ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

ఎఫ్ఎంసి కార్పొరేషన్ షరతులు మరియు నిబంధనలు

పరిచయం మరియు అక్నాలెడ్జ్‌మెంట్

ఎఫ్ఎంసి కార్పొరేషన్ ("కంపెనీ") ఈ వెబ్‌సైట్‌ ("వెబ్‌సైట్") ని సమాచార ఆవశ్యకతల కోసం మాత్రమే నిర్వహిస్తుంది.. మీచే ఈ వెబ్‌సైట్ యొక్క ప్రాప్యత మరియు వాడకము ప్రత్యేకించి ఈ షరతులు మరియు నిబంధనలు ("షరతులు మరియు నిబంధనలు")చే శాసించబడతాయి. ఈ వెబ్‌సైట్‌ను ప్రాప్యత చేసుకొని మరియు ఉపయోగించడం ద్వారా, మీరు ఈ షరతులు మరియు నిబంధనలను చదివి, స్వీకరించి మరియు వాటికి కట్టుబడి ఉంటారని అంగీకరిస్తున్నారు. ఏ సమయంలోనైనా నోటీసు లేకుండానే ఈ షరతులు మరియు నిబంధనలను మార్పుచేర్పులు చేయడానికి లేదా సవరించడానికి కంపెనీ హక్కును కలిగి ఉంటుంది.

తృతీయ పక్షపు ఇంటర్నెట్ వెబ్‌సైట్లు

కంపెనీ ఎప్పటికప్పుడు ఈ వెబ్‌సైట్‌లో తృతీయ పక్షపు ("తృతీయ పక్షపు సైట్లు") ఇంటర్నెట్ సైట్లకు లింకులు మరియు పాయింటర్లను అందించవచ్చు. తృతీయ పక్షపు సైట్లకు ఈ లింకులు మరియు పాయింటర్లు ఒక సౌకర్యంగా మాత్రమే అందించబడతాయి. తృతీయ పక్షపు సైట్లలో అందుబాటులో ఉన్న ఏదేని సమాచారం, ఉత్పత్తులు లేదా సేవలను కంపెనీ ఏ విషయంలోనైనా సమీక్షించలేదు మరియు వాటికోసం పనిచేయదు లేదా నియంత్రించదు, మరియు ఏదేని తృతీయ పక్షపు సైట్లలో అందించబడిన ఏదేని సమాచారం కోసం కంపెనీ బాధ్యత వహించదు. తృతీయ పక్షపు సైట్లకు సంబంధించి ఎటువంటివైనా సరే కంపెనీ ఏ విధమైన విజ్ఞప్తులనూ చేయదు మరియు భరోసాలను అందించదు, మరియు కంపెనీ ఈ వెబ్‌సైట్‌లో ఏదైనా తృతీయ పక్షపు సైట్‌కు ఒక లింక్ అందించింది అంటే, అటువంటి తృతీయ పక్షపు సైట్ లేదా దాని యజమానులు లేదా ప్రదాతలు లేదా తృతీయ పక్షపు సైట్‌లో పేర్కొనబడిన లేదా అందించబడిన ఏవైనా ఉత్పత్తులు లేదా సేవలకు సంబంధించి కంపెనీ ద్వారా ఏ విధమైన ఎండార్స్‌మెంట్, అధీకరణ, ప్రాయోజితం లేదా అనుబంధమును ఏర్పరచదు. అన్ని తృతీయ పక్షపు సైట్ల ద్వారా అందించబడిన, వాటిపై ప్రకటించబడిన లేదా వాటి ద్వారా విక్రయించబడిన విషయము, సమాచారం యొక్క ఖచ్చితత్వము మరియు/లేదా ఉత్పత్తులు లేదా సేవల యొక్క నాణ్యత యొక్క ఖచ్చితత్వం కోసం ఏదైనా బాధ్యతను కంపెనీ నిర్ద్వంద్వంగా నిరాకరిస్తుంది.

ఫార్వార్డ్ లుకింగ్ స్టేట్‌మెంట్స్

కంపెనీ యొక్క సెక్యూరిటీలు మరియు ఎక్స్చేంజ్ కమిషన్ ("ఎస్ఇసి") నివేదికలలో, కంపెనీ ఎస్ఇసి తో అత్యంత తాజాగా దాఖలు చేసిన నివేదికతో సహా వాటిలో వివరించబడిన రిస్కులతో సహా ముందుగా ఊహించిన రిస్కులు మరియు అనిశ్చిత పరిణామాల నుండి వాస్తవ ఫలితాలు వ్యత్యాసంగా ఉండే రిస్కులు మరియు అనిశ్చిత పరిణామాలకు లోబడి ఉండే ముందుచూపు కలిగిన ప్రకటనలను ఈ వెబ్‌సైట్‌ కలిగి ఉండవచ్చు.

సమాచారం యొక్క కాలీనత

ఈ వెబ్‌సైట్‌లో ఉన్న పత్రికా ప్రకటనలు మరియు ఇతర సమాచారం అంతయునూ, కంపెనీ యొక్క అత్యుత్తమ పరిజ్ఞానం మేరకు అవి జారీ చేయబడినప్పుడు సమయోచితమైనవి మరియు ఖచ్చితమైనవి. అయినప్పటికీ, సమయం గడిచే కొద్దీ అన్ని విషయాలూ పాతబడిపోవచ్చు, మరియు ఆయా తేదీల విషయసామగ్రిని చదవడం ఫలితంగా సంభవించే ఏదైనా అవగాహనా లోపాల కోసం కంపెనీ బాధ్యత వహించదు. ఈ వెబ్‌సైట్‌లో కలిగి ఉన్న సమాచారమును జారీ చేసిన తేదీలను మీరు జాగ్రత్తగా తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది.

ఫైనాన్సియల్ సమాచారం

ఈ వెబ్‌సైట్‌లో చూపబడిన కంపెనీ గురించిన ఆర్థిక సమాచారం పేర్కొన్న తేదీ నాటికి వర్తమానానిది మాత్రమే. నిర్దిష్ట తేదీ తర్వాత సంభవించే ఆర్థికపరమైన, వ్యాపారపరమైన లేదా ఏదైనా ఇతర మార్పుల ఫలితంగా ఆర్థిక సమాచారమును ఆధునీకరణ చేయు లేదా సరిచేయు ఏదైనా కర్తవ్యబాధ్యతను కంపెనీ నిరాకరిస్తుంది. ఎస్ఇసి/సంబంధిత ప్రభుత్వ అధికార యంత్రాంగముతో కంపెనీ దాఖలు చేసిన నివేదికలు మరియు ఇతర పత్రాలలో ఉన్న సమాచారము కొరకు ఒక ప్రత్యామ్నాయముగా ఉండేందుకు ఈ ఆర్థిక సమాచారం ఉద్దేశించబడలేదు. కంపెనీ గురించిన వివరణాత్మక ఆర్థిక మరియు ఇతర సమాచారము వీటిలో అందుబాటులో ఉంది: (A) కంపెనీ యొక్క అత్యంత తాజా వార్షిక నివేదిక; (B) ఫారం 10-Q పై కంపెనీ యొక్క తదుపరి త్రైమాసిక నివేదికలు; మరియు (C) ఎస్ఇసి /సంబంధిత ప్రభుత్వ అధికార యంత్రాంగముతో కంపెనీ ఎప్పటికప్పుడు దాఖలు చేసిన ఇతర నివేదికలు మరియు పత్రాలు. కంపెనీ లేదా ఏదైనా ఇతర సంస్థకు సంబంధించి ఎస్ఇసి చే నిర్వహించబడే ఎడ్గార్ (ఎలక్ట్రానిక్ డేటా సేకరణ, విశ్లేషణ మరియు తిరిగి పొందు వ్యవస్థ) పై కలిగియున్న ఏదేని సమాచారము ఖచ్చితమైనది లేదా వర్తమానానిది కాకపోవచ్చు అని కంపెనీ మిమ్మల్ని హెచ్చరిస్తుంది.

విషయాంశము మరియు నష్టబాధ్యత అస్వీకారము

ఈ వెబ్‌సైట్‌లోని సమాచారము బగ్‌లు, వైరస్‌లు, లోపాలు, సమస్యలు లేదా ఇతర పరిమితులను కలిగి ఉండవచ్చు. ఈ వెబ్‌సైట్ యొక్క పనివిధానం లేదా దీనిపైన గల విషయాంశానికి సంబంధించి ఏవైనా లోపాలు లేదా మినహాయింపులకు కంపెనీ ఎటువంటి నష్టబాధ్యత వహించదు మరియు జవాబుదారీ వహించదు మరియు ఏ సమయంలోనైనా ఎటువంటి నోటీసు లేకుండానే ఈ వెబ్‌సైట్‌కు మార్పులు చేసే హక్కును కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ వెబ్‌సైట్‌లో కలిగి ఉన్న ఏదైనా సమాచారము, వచనం, గ్రాఫిక్స్, లింక్స్ లేదా ఇతర అంశాల ఖచ్చితత్వం, ప్రస్తుతత్వం, విశ్వసనీయత లేదా సంపూర్ణత్వాన్ని కంపెనీ భరోసా ఇవ్వదు. తదనుగుణంగా, ఈ వెబ్‌సైట్‌లోని విషయాంశము అంతయునూ "ఉన్నది ఉన్నట్లుగా" మరియు ఏ రకమైన భరోసా లేకుండా, వ్యాపార సామర్థ్యం యొక్క విధింపు భరోసాలు, ఒక నిర్దిష్ట ప్రయోజనం లేదా అతిక్రమణలు లేని వాటికి సంబంధించి, వీటికే పరిమితం కాకుండా, వ్యక్తీకరించబడిన లేదా విధించబడిన భరోసా లేకుండా అందించబడుతుంది. వెబ్‌సైట్‌లోని ఎలక్ట్రానిక్ ఫైళ్ల లోపున ఉన్న వైరస్‌ల వలన జరిగిన ఏదైనా నష్టాలకు బాధ్యతను లేదా నష్టబాధ్యతలను అన్నింటినీ కంపెనీ నిరాకరిస్తుంది. కొన్ని పరిధులు విధించబడిన భరోసాల మినహాయింపును అనుమతించవు, కాబట్టి పైన పేర్కొన్న మినహాయింపు మీకు వర్తించకపోవచ్చు. ఏ సందర్భంలోనైనా కంపెనీ ఎటువంటివైనా సరే జరిగిన నష్టాలకు బాధ్యత వహించదు, మరియు ప్రత్యేకించి, కంపెనీ ప్రత్యేకమైన, పరోక్ష, పరిణామ నష్టాలు, లేదా ఆకస్మిక నష్టాలు లేదా కోల్పోయిన లాభాల కొరకు జరిగిన నష్టాలు, రాబడి యొక్క నష్టం, లేదా కంపెనీ యొక్క ఈ వెబ్‌సైట్ లేదా ఏదైనా ఇతర వెబ్‌సైట్ యొక్క నష్టము లేదా వాడకం నుండి ఉత్పన్నమయ్యే నష్టము లేదా వాటికి సంబంధించిన నష్టాలకు లేదా వాటిలో ఉన్న సమాచారం యొక్క నష్టానికి, ఒకవేళ అట్టి నష్టాలు ఒప్పందంలో, నిర్లక్ష్యం, క్రూరత్వం వల్ల ఉత్పన్నమైనా, చట్టం ప్రకారం, సమానత్వంలో, న్యాయపరంగా లేదా ఇతరత్రా ఉత్పన్నమైనా, వాటికి కంపెనీ బాధ్యత వహించదు.

వాడుకదారుచే అందించబడిన సమాచారం

పైన పేర్కొన్న గోప్యతా ప్రకటన ద్వారా శాసించబడే వ్యక్తిగత డేటా మినహా, మీ నుండి అందుకున్న ఏదైనా సమాచారం లేదా విషయసామాగ్రి మీచే అందజేయబడినట్లుగా మరియు గోప్యం కాని ప్రాతిపదికన కంపెనీచే అందుకోబడినట్లుగా భావించబడుతుంది. కంపెనీతో కమ్యూనికేట్ చేయడం ద్వారా, మీరు అందులో మాత్రమే ఉండే కమ్యూనికేషన్ లేదా ఏదైనా సమాచారమును లేదా ఏదేని రూపము, మీడియా, లేదా టెక్నాలజీ లోని ఇతర పనులలో భాగంగా, ఇప్పుడు తెలిసినదైనా లేదా ఇకనుండి తర్వాత అభివృద్ధిపరచబడేదైనా, అట్టి సమాచారమును ఉపయోగించడానికి, పునరుత్పత్తికి, మార్పుచేర్పులకు, ప్రచురణకు, సవరణకు, అనువాదానికి, పంపిణీకి, నిర్వర్తనకు మరియు ప్రదర్శించుటకు తృతీయ పక్షాలు అట్టి హక్కుల యొక్క ఏదేని ఆవశ్యకత మరియు సబ్-లైసెన్స్ చేయడానికి, మీరు ఆటోమేటిక్‌గా కంపెనీకి ఒక రాయల్టీ-రహిత, నిరంతరమైన, తిరిగి పొందలేని, ప్రత్యేకితం కాని అనుమతిని మంజూరు చేస్తారు.

వెబ్‌సైట్ రిజిస్ట్రేషన్ మరియు విచారణలు

ఈ వెబ్‌సైట్ పరిశ్రమ కొనుగోలుదారులు, ఫార్ములేటర్లు మరియు ఇతర ఆసక్తిగల పక్షాల కోసం ఒక సమాచారయుతమైన సేవగా ఉద్దేశించబడింది. రిజిస్ట్రేషన్లను నిరాకరించడానికి మరియు ఈ సేవల యొక్క దురుపయోగం లేదా నిజాయితీ లేని వాడకాలు గనక తెలియజేయబడితే అట్టి విచారణలను తిరస్కరించడానికి కంపెనీ హక్కును కలిగి ఉంటుంది. ఎంట్రీలు మరియు సమర్పించబడిన ఇతర సామాగ్రి కంపెనీ యొక్క ఆస్తిగా మారుతాయి మరియు వాటి గురించి తెలియజేయబడదు లేదా తిరిగి ఇవ్వబడదు ("గోప్యతా ప్రకటన" కూడా చదవండి). ఏదైనా టెలిఫోన్ నెట్‌వర్క్, కంప్యూటర్ పరికరాలు, సాఫ్ట్‌వేర్ లేదా వాటియొక్క ఏదైనా సమ్మేళనానికి సంబంధించి అసంపూర్ణమైన, కోల్పోయిన, తప్పుగా నిర్దేశించబడిన లేదా ఏదైనా సాంకేతిక సమస్య, మానవ లోపం, కోల్పోయిన/ఆలస్యం చేయబడిన డేటా ప్రసారం, మినహాయింపు, అంతరాయం, తొలగింపు, లోపం లేదా లైన్ వైఫల్యానికి కంపెనీ బాధ్యత వహించదు. చదవలేనివిగా ఉన్న, సరిగ్గా లేని, అసంపూర్ణంగా ఉన్న, విచ్ఛిన్నమైన, తారుమారు చేయబడిన, నకిలీ అయిన, యాంత్రికంగా పునరుత్పత్తి చేయబడిన, ఏ రూపములోనైనా అపసవ్యంగా ఉన్న లేదా ఇతరత్రా ఈ నియమాలకు అనుగుణంగా లేని ఎంట్రీలు చెల్లుబాటు కావు. ఒకవేళ ఏదైనా కారణం చేత వెబ్‌సైట్ గనక ప్లాన్ చేయబడిన విధంగా నడిచే సామర్థ్యం లేనట్లయితే, కంపెనీ తన స్వంత విచక్షణ మేరకు ఏదైనా రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడానికి, ముగించడానికి, ఆధునీకరించడానికి లేదా నిలిపివేయడానికి హక్కును కలిగి ఉంటుంది.

కాపీరైట్ మరియు వాడకం యొక్క షరతులు

వచనం, గ్రాఫిక్స్, ఆడియో, డిజైన్, సాఫ్ట్‌వేర్ మరియు ముందు చెప్పబడే ఏవేని అంశాల ఆధారంగా ఉత్పన్నమయ్యే అన్ని పనులతో సహా ఈ వెబ్‌సైట్, కంపెనీ యొక్క కాపీరైట్ చేయబడిన పని లేదా కాపీరైట్ యజమాని అనుమతికి లోబడి కంపెనీ ఉపయోగించేది అయి ఉంటుంది. ఈ షరతులు మరియు నిబంధనలలో ఏర్పాటు చేయబడిన షరతులు మరియు నిబంధనలకు లోబడి, ఈ వెబ్‌సైట్‌తో మీ సాంగత్యచర్యతో ముడిపడి ఉన్న ఆవశ్యకతల కొరకు మాత్రమే ఈ సైట్‌ను మరియు దానిపై గల సామాగ్రిని ("మెటీరియల్స్") ఉపయోగించడానికి మరియు ప్రదర్శించడానికి ఒక ప్రత్యేకితం-కాని, బదిలీ చేయబడని, పరిమిత మరియు వ్యక్తిగత లైసెన్స్ ను మీకు మంజూరు చేస్తుంది, మీరు విషయసామాగ్రిపై అన్ని కాపీరైట్, ట్రేడ్‌మార్క్ మరియు ఇతర యాజమాన్య నోటీసులను తెలియజేస్తూ ఉంటారు. విషయసామాగ్రి యొక్క ఏదేని మార్పుచేర్పులు లేదా ఇతర ఆవశ్యకత కోసం విషయసామాగ్రిని ఉపయోగించడం అనేది కంపెనీ యొక్క కాపీరైట్ మరియు ఇతర యాజమాన్య హక్కుల ఉల్లంఘన అవుతుంది. ఈ వెబ్‌సైట్‌ పై కంపెనీ యొక్క సమాచారం యొక్క సమర్పణ అనేది దాని ట్రేడ్‌మార్క్‌లు, వ్యాపార పేర్లు, కాపీరైట్లు, పేటెంట్లు లేదా ఇతర యాజమాన్య హక్కులు లేదా సమాచారంలో ఏదైనా యాజమాన్య లేదా ఇతర హక్కులను అందించదు లేదా ఇతరులచే పొందబడిన పేటెంట్ హక్కులు లేదా ఇతర మేధో సంపత్తి హక్కులను ఉల్లంఘించడానికి ఇది ఉద్దేశించబడలేదు. ఒకవేళ మీరు ఈ షరతులలో దేనినైనా అతిక్రమించినట్లయితే ఈ పరిమిత లైసెన్స్ మీకు ఎలాంటి నోటీసు లేకుండా ఆటోమేటిక్‌గా రద్దు చేయబడుతుంది. రద్దు అయిన మీదట, మీరు ఏదైనా డౌన్‌లోడ్ చేయబడిన మరియు ప్రింటు చేయబడిన విషయసామాగ్రిని వెంటనే ధ్వంసం చేయాల్సి ఉంటుంది. మీకు వెబ్‌సైట్‌లో లేదా ఏదైనా విషయసామాగ్రిలో ఏదైనా హక్కు, హోదా లేదా ఆసక్తి ఉండదు (మరియు కాపీరైట్, ట్రేడ్‌మార్క్ లేదా ఇతర మేధో సంపత్తి హక్కు ఉండదు) మరియు కంపెనీ యొక్క ముందస్తు లిఖితపూర్వక అధీకరణ లేనిదే మీరు ఏదేని ఇతర సర్వర్ పైన లేదా ఇంటర్నెట్ ఆధారిత పరికరం పైన ఈ వెబ్‌సైట్ నుండి దీనిలో కలిగియున్న లేదా ప్రాప్యత చేసుకున్న సైట్ ని "ఫ్రేమ్" లేదా "మిర్రర్" చేయరని అంగీకరిస్తున్నారు. మీరు సైట్ యొక్క కార్యకలాపాలకు ఏ రూపములోనూ అంతరాయం కలిగించకుండా ఉండేందుకు లేదా అంతరాయం కలిగించే ప్రయత్నం చేయకుండా ఉండేందుకు అంగీకరిస్తున్నారు. మీరు ఎప్పటికప్పుడు ఆధునీకరించబడినట్లుగా వెబ్‌సైట్‌లో ప్రదర్శించబడే అన్ని అదనపు నిర్బంధ పరిమితులకు కట్టుబడి ఉండేందుకు అంగీకరిస్తున్నారు.

ట్రేడ్‌మార్క్‌లు

ఎఫ్ఎంసి, ఎఫ్ఎంసి లోగో మరియు అన్ని బ్రాండ్ పేర్లు, సంస్థ పేర్లు, సర్వీస్ గుర్తులు, సంస్థ, లేదా దాని ఆధీనంలోని సంస్థలు, అనుబంధ సంస్థలు లేదా లైసెన్సర్ల ("గుర్తులు") యొక్క లోగో మరియు ట్రేడ్ డ్రెస్ అనేవి యునైటెడ్ స్టేట్స్ మరియు ఇతర దేశాలలోని సంస్థ లేదా దాని ఆధీనంలోని సంస్థలు, అనుబంధ సంస్థలు లేదా లైసెన్సర్ల యొక్క ట్రేడ్‌మార్కులు లేదా రిజిస్టర్ చేయబడిన ట్రేడ్‌మార్కులు. ఇతర బ్రాండ్ పేర్లు, సంస్థ పేర్లు, సంస్థ గుర్తులు, లోగోలు మరియు ట్రేడ్ డ్రెస్ ఇతరుల ట్రేడ్‌మార్కులు లేదా సర్వీసు గుర్తులు అయి ఉండవచ్చు. ఈ షరతులు, నిబంధనలు మరియు పరిమితులు ప్రకారం అధికారం ఇవ్వడం, లేదా సంస్థ వ్రాతపూర్వకంగా అధికారం ఇవ్వడం మినహా ఈ వెబ్‌సైట్ పై ఏదైనా రూపంలో గుర్తుల యొక్క వినియోగం నిషేధించబడింది.

©2021 ఎఫ్ఎంసి కార్పొరేషన్. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.

పేటెంట్ స్థానం

ఇతర విషయసామాగ్రితో కలపడం లేదా ఏదైనా ప్రక్రియ కోసం పని చేయుటలో ఉత్పత్తి వినియోగం కారణంగా తృతీయ పక్షాల పేటెంట్ల ఉల్లంఘనపై ఎఫ్ఎంసి కార్పొరేషన్ ఎటువంటి భరోసాను ఇవ్వదు; అటువంటి ఏదేని వాడకం, సమ్మేళనం లేదా ఆపరేషన్ కారణంగా కొనుగోలుదారులు పేటెంట్ ఉల్లంఘన యొక్క అన్ని రిస్కులకూ బాధ్యత వహిస్తారు. ఎఫ్ఎంసి కార్పొరేషన్ అనేది కంపెనీ యొక్క ఉత్పత్తులకు సంబంధించి అనేక యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ల యొక్క స్వంతదారు లేదా లైసెన్సుదారుగా ఉంది. ఇందులో వివరించబడిన ఎఫ్ఎంసి ఉత్పత్తులు, పెండింగులో ఉన్న పేటెంట్ అప్లికేషన్లు లేదా ఇతర దేశాలలోని అప్లికేషన్లచే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ ద్వారా కవర్ చేయబడవచ్చు.

వారెంటీ

ఫలితాలను ప్రభావితం చేసే అనేక అంశాల కారణంగా, కొనుగోలుదారు తమ నిర్దిష్ట ఆవశ్యకత కోసం ఈ ఉత్పత్తుల యొక్క అనుకూలతను నిర్ణయించడానికి తమ స్వంత పరీక్ష చేస్తారనే అవగాహన పై ఎఫ్ఎంసి యొక్క ఉత్పత్తులు విక్రయించబడతాయి. సాధ్యమైన అప్లికేషన్లను అన్వేషించడంలో మా కస్టమర్లకు సహాయపడటానికి మాత్రమే ఎఫ్ఎంసి చే సూచించబడిన అనేక ఉపయోగాలు అందించబడతాయి. సమర్పించబడిన సమాచారం మరియు డేటా అంతయునూ ఖచ్చితమైనది మరియు విశ్వసనీయమైనవిగా నమ్మబడతాయి, ఐతే ఎఫ్ఎంసి యొక్క ఎటువంటి నష్టబాధ్యతను అంచనా వేయకుండా అందించబడతాయి.

సాంకేతిక సేవ

ఈ వెబ్‌సైట్‌ పై ఉన్న సమాచారం స్వాభావికంగా సాధారణంగా ఉండాలని ఉద్దేశించబడింది. ఎఫ్ఎంసి పదార్థాలు మరియు నూతన ఆవిష్కరణల యొక్క నిర్దిష్ట వాడకానికి సంబంధించిన సాంకేతికతలు మరియు డేటా కాలానుగతంగా ప్రచురించబడతాయి.

వెబ్‌సైట్ యొక్క అంతర్జాతీయ వాడకము

ఈ వెబ్‌సైట్‌లో ఏదైనా సమాచారం సముచితమైనది లేదా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెలుపల డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని కంపెనీ ఎటువంటి తెలియజేతలు లేదా క్లెయిములు చేయదు. ఈ వెబ్‌సైట్‌కు ప్రాప్యత మరియు ఈ వెబ్‌సైట్‌లోని ఏదైనా సమాచారము కొందరు వ్యక్తులకు లేదా కొన్ని దేశాలలో చట్టపరమైనది కాకపోవచ్చు. మీరు ఈ వెబ్‌సైట్‌ను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి బయట గనక ప్రాప్యత చేసుకుంటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లేదా మీ అధికార పరిధి యొక్క చట్టాల క్రింద మీ స్వంత నష్టబాధ్యతకు లోబడి మీరు అలా చేస్తారు.

పరిహారం

ఈ వెబ్‌సైట్‌ పైన ఉన్న ఏవేని విషయసామాగ్రి యొక్క సమర్పణలు మరియు అనధికారిక వాడకము కాపీరైట్ చట్టాలు, ట్రేడ్‌మార్క్ చట్టాలు, గోప్యత మరియు ప్రచార చట్టాలు, నిర్దిష్ట కమ్యూనికేషన్స్ చట్టబద్ధతలు మరియు నిబంధనలు మరియు ఇతర వర్తించే చట్టాలు మరియు నిబంధనలను ఉల్లంఘించవచ్చు. మీ చర్యలకు లేదా మీ యూజర్ పేరు మరియు/లేదా పాస్‌వర్డ్ ఉపయోగించి మరే ఇతర వ్యక్తి అయినా చేసే చర్యలకు మీరు మాత్రమే బాధ్యత వహిస్తారు. అందువల్ల, వెబ్‌సైట్ యొక్క మీ వాడకము లేదా మీ యూజర్ పేరు మరియు/లేదా పాస్‌వర్డ్ ఉపయోగించి ఎవరైనా వ్యక్తిచే వెబ్‌సైట్ యొక్క వాడకము ఏదేని వర్తించు చట్టాలను లేదా నిబంధనను లేదా ఏదేని తృతీయ పక్షపు హక్కులను ఉల్లంఘించడం వల్ల తృతీయ పక్షమునకు సంబంధించి, వారి నుండి ఉత్పన్నమయ్యే, లేదా వారివల్ల ఏర్పడే ఏదైనా క్లెయిమ్ లేదా డిమాండ్‌ను నివారించే ఆవశ్యకత కొరకు ఖర్చు చేసే (అటార్నీ రుసుములతో సహా) ఏవేని మరియు అన్ని వ్యయాలు, నష్టాలు, నష్టబాధ్యతలు, మరియు ఖర్చుల నుండి కంపెనీ మరియు దాని అధికారులు, డైరెక్టర్లు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు, ఏజెంట్లు, లైసెన్సుదారులు మరియు వ్యాపార భాగస్వాములను నష్టబాధ్యత లేకుండా మరియు హాని రహితంగా చేస్తారు.

వివాదాలు

ఈ వెబ్‌సైట్, ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియా లోని దాని కార్పొరేట్ ప్రధాన కార్యాలయాల నుండి కంపెనీ ద్వారా నియంత్రించబడుతుంది మరియు నిర్వహించబడుతుంది. ఈ వెబ్‌సైట్‌కు సంబంధించి ఉత్పన్నమయ్యే ఏవైనా వివాదాలు మరియు ఇందులోని సమాచారం పెన్సిల్వేనియా చట్టం ద్వారా శాసించబడుతుంది (చట్ట సూత్రాల యొక్క సంఘర్షణలతో సంబంధం లేకుండా). ఈ వెబ్‌సైట్ నుండి ఉత్పన్నమయ్యే, లేదా దీనికి సంబంధించి అన్ని ఆదేశాలు ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియాలోని సముచిత రాజ్య లేదా సమాఖ్య కోర్టుల పరిధిలోనికి మాత్రమే తీసుకురాబడతాయి.

పూర్తి ఒప్పందం

ఈ షరతులు మరియు నిబంధనలు కంపెనీ మరియు మీ మధ్య సంపూర్ణమైన మరియు ఏకైక ఒప్పందాన్ని కలిగి ఉంటాయి మరియు ఈ వెబ్‌సైట్‌కు సంబంధించిన ఏవైనా మరియు ముందస్తు లేదా సమకాలీన ఒప్పందాలు, ప్రాతినిధ్యాలు, భరోసాలు మరియు అవగాహనలను అన్నింటినీ అధిగమిస్తాయి.