటి మా వ్యాపార భాగస్వాముల నుండి మేము సమాచారాన్ని అందుకునేటప్పుడు మేము పరోక్షంగా వ్యక్తిగత సమాచారాన్ని కూడా సేకరిస్తాము. మీరు మా వెబ్‌సైట్ ద్వారా అడిగిన ప్రశ్నను పరిష్కరించడంలో సహాయపడేందుకు లేదా విక్రయానంతర సేవలను అందించడానికి మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని పొందవలసి రావచ్చు. అలాగే, వ్యాపార భాగస్వాములు లేదా ఇతర కంపెనీల నుండి మేము పొందిన సమాచారంతో నేరుగా మీ నుండి మేము సమాచారాన్ని సేకరించవచ్చు మరియు ఈ పాలసీలో వివరించబడిన కారణాల కోసం దానిని ఉపయోగించవచ్చు.

ఎప్పటికప్పుడు, మా వ్యాపార భాగస్వాములచే లేదా వారి సహకారంతో అందించబడే కొన్ని సేవల కోసం ఎఫ్ఎంసి సహ-బ్రాండెడ్ రిజిస్ట్రేషన్‌కు ఆతిథ్యమిస్తుంది. ఆ ఉదంతాల్లో, ఇక్కడ వివరించబడిన గోప్యతా ఆచరణలకు మా వ్యాపార భాగస్వాములు కట్టుబడి ఉండాలని మేము సాధారణంగా అడుగుతాము. ఏది ఏమైనా, మా వ్యాపార భాగస్వాముల గోప్యతా ఆచరణలకు మేము బాధ్యత వహించము మరియు మీ సమాచారాన్ని అందించడానికి ముందు ఏదేని వెబ్‌సైట్ యొక్క గోప్యతా విధానాన్ని సందర్శించవలసిందిగా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము.

ఈ వెబ్‌సైట్‌కు సందర్శకులు, ఎఫ్ఎంసి యొక్క మొబైల్ యాప్స్‌లో ఒకదానిని డౌన్‌లోడ్ చేసుకున్న పాఠకులు లేదా మా సోషల్ నెట్‌వర్క్ పేజీలను సందర్శించిన వారు మరియు మా ఇ-మెయిల్ న్యూస్‌లెటర్లకు చందాదారుల నుండి కూడా ఎఫ్ఎంసి సమాచారాన్ని సేకరిస్తుంది. ఈ ఆవశ్యకతల కోసం, మేము (మీరు వెబ్‌సైట్, ఒక సోషల్ నెట్‌వర్క్ లేదా ఒక యాప్ ఉపయోగిస్తున్నారా అనేదానిపై ఆధారపడి) మీ ఐపి హోస్ట్ చిరునామా, వీక్షించిన పేజీలు, బ్రౌజర్ లేదా ఇ-మెయిల్ క్లయింట్ రకం, ఇంటర్నెట్ బ్రౌజింగ్ మరియు వాడుక అలవాట్లు, ఇంటర్నెట్ సేవా ప్రదాత, డొమైన్ పేరు, ఈ వెబ్‌సైట్‌కు మీ సందర్శన యొక్క సమయం/తేదీ, రెఫర్ చేస్తున్న యుఆర్ఎల్ మరియు మీ కంప్యూటర్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్‌ను మేము సేకరిస్తాము. ఈ సమాచారం సాధారణంగా సామాజిక నెట్‌వర్క్‌లు లేదా మొబైల్ యాప్‌లపై మేము అందజేసే వెబ్‌సైట్ మరియు ఇతర సేవలను నిర్వహించడానికి, మా ఉత్పత్తి అందజేతలను మెరుగుపరచడానికి, మరియు ఈ పాలసీలో ఏర్పాటు చేయబడిన ఇతర మార్గాల్లో మాకు సహాయపడటానికి ఉపయోగించబడుతుంది.

లావాదేవీ సమాచారం

ఒకవేళ మీరు మాతో ఒక లావాదేవీ నిర్వహించినట్లయితే (ఒక కొనుగోలు వంటిది (లేదా ఒక ఉద్యోగ ఒప్పందం లేదా సేవల ఒప్పందం యొక్క ఆకాంక్షలో), అది ఆఫ్‌లైన్ అయినా లేదా ఈ వెబ్‌సైట్‌లో అయినా, మీరు మీ పేరు, షిప్పింగ్ చిరునామా, ఉత్పత్తి ఎంపిక (లు) మరియు మీ చెల్లింపు సమాచారంతో సహా లావాదేవీని పూర్తి చేయడానికి అవసరమైన సమాచారాన్ని అందించాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా సమాచారాన్ని అందించడంలో వైఫల్యం అనేది అభ్యర్థించిన సేవలు లేదా ఉత్పత్తులను అందించడానికి లేదా ఉపాధి కోసం మీ దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవడంలో మా అశక్తతకు కారణం కావచ్చు.

మీ వెబ్ బ్రౌజర్ చే మాకు పంపబడిన సమాచారం

మీ ఉపకరణం కొరకు మీ వెబ్‌సైట్ అనుభవాన్ని అనుకూలీకృతం చేయడానికి మరియు మీ ప్రాధాన్యతలను ప్రతిబింబించడానికి గాను మీ వెబ్ బ్రౌజర్ చే ఆటోమేటిక్‌గా మాకు పంపించబడిన సమాచారాన్ని ఎఫ్ఎంసి పాసివ్‌గా సేకరిస్తుంది. ఈ సమాచారంలో మీ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (ఐపి) చిరునామా, మీ ఇంటర్నెట్ సేవా ప్రదాత యొక్క గుర్తింపు, మీ ఆపరేటింగ్ సిస్టమ్ మరియు బ్రౌజర్ యొక్క పేరు మరియు వెర్షన్, మీ సందర్శన యొక్క తేదీ మరియు సమయం, మీరు ఎఫ్ఎంసికి అనుసంధానించబడిన పేజీ మరియు మీరు సందర్శించే పేజీలు ఉండవచ్చు.

కుకీ ద్వారా ఇవ్వబడిన సమాచారం

ఎఫ్ఎంసి తన వెబ్‌సైట్‌లు, మొబైల్ యాప్‌లు మరియు సోషల్ మీడియా పేజీలలో కుకీ మరియు ఇతర ట్రాకింగ్ టెక్నాలజీలను ఉపయోగించవచ్చు. ఒక కుకీ అనేది ఒక వెబ్ సర్వర్ నుండి మీ బ్రౌజర్‌కు పంపబడిన మరియు మీ కంప్యూటర్ యొక్క హార్డ్ డ్రైవ్ లేదా తాత్కాలిక మెమరీ పై నిల్వ చేయబడిన డేటా. మీకు మరింత వ్యక్తిగతీకరించిన యూజర్ అనుభవాన్ని ఇవ్వడానికి ఈ వెబ్‌సైట్‌లో కుకీ ఎనేబుల్ చేయబడింది. మీరు ఏ సమయంలోనైనా మీ ఇంటర్నెట్ బ్రౌజర్ పై మీ కుకీ సెట్టింగులను మార్చవచ్చు లేదా మా కుకీలను తొలగించవచ్చు. అయినప్పటికీ, మీరు కుకీలను గనక నిష్క్రియం చేస్తే, దాని ఫలితంగా ఈ వెబ్‌సైట్ అందించే ఫంక్షనాలిటీ పరిమితం చేయబడవచ్చునని దయచేసి గమనించండి. ఒక ఎఫ్ఎంసి వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేసే ముందు ప్రతి బ్రౌజర్‌కు ఒక ప్రత్యేక కుకీ ఇవ్వబడుతుంది, అప్పుడది ఎన్ని సార్లు మళ్ళీ ఉపయోగించబడినది, రిజిస్టర్ చేయబడిన యూజర్ రిజిస్టర్ చేయబడని యూజర్ ద్వారా వాడకమును నిర్ధారించడానికి, మరియు యూజర్ ఆసక్తులు మరియు ప్రవర్తన ఆధారంగా సమాచారాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడేందుకు ఉపయోగించబడుతుంది. కొన్ని ట్రాఫిక్ పోకడలు, మా వెబ్‌సైట్ల నెట్‌వర్క్ యొక్క ఏయే అంశాలను మీరు సందర్శించారు, మరియు ఏకమొత్తంగా మీ సందర్శన పోకడలను కూడా మేము విశ్లేషిస్తాము. మా యూజర్ల అలవాట్లు ఒకరి నుండి మరొకరికి ఎలా ఒకే విధంగా లేదా భిన్నంగా ఉన్నాయని అర్థం చేసుకోవడానికి మేము ఈ పరిశోధనను ఉపయోగిస్తాము, తద్వారా మేము ఒక ఎఫ్ఎంసి వెబ్‌సైట్‌ పై ప్రతి కొత్త అనుభవాన్ని మెరుగైనదిగా చేయగలుగుతాము. మా సైట్లపై మీరు మరియు ఇతర యూజర్లు చూసే సమాచారం, బ్యానర్లు మరియు ప్రమోషన్లను మెరుగ్గా వ్యక్తిగతీకరించడానికి మేము ఈ సమాచారాన్ని ఉపయోగించవచ్చు. మరింత సమాచారం కోసం, దయచేసి ఇక్కడ అందుబాటులో ఉన్న మా కుకీ పాలసీని చూడండి.

వెబ్‌సైట్ విశ్లేషణలు

మా వెబ్‌సైట్లను వాడుకదారు హితంగా రూపొందించడానికి మరియు మా సేవలను మెరుగుపరచడానికి గాను వాటి వాడకం గురించి మాకు గణాంక సంబంధిత సమాచారం అవసరం అవుతుంది. ఈ ఆవశ్యకత కోసం, మేము దిగువన ఈ విభాగంలో వివరించిన వెబ్ విశ్లేషణ సాధనాలను ఉపయోగిస్తాము. సాధనాల యొక్క ప్రదాతలు మా సూచనలకు లోబడి మరియు మా తరఫున డేటా ప్రాసెసర్లగా డేటాని మాత్రమే ప్రాసెస్ చేస్తారు. కుకీలను ఉపయోగించి లేదా ప్రముఖంగా పిలవబడే సర్వర్ లాగ్ ఫైళ్లను (పైన చూడండి) మదింపు చేయడం ద్వారా ఈ సాధనాల ద్వారా సృష్టించబడిన యూసేజ్ ప్రొఫైల్స్ వ్యక్తిగత సమాచారంతో కలపబడదు; ప్రత్యేకించి, సాధనాలు ఐపి చిరునామాలను సేకరించవు లేదా సేకరణ మీదట వీటిని అనామకంగా మారుస్తాయి.

మీరు ప్రతి సాధనం యొక్క ప్రదాతపై సమాచారమును మరియు మీరు సాధనముచే డేటా సేకరణ మరియు ప్రాసెసింగ్‌కు ఎలా అడ్డు చెప్పగలరు అనేదానికి సంబంధించిన సమాచారం కనుగొంటారు. మీ అభ్యంతరాన్ని గుర్తుంచుకోవడానికి సాధనాలు ఆప్ట్-ఔట్ కుకీలుగా పేర్కొనబడే వాటిని ఉపయోగించుకోవచ్చునని దయచేసి గమనించండి. ఈ ఆప్ట్ అవుట్ ఫంక్షన్ ఒక ఉపకరణం లేదా బ్రౌజర్‌కు సంబంధించినది మరియు అందుకనే ఈ సమయంలో ఉపయోగించిన టర్మినల్ ఉపకరణం లేదా బ్రౌజర్ కోసం చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ మీరు అనేక టర్మినల్ ఉపకరణాలు లేదా బ్రౌజర్లను ఉపయోగించిన పక్షములో, మీరు ప్రతి ఉపకరణం మరియు ఉపయోగించిన ప్రతి బ్రౌజర్ నుండి ఆప్ట్ అవుట్ చేయాలి.

అదనంగా, మీరు సాధారణంగా కుకీ వాడకమును డియాక్టివేట్ చేయడం ద్వారా యూసేజ్ ప్రొఫైల్స్ సృష్టించడాన్ని సాధారణంగా నివారించవచ్చు.

 • గూగుల్ అనలిటిక్స్: గూగుల్ ఇన్కార్పొరేటెడ్, 1600 యాంఫిథియేటర్ పార్క్‌వే, మౌంటైన్ వ్యూ, కాలిఫోర్నియా, 94043 యుఎస్ఎ ("గూగుల్") ద్వారా గూగుల్ అనలిటిక్స్ అందించబడుతుంది. మీరు మీ డేటా సేకరణ లేదా ప్రాసెసింగ్‌కు http://tools.google.com/dlpage/gaoptout?hl=en ద్వారా అభ్యంతరం చెప్పవచ్చు

మా వెబ్‌సైట్ ప్లగిన్లను సందర్శించేటప్పుడు మీ డేటా రక్షణను పెంచడానికి గాను అవి సంబంధిత ప్లగిన్ ప్రదాత యొక్క సర్వర్లకు కనెక్షన్ ఏర్పాటు చేయబడుతుందని నిర్ధారించే తీరులో పొందుపరచబడి ఉంటాయి మరియు మీరు ఆ ప్లగిన్ పై క్లిక్ చేసినప్పుడు మాత్రమే నెలకొల్పబడేట్లుగా నిర్ధారిస్తాయి.

మీరు ప్లగిన్లను యాక్టివేట్ చేసినప్పుడు మాత్రమే సంబంధిత ప్లగిన్ ప్రదాత యొక్క సర్వర్లకు మీ ఇంటర్నెట్ బ్రౌజర్ ఒక ప్రత్యక్ష కనెక్షన్‌ని నెలకొల్పుకుంటుంది. ఈ విధంగా, మీరు ప్రదాత వద్ద యూజర్ అకౌంట్ లేకపోయినప్పటికీ లేదా లాగ్ ఇన్ కాకపోయినప్పటికీ మీ ఇంటర్నెట్ బ్రౌజర్ మా వెబ్‌సైట్ యొక్క సంబంధిత సైట్‌ను యాక్సెస్ చేసినట్లుగా సమాచారాన్ని ప్లగ్ ఇన్ ప్రదాత అందుకుంటారు. లాగ్ ఫైళ్లు (ఐపి చిరునామాతో సహా) నేరుగా మీ ఇంటర్నెట్ బ్రౌజర్ నుండి సంబంధిత ప్లగిన్ ప్రొవైడర్ యొక్క సర్వర్‌కు పంపబడతాయి మరియు అక్కడ నిల్వ చేయబడవచ్చు. ఈ సర్వర్ ఇయు లేదా ఇఇఎ వెలుపల నెలకొని ఉండవచ్చు (ఉదా. యుఎస్ లో).

ప్లగిన్ ద్వారా ప్లగిన్ ప్రదాతచే సేకరించబడిన మరియు నిల్వ చేయబడిన డేటా యొక్క పరిధిపై మేము ఎటువంటి ప్రభావమునూ కలిగి ఉండము. ఈ వెబ్‌సైట్ ద్వారా సేవ్ చేయబడిన డేటాను ప్లగిన్ ప్రదాతలు అందుకోవడానికి, సేవ్ చేయడానికి మరియు ఉపయోగించడానికి మీరు ఒప్పుకోకపోతే, మీరు సంబంధిత ప్లగిన్లను ఉపయోగించకూడదు. బ్రౌజర్ యాడ్-ఆన్స్ (ముఖ్యంగా స్క్రిప్ట్ బ్లాకర్లు అని పిలుస్తారు) తో లోడ్ చేయబడటం నుండి మీరు ప్లగిన్లను బ్లాక్ కూడా చేయవచ్చు.

డేటా సేకరణ యొక్క ఆవశ్యకత మరియు పరిధి గురించి అదే విధంగా ప్లగిన్ ప్రదాతల ద్వారా మీ డేటా యొక్క ప్రాసెసింగ్ మరియు వాడకం గురించి మరియు సంబంధిత ప్రదాతల యొక్క గోప్యతా ప్రకటనలలో మీ డేటాను రక్షించుకోవడానికై సెట్టింగులను మార్చడానికి మీ హక్కులు మరియు సాధ్యతల గురించి మరింతగా తెలుసుకోండి.

ఆవశ్యకతలు

సమాచారాన్ని సేకరించడానికి ముందు లేదా ఆ మీదట, ఆవశ్యకత స్పష్టముగా లేకపోతే తప్ప, ఎఫ్ఎంసి సేకరణ యొక్క ఆవశ్యకతను పేర్కొంటుంది. మీ వ్యక్తిగత డేటా సేకరణ గురించి మీకు ప్రశ్నలు ఉంటే మీరు dataprivacy@fmc.com ను సంప్రదించవచ్చు.

వర్తించే గోప్యతా శాసనం లేదా ఇతర చట్టం మరియు ఈ క్రింది ఆవశ్యకతల కోసం అధీకృతమైన లేదా అవసరమైన ఆవశ్యకతల కోసం మేము వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తాము, ఉపయోగిస్తాము మరియు వెల్లడి చేస్తాము:

 • మీరు అభ్యర్థించిన డాక్యుమెంట్లు, కమ్యూనికేషన్లు, లేదా ఉత్పత్తి లేదా సేవా సమాచారాన్ని మీకు అందించడానికి;
 • ఉత్పత్తులు లేదా సేవల కోసం ఒక ఆర్డర్‌ను నెరవేర్చడానికి;
 • ఫిర్యాదులు మరియు ప్రశ్నలను పరిష్కరించడానికి గాను వాడుకదారులతో ఉత్తరప్రత్యుత్తరాలతో సహా, విక్రయానంతర మద్దతు మరియు కస్టమర్ సేవను అందించుట;
 • అకౌంటింగ్ రికార్డులు మరియు అమ్మకాల యొక్క ఋజువును ఉంచుట;
 • ప్రకటనలు చేయడానికి మరియు మార్కెటింగ్ కోసం పోకడలను పర్యవేక్షించడం మరియు విశ్లేషించడం, వెబ్‌సైట్ మరియు పేజీలకు ప్రాప్యత మరియు వాడకం వంటి వాటితో సహా వెబ్‌సైట్ మరియు సోషల్ మీడియా పేజీలను ఆపరేట్ చేయడం, మదింపు చేయడం, నిర్వహించడం, మెరుగుపరచడం మరియు అభివృద్ధి చేయడం;
 • సాధారణంగా మా ఉత్పత్తులు మరియు సేవలు మరియు మార్కెటింగ్ మరియు ప్రచార కృషిని అంచనా వేయడానికి మరియు వాడుకదారు అవసరాలను మెరుగ్గా నెరవేర్చడానికి గాను వాటి మదింపుకు, మెరుగుకు, మరియు అభివృద్ధికై మీ వాడుకదారు అనుభవాన్ని అంచనా వేయుట;
 • వెబ్‌సైట్ మరియు ఎఫ్ఎంసి గోప్యత మరియు యాజమాన్య సమాచారము యొక్క భద్రతను పరిరక్షించుట;
 • ఎఫ్ఎంసి కార్మికశక్తి యొక్క భద్రతను పరిరక్షించుట;
 • ఒప్పందం షరతులు లేదా చట్టపరమైన ఆవశ్యకతల ఉల్లంఘనలతో సహా వాటికే పరిమితం కాకుండా మోసం, క్రెడిట్ రిస్క్, క్లెయిములు మరియు ఇతర రిస్క్ ఎక్స్‌పోజర్లు మరియు నష్టబాధ్యతలను నిర్వహించుట, పరిష్కరించుట, రక్షించుట మరియు పరిశోధించుట;
 • కంపెనీ లేదా మా ఆస్తుల్లో లేదా ఏదైనా అనుబంధ సంస్థ యొక్క ఆస్తి యొక్క సంభావ్య లేదా వాస్తవ అమ్మకంలో భాగంగా, మాచే నిలుపుకోబడిన వ్యక్తిగత సమాచారం బదిలీ చేయబడిన ఆస్తులలో ఒకటిగా ఉండవచ్చు; మరియు
 • మా వ్యాపారం మరియు కార్యకలాపాలను నిర్వహించుట మరియు అభివృద్ధి చేయుట.
 •  

పైన పేర్కొన్న సేకరణలు, ఉపయోగాలు మరియు వెల్లడింపులు మాతో మీ సంబంధ బాంధవ్యములో ఒక అవసరమైన భాగం.

ఈ క్రింది అదనపు అవసరాల కోసం కూడా మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించుకోవచ్చు:

 • మా బ్రాండ్, ఉత్పత్తులు మరియు సేవల గురించి మీకు ప్రోత్సాహక సామాగ్రిని మరియు మార్కెటింగ్ కమ్యూనికేషన్లను పంపించుట; మరియు
 • ఈవెంట్లు, ప్రోత్సాహకాలు, వెబ్‌సైట్ మరియు ఎఫ్ఎంసి ఉత్పత్తులు మరియు సేవల గురించి మిమ్మల్ని నిమగ్నం చేయుట.

మేము ఈ అదనపు ప్రయోజనాల కోసం మీ సమాచారాన్ని ఉపయోగించకూడదు అని మీరు కోరుకుంటే, మీరు dataprivacy@fmc.comకు వ్రాతపూర్వక నోటీసు ఇవ్వడం ద్వారా లేదా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లకు అన్‌సబ్‌స్క్రయిబ్ చేయడం ద్వారా ఎప్పుడైనా బయటకి రావచ్చు. అనేక ఉదంతాల్లో, ఈ ఆవశ్యకతలను ఎంచుకోకపోవడం అనేది ఎఫ్ఎంసి తో మీ సంబంధ బాంధవ్యాన్ని ఇతరత్రా ప్రభావితం చేయదు. ఒకవేళ ఒక నిర్దిష్ట ఉదంతములో గనక ప్రభావం ఉంటే, మీరు బయటికి వెళ్ళడానికి ఎంచుకున్నప్పుడు మీకు తెలియజేయబడుతుంది.

ఇంతకు మునుపు గుర్తించబడని ఒక ఆవశ్యకత కోసం వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించడానికి లేదా వెల్లడించడానికి ముందు, మేము కొత్త ఆవశ్యకతను గుర్తించి, వర్తించే చట్టముతో సమ్మతి వహించేలా తగిన చర్యను తీసుకుంటాము, అందులో వాడకం లేదా వెల్లడి అధీకృతం చేయబడి లేదా చట్టముచే అవసరమై ఉంటే తప్ప మీ సమ్మతిని పొందడం ఉండవచ్చు.

మార్కెటింగ్

మీరు గనక ఒక ఎఫ్ఎంసి సంస్థ యొక్క ప్రస్తుత కస్టమర్ అయి ఉంటే, మీరు ఉత్పత్తి లేదా ప్రోత్సాహక ప్రకటనను, మరియు ప్రత్యేకించి అందుకోవడాన్ని ఎంచుకుని ఉంటే తప్ప, మీకు ఉత్పత్తి లేదా ప్రోత్సాహక ప్రకటనను పంపడానికి ఆ సంస్థ వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించుకుంటుంది:

 • మా ఉత్పత్తులు మరియు సేవలు, ఆఫర్లు, ప్రోత్సాహకాలు మరియు ప్రత్యేక ఈవెంట్లు మరియు మీకు ఆసక్తి ఉండగలిగిన ఇతర మార్కెటింగ్ కమ్యూనికేషన్ల గురించి వార్తలు, సమాచారం మరియు ఆధునీకరణలను కలిగియున్న మార్కెటింగ్ కమ్యూనికేషన్లను మీకు పంపించుట (ఎస్ఎంఎస్, ఇమెయిల్ లేదా టెలిఫోన్ ద్వారా);
 • మీ ఆసక్తులు మరియు కొనుగోలు చరిత్రను, ముఖ్యంగా ప్రొఫైలింగ్ ద్వారా మాతో మీ అనుభవాన్ని అనుకూలీకృతం చేయడానికి గాను. మేము మీకు అత్యంత ఆసక్తి గల ఉత్పత్తులు మరియు సేవలను అంచనా వేయడానికి మరియు మీరు ఇతర వ్యక్తులు కొనుగోలు చేయడానికి లేదా సిఫార్సు చేయగల అవకాశం ఉన్నవాటికి మేము మీ ప్రొఫైల్‌ని ఉపయోగిస్తాము. దాని ఫలితంగా, మీరు నిర్దిష్ట ఉత్పత్తులు మరియు సేవలపై దృష్టి సారించిన మార్కెటింగ్ సామాగ్రిని అందుకోవచ్చు, ఇతరాలు కాదు. తృతీయ-పక్షపు వెబ్‌సైట్‌లలో మా ఉత్పత్తులు మరియు సేవలను ప్రకటన చేయడంలో మాకు సహాయం చేయడానికి కూడా మేము మీ గురించిన వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించుకోవచ్చు - దయచేసి అదనపు సమాచారం కోసం మా కుకీ పాలసీని ఇక్కడ చూడండి;
 • మీ ఉత్పత్తి ప్రాధాన్యతలు, ఆసక్తులు, కొనుగోలు చరిత్ర మరియు వెబ్‌సైట్‌తో ఇంటర్‌యాక్షన్లు సహా సామాజిక నెట్‌వర్కుల (ఉదా: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మొదలైనవి) వంటి తృతీయ పక్షాల నుండి సేకరించిన డేటా మరియు/లేదా బహిరంగంగా యాక్సెస్ చేయదగిన డేటాబేస్‌లు నుంచి సేకరించిన సమాచారం వంటివి విశ్లేషించి డేటా విశ్లేషణ, మార్కెట్ రీసెర్చ్ మరియు డేటా ఎన్‌రిచ్మెంట్ చేయడానికి.

సమ్మతి

సమ్మతి లేకుండా అలా చేయడానికి మేము అధీకృతం చేయబడిన చోట లేదా చట్టము ప్రకారం అవసరమైతే తప్ప, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికి, ఉపయోగించడానికి లేదా వెల్లడి చేయడానికి మేము మీ సమ్మతిని పొందుతాము. ఉదాహరణకు, ఇటువంటి పరిస్థితులలో మేము మీకు తెలియకుండానే లేదా సమ్మతి లేకుండానే వ్యక్తిగత సమాచారాన్ని సేకరించవచ్చు, ఉపయోగించవచ్చు లేదా వెల్లడి చేయవచ్చు:

 • ఒక టెలిఫోన్ డైరెక్టరీ వంటి నిర్దేశిత మూలము నుండి వ్యక్తిగత సమాచారం బహిరంగంగా అందుబాటులో ఉంటుంది;
 • ఎఫ్ఎంసి ఒక అప్పును సేకరిస్తోంది లేదా చెల్లిస్తోంది;
 • సమ్మతిని పొందడం వలన ఒక పరిశోధనకు లేదా ప్రొసీడింగ్‌కి విఘాతం కలుగుతుంది అని భావించినప్పుడు; లేదా
 • మీ సమ్మతి ఒక న్యాయవాది, ఏజెంట్ లేదా బ్రోకర్ వంటి ఒక అధీకృత ప్రతినిధి ద్వారా వ్యక్తం చేయబడేది, సూచించబడేది లేదా ఇవ్వబడేది కావచ్చు.

సమ్మతిని మౌఖికంగా, వ్రాతపూర్వకంగా, చర్యలేకుండా (మీ వ్యక్తిగత సమాచారము యొక్క సహేతుకమైన నోటీసు అందుకున్న తర్వాత ఐచ్ఛిక ఆవశ్యకతల కొరకు దాని సేకరణ/వాడకము/వెల్లడిని కోరుకోవడం లేదని మీరు మాకు తెలియజేయడంలో విఫలమైనప్పుడు) లేదా ఇతరత్రా పద్ధతులలో అందించవచ్చు. మాకు వ్యక్తిగత సమాచారాన్ని అందించడం ద్వారా, ఈ పాలసీలో ఏర్పాటు చేయబడిన విధంగా మరియు చట్టం ద్వారా ఇతరత్రా అనుమతించబడిన విధంగా లేదా చట్టముచే అవసరమైనట్లుగా మేము వ్యక్తిగత సమాచారాన్ని సేకరించవచ్చని, ఉపయోగించవచ్చని మరియు వెల్లడి చేయవచ్చని మీరు అంగీకరిస్తున్నారు.

మీరు సమ్మతి ఇచ్చిన ఉదంతాలలో, చట్టపరమైన లేదా ఒప్పంద సంబంధిత పరిమితులకు లోబడి, ఎఫ్ఎంసి కి సమ్మతి ఉపసంహరణ గురించి సహేతుకమైన నోటీసు ఇచ్చి ఉంటే, మీరు మీ సమ్మతిని ఏ సమయంలోనైనా ఉపసంహరించుకోవచ్చు. సమ్మతి ఉపసంహరణ యొక్క నోటీసు అందుకున్న మీదట, మేము సమ్మతి ఉపసంహరణ యొక్క సంభావ్య పరిణామాలను మీకు తెలియజేస్తాము, అందులో ఆ సమాచారం అవసరమై ఉన్న సేవలను అందించలేకపోవడం లేదా అందించడంలో అశక్తత చేరి ఉండవచ్చు.

వ్యక్తిగత సమాచార సేకరణపై పరిమితులు

మేము విచక్షణా రహితంగా వ్యక్తిగత సమాచారమును సేకరించము మరియు మా సేవలను అందించడానికి సహేతుకమైన మరియు అవసరమైన మరియు మీచే సమ్మతి ఇవ్వబడిన ఆవశ్యకతల కొరకు సహేతుకమైన మరియు అవసరమైన మేరకు వ్యక్తిగత సమాచార సేకరణను పరిమితం చేస్తాము. చట్టముచే అధీకృతపరచబడిన లేదా అవసరమైనట్లుగా వ్యక్తిగత సమాచారాన్ని కూడా ఎఫ్ఎంసి సేకరిస్తుంది.

వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించడం, వెల్లడి చేయడం మరియు నిలిపి ఉంచడానికి పరిమితులు

పైన ఏర్పాటు చేయబడిన మరియు చట్టముచే అధీకృతపరచబడిన ఆవశ్యకతల కోసం మాత్రమే మీ వ్యక్తిగత సమాచారము ఉపయోగించబడుతుంది లేదా వెల్లడి చేయబడుతుంది.

నిర్ణయం తీసుకోవడానికి వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించిన తర్వాత ఒక వ్యక్తిని ప్రభావితం చేసే నిర్ణయం తీసుకోవడానికి మేము కనీసం ఒక సంవత్సరం పాటు దానిని ఉపయోగిస్తాము.

సాధారణంగా, మేము ఒక పరిమితి యొక్క చట్టబద్ధతకు సంబంధించిన సమయం పాటు మీ వ్యక్తిగత సమాచారాన్ని నిలిపి ఉంచుకుంటాము, ఉదాహరణకు, ఒక సరఫరాదారు, విక్రేత లేదా కస్టమర్ ఒప్పందాన్ని అనుసరించడం వంటి మీ వ్యవహారాల యొక్క ఖచ్చితమైన రికార్డును నిర్వహించడానికి, తద్వారా మేము ఒక చట్టబద్ధమైన క్లెయిమును లేవనెత్తగలుగుతాము లేదా సమర్థించుకోగలుగుతాము. అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో, ఉదాహరణకు చట్టపరమైన, పన్ను మరియు అకౌంటింగ్ అవసరాలకు అనుగుణంగా మేము అలా చేయవలసిన సందర్భంలో, లేదా ఒక చట్టపరమైన ప్రక్రియ, చట్టపరమైన ప్రాధికారం లేదా అవసరమైన పొడిగింపు కాలం వరకు అభ్యర్థన చేయడానికి అధికారం కలిగి ఉన్న ఇతర ప్రభుత్వ సంస్థచే అలా చేయవలసి ఉన్న పక్షములో మేము ఇతర కాల వ్యవధుల పాటు మీ వ్యక్తిగత సమాచారమును నిలిపి ఉంచుకోవచ్చు. సమాచారాన్ని నిలిపి ఉంచుకోవడం ద్వారా ఇకపై అసలు ఉద్దేశ్యము నెరవేరబడదని మరియు చట్టపరమైన లేదా వ్యాపార ఆవశ్యకతల కోసం నిలిపి ఉంచుకోవడమనేది ఇకపై అవసరం లేనట్లుగా భావించడం సమంజసమని అనిపించిన వెంటనే వ్యక్తిగత సమాచారం కలిగి ఉన్న డాక్యుమెంట్లు లేదా ఇతర రికార్డులను మేము నాశనం చేస్తాము, తుడిచి వేస్తాము లేదా అనామకం చేస్తాము.

సమాచారానికి అనధికారిక ప్రాప్యతను నివారించడానికి గాను వ్యక్తిగత సమాచారాన్ని నాశనం చేసేటప్పుడు మేము తగిన జాగ్రత్తను తీసుకుంటాము.

ఖచ్చితత్వం

మేము సేకరించే, ఉపయోగించే లేదా వెల్లడి చేసే వ్యక్తిగత సమాచారము ఖచ్చితమైనది మరియు సంపూర్ణంగా ఉండేట్లుగా చూసుకోవడానికి మేము సహేతుకమైన ప్రయత్నాలను చేస్తాము. కొన్ని ఉదంతాలలో, మీ చిరునామా లేదా టెలిఫోన్ నంబర్ వంటి నిర్దిష్ట సమాచారం వర్తమానానిది, సంపూర్ణం మరియు ఖచ్చితమైనదిగా ఉండేట్లు చూసుకోవడానికి మేము మీపై ఆధారపడతాము.

మీరు ఖచ్చితంగా లేని లేదా అసంపూర్ణంగా ఉండే వ్యక్తిగత సమాచారాన్ని ప్రదర్శించినట్లయితే, అవసరమైన విధంగా మేము ఆ సమాచారాన్ని సవరిస్తాము. సముచితమైనట్లయితే, సమాచారం వెల్లడి చేయబడియున్న తృతీయ పక్షాలకు మేము సవరించిన సమాచారాన్ని పంపుతాము.

వ్యక్తిగత సమాచారం యొక్క ఖచ్చితత్వం గురించిన ఒక సవాలు మీ సంతృప్తి మేరకు పరిష్కరించబడనప్పుడు, మేము మా నియంత్రణ లోని వ్యక్తిగత సమాచారానికి ఈ సవరణ అభ్యర్థించబడిందని మరియు మాచే స్వయంగా చేయబడలేదని ఒక సూచికతో వివరణ ఇస్తాము.

వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితం చేయడం

మీ వ్యక్తిగత సమాచారం యొక్క గోప్యత, సమగ్రత మరియు భద్రతను రక్షించడానికి మేము వాణిజ్యపరంగా సహేతుకమైన జాగ్రత్తలు తీసుకుంటాము. అందువల్ల మేము అనధికారిక ప్రాప్యత, సేకరణ, వాడకం, వెల్లడి, కాపీ చేయడం, మార్పుచేర్పులు, పారవేత లేదా నాశనం నుండి వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితం చేయడానికి తగు చర్యలను తీసుకున్నాము.

ఇమెయిల్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా సమాచారం తరలింపు చేయబడినప్పుడు గోప్యత మరియు భద్రతకు భరోసా ఇవ్వబడదు అని దయచేసి గమనించండి. మీరు ఇమెయిల్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా మాకు సమాచారాన్ని చేరవేసినప్పుడు లేదా మీ అభ్యర్థన మేరకు అటువంటి సమాచారాన్ని మేము మీకు చేరవేసినప్పుడు భద్రత మరియు/లేదా గోప్యత యొక్క ఉల్లంఘన ఫలితంగా ఏదైనా కోల్పోవడం లేదా నష్టానికి మేము బాధ్యత వహించబోము.

ఉమ్మడి వ్యవస్థలు మరియు డేటాబేస్‌‌లతో సహా ఎఫ్ఎంసి సంస్థల యొక్క గ్రూప్ లోపున గల సంస్థల యొక్క అంతర్జాతీయ పరిపాలనా వనరులను ఎఫ్ఎంసి ఉపయోగించుకుంటుంది. ఇందులో కెనడాకి వెలుపల మీ వ్యక్తిగత సమాచారాన్ని నిల్వ చేయడం లేదా ప్రాప్యత చేసుకోవడం ఇమిడి ఉండవచ్చు. కెనడా వెలుపల నిల్వ చేయబడిన వ్యక్తిగత సమాచారం ఆ న్యాయపరిధి లోని చట్టాలకు అనుగుణంగా ఆ న్యాయపరిధి లోని అధికారులకు ప్రాప్యతలో ఉండవచ్చు.

ఎస్ఎస్ఎల్ పరిరక్షణ. మా వెబ్‌సైట్ యొక్క కొన్ని పాస్‌వర్డ్ చే-రక్షించబడిన అంశాలకు మీ కంప్యూటర్ మరియు మా సర్వర్ మధ్య ఒక సురక్షితమైన కనెక్షన్ నెలకొల్పబడి ఉండటం అవసరం అయి ఉంటుంది. మేము సెక్యూర్ సాకెట్ లేయర్స్ (ఎస్ఎస్ఎల్) అని పిలువబడే ఒక ఎన్క్రిప్షన్ టెక్నాలజీని ఉపయోగిస్తాము. మీరు సైట్ యొక్క సురక్షితమైన ప్రాంతాన్ని వదిలి వెళ్ళేవరకూ ఒక సురక్షిత కనెక్షన్ నిర్వహించబడుతుంది. వ్యక్తిగత సమాచారము యొక్క గోప్యతను సురక్షితం చేయడానికి మేము ఎస్ఎస్ఎల్ ఎన్క్రిప్షన్ ఉపయోగిస్తున్నప్పటికీ, వ్యక్తిగత సమాచారము ఇంటర్నెట్ మీదుగా ప్రయాణిస్తుంది కాబట్టి ఇంటర్నెట్ మీదుగా వ్యక్తిగత సమాచారాన్ని ప్రసారం చేయడం యొక్క భద్రతకు మేము హామీ ఇవ్వలేము.

మా వెబ్‌సైట్ అంశాల ప్రత్యేక ఫీచర్లను ఉపయోగించడం

మా వెబ్‌సైట్లు కొన్నింటిలో సర్వేలు, లైసెన్స్ చేయబడిన కంటెంట్; లేదా ఒక ఆన్‌లైన్ స్టోర్ వంటి ప్రత్యేక ఫీచర్లు; లేదా కస్టమర్స్-ఓన్లీ ప్రాంతం లేదా కెరీర్స్ ప్రాంతం వంటి పాస్‌వర్డ్ రక్షిత అంశాలు ఉంటాయి. మా పెట్టుబడిదారు మరియు కెరీర్ సైట్లతో సహా వాటికే పరిమితం కాని వ్యక్తిగత ఎఫ్ఎంసి వెబ్‌సైట్‌లకు నిర్దిష్టమైన మరియు వాటిపై కనిపించే గోప్యతా నోటీసుల ద్వారా ఈ పాలసీని ఎప్పటికప్పుడు అనుబంధం చేయవచ్చు లేదా సవరించవచ్చు. సాధారణంగా, ఈ నోటీసులు ఒక వెబ్‌సైట్ యొక్క నిర్దిష్ట పేజీలు లేదా అంశాలపై మేము సేకరించే లేదా సేకరించని వ్యక్తిగత సమాచారం, మాకు ఆ సమాచారం ఎందుకు అవసరము, మరియు ఆ సమాచారం యొక్క వాడకము గురించి మీకు ఉండగల ఎంపికల గురించి వివరాలను అందిస్తాయి.

మీరు ఒక ప్రత్యేక ఫీచర్ లేదా పాస్‌వర్డ్-రక్షిత అంశాన్ని ఉపయోగించడానికి సైన్ అప్ చేసినప్పుడు, మీరు ప్రత్యేక ఫీచర్ లేదా పాస్‌వర్డ్-రక్షిత అంశం యొక్క మీ వాడకాన్ని శాసించే ప్రత్యేక షరతులను అంగీకరించవలసిందిగా మిమ్మల్ని అడగవచ్చు. అటువంటి ఉదంతాల్లో, ఉదాహరణకు ఒక బాక్స్ టిక్ చేయడం ద్వారా లేదా "నేను అంగీకరిస్తున్నాను" అని ఉన్న బటన్ పై క్లిక్ చేయడం ద్వారా ప్రత్యేక షరతులకు సమ్మతి ఇవ్వమని మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఈ రకం ఒప్పందాన్ని ఒక "క్లిక్-త్రూ" ఒప్పందం అని పిలుస్తారు. అటువంటి ఒప్పందాలు ఈ పాలసీ లేదా ఏదైనా ఇతర గోప్యతా నోటీసు విషయాంశము నుండి వేరుగా ఉంటాయి.

నిష్కాపట్యత

మీ వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడానికి ఉపయోగించే పాలసీలు మరియు పద్ధతుల గురించి ఎఫ్ఎంసి ఎటువంటి దాపరికం లేకుండా వ్యవహరిస్తుంది. ఈ పాలసీలు మరియు పద్ధతుల గురించి సమాచారం అందుబాటులో ఉంచబడుతుంది. అయినప్పటికీ, మా భద్రతా పద్ధతులు మరియు వ్యాపార విధానాల సమగ్రతను చూసుకోవడానికి గాను, మేము మా విధానాలు మరియు పద్ధతుల గురించిన సున్నితమైన సమాచారాన్ని వెల్లడి చేయము.

ప్రాప్యతను అందించుట

ఎఫ్ఎంసి ద్వారా నిలుపుకోబడిన మీ వ్యక్తిగత సమాచారానికి ప్రాప్యతను అభ్యర్థించడానికి మీకు హక్కు ఉంది. వ్రాతపూర్వక అభ్యర్థన మరియు గుర్తింపు అధీకరణ జరిగిన మీదట, మా నియంత్రణలో ఉన్నటువంటి మీ వ్యక్తిగత సమాచారము, ఆ సమాచారము ఉపయోగించబడుతున్న మార్గాల గురించి సమాచారం మరియు ఆ సమాచారం వెల్లడి చేయబడి ఉన్న వ్యక్తులు మరియు సంస్థల యొక్క వివరణ గురించిన సమాచారాన్ని మేము సాధారణంగా సముచితమైన రీతిలో మీకు అందజేస్తాము. కొన్ని పరిస్థితుల్లో, మేము కొంతవరకు వ్యక్తిగత సమాచారానికి ప్రాప్యతను అందించలేకపోవచ్చు. ఉదాహరణకు, అట్టి ఉదంతము, వెల్లడింపు అనేది మరొక వ్యక్తి గురించి వ్యక్తిగత సమాచారాన్ని తెలియజేసేది లేదా సమాచారాన్ని వెల్లడి చేయడమనేది గోప్యత గల వాణిజ్య సమాచారమును తెలియజేసేది, ఒకవేళ వెల్లడిస్తే అది ఎఫ్ఎంసి యొక్క ప్రత్యేక స్థానానికి హాని చేయగలిగేది అయి ఉండవచ్చు. కొంత నిర్దిష్ట వ్యక్తిగత సమాచారానికి ప్రాప్యతను అందించడం నుండి ఎఫ్ఎంసి కూడా చట్టం ద్వారా నివారించబడవచ్చు.

ఒక ప్రాప్యత అభ్యర్థనకు ప్రతిస్పందనగా సమాచారాన్ని అందించడానికి మేము సహేతుకమైన ఫీజు వసూలు చేయవచ్చు మరియు సమాచారానికి-ప్రాప్యత అభ్యర్థనను అందుకున్న మీదట ఏదేని అట్టి ఫీజు యొక్క అంచనాను అందజేస్తాము. ఫీజు అంతటికీ లేదా ఒక భాగానికి మాకు డిపాజిట్ అవసరం కావచ్చు.

మేము 30 రోజుల లోపున సమాచారాన్ని అందుబాటులో ఉంచుతాము లేదా అభ్యర్థనను నెరవేర్చడానికి అదనపు సమయం అవసరమైన చోట వ్రాతపూర్వక నోటీసును అందజేస్తాము.

ప్రాప్యత అభ్యర్థన తిరస్కరించబడిన చోట, మేము మీకు వ్రాతపూర్వకంగా తెలియజేస్తాము, తిరస్కరణకు కారణాలను డాక్యుమెంట్ చేస్తాము మరియు మీకు అందుబాటులో ఉన్న తదుపరి దశలను సూచిస్తాము.

పిల్లల గోప్యత

ఎఫ్ఎంసి యొక్క ఉత్పత్తులు మరియు సేవలు సాధారణంగా వయస్సు 18 మరియు అంతకంటే పెద్ద వారి కోసం రూపొందించబడతాయి. ఈ వెబ్‌సైట్ లేదా ఎఫ్ఎంసి యొక్క ఉత్పత్తులు మరియు/లేదా సేవల వాడకానికి సంబంధించి 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల నుండి ఎఫ్ఎంసి ఉద్దేశ్యపూర్వకంగా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించదు. ఒకవేళ 18 వయసులోపు ఉన్న చిన్నారి గనక మాకు వ్యక్తిగత సమాచారాన్ని సమర్పించినట్లయితే మరియు వ్యక్తిగత సమాచారం 18 లోపు వయసు గల చిన్నారికి చెందిన సమాచారం అని మేము తెలుసుకుంటే, సాధ్యమైనంత త్వరలో ఆ సమాచారాన్ని తొలగించడానికి ఎఫ్ఎంసి ప్రయత్నిస్తుంది. మీరు, మీకు తెలియకుండా మరియు సమ్మతి లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని అందించిన పిల్లల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు అయితే, మీరు DataPrivacy@fmc.comకు ఇమెయిల్ చేయడం ద్వారా ఈ పిల్లల సమాచారాన్ని తొలగించవలసిందిగా మాకు అభ్యర్థన పంపవచ్చు.

ఇతర వెబ్‌సైట్లకు లింకులు

తృతీయ పక్షాల గోప్యతా పద్ధతులు మరియు విధానాలకు ఎఫ్ఎంసి బాధ్యత వహించదు. మీ సౌకర్యం కోసం, ఈ వెబ్‌సైట్‌, ఇతర ఎఫ్ఎంసి వెబ్‌సైట్‌లకు అలాగే ఎఫ్ఎంసి బయటి వెబ్‌సైట్‌లకు కొన్ని హైపర్‌లింక్‌లు కలిగి ఉండవచ్చు. ఒక ఎఫ్ఎంసి వెబ్‌సైట్ నుండి లింక్ చేయబడిన వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా, మీకు ఈ లింక్‌లను ఎఫ్ఎంసి ఒక సౌలభ్యంగా మాత్రమే అందిస్తుందని మీరు అంగీకరిస్తున్నారు మరియు అటువంటి వెబ్‌సైట్‌ల కంటెంట్‌కు ఎఫ్ఎంసి బాధ్యత వహించదని మీరు అంగీకరిస్తున్నారు. ఎఫ్ఎంసి స్వంతము కాని హైపర్‌లింక్ చేయబడిన పేజీలు మరియు సైట్లపై డేటా సేకరణకు సంబంధించి మేము ఎటువంటి వాగ్దానాలు గానీ లేదా హామీలు గానీ ఇవ్వలేము. అందువల్ల మీరు సందర్శించే ప్రతి సైట్ కోసం గోప్యతా విధానం, స్టేట్‌మెంట్ లేదా నోటీసును చదవమని మేము మీకు సిఫార్సు చేస్తున్నాము.

పాలసీలో చేయబడిన మార్పులు

మేము ఎప్పటికప్పుడు మా గోప్యతా విధానాన్ని సమీక్షించవచ్చు మరియు మార్చవచ్చు. ఈ మార్పులు వెంటనే అమలులోకి వస్తాయి మరియు మా వెబ్‌సైట్‌ పై సవరించిన వెర్షన్ పోస్ట్ చేసిన తేదీ నాటికి ఉన్న ఏవేని ఎఫ్ఎంసి గోప్యతా విధానం లేదా గోప్యతా నోటీసు యొక్క అన్ని ముందస్తు వెర్షన్లను రద్దు చేస్తాయి.

ఎఫ్ఎంసిని సంప్రదించండి

ఎఫ్ఎంసి భారతీయ ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది టిసిజి ఫైనాన్షియల్ సెంటర్, 2వ అంతస్తు, ప్లాట్ నంబర్. C53, బ్లాక్ జి, బాంద్రా (ఈ), ముంబై – 400098. దయచేసి మా డేటా ప్రాసెసింగ్ ఆచరణలకు సంబంధించి ఏవైనా ప్రశ్నలు, వ్యాఖ్యలు మరియు అభ్యర్థనలను ఈ దిగువ పేర్కొన్న మా ప్రధాన కార్యాలయాలలో మాతో ప్రస్తావించండి లేదా మమ్మల్ని ఇక్కడ సంప్రదించండి DataPrivacy@fmc.com.

ఎఫ్ఎంసి విజ్ఞాపనల అధికారి

శ్రీ సిఎఎస్ నాయుడు

టిసిజి ఫైనాన్షియల్ సెంటర్, 2వ అంతస్తు

ప్లాట్ నంబర్ సి53, బ్లాక్ జి

బాంద్రా (ఈ), ముంబై – 400098

+91-22-67045504