ఎఫ్ఎంసి అనేది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు తమ పంట నష్టాన్ని తగ్గించుకోవడానికి మరియు తమ దిగుబడులు మరియు లాభాలను పెంపొందించుకోవడానికి సహాయపడేందుకు పరిష్కారాలను అందించే ఒక ప్రముఖ సంస్థ.
ఎఫ్ఎంసి వద్ద ఆర్&డి, ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో మరియు మార్కెటింగ్ ప్రణాళికలలో నిర్వహణ ప్రాధాన్యతలు ముఖ్య పాత్రను పోషిస్తాయి. మేము ఉత్పత్తి నిర్వహణలో నైతిక విలువలకు కట్టుబడి ఉన్నాము మరియు ఉత్పత్తి జీవన చక్రంలో ఉత్పత్తుల సురక్షితమైన, స్థిరమైన మరియు నైతికంగా సరైన వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాము. మా వ్యాపారం యొక్క సుస్థిరతను మెరుగుపరచడానికి,ఉత్పత్తి జీవితచక్రంలోని ప్రతి దశలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ నిర్వహణ చర్యలు చేపడుతున్నాము.
ఉత్పత్తి ఆవిష్కరణ నుండి వినియోగదారుని వాడకం మరియు వ్యర్థమైన లేదా ఖాళీ డబ్బాలను పారవేయడం వరకు ఉత్పత్తి జీవన చక్రంలోని ప్రతి దశను ఉత్పత్తి నిర్వహణ జోడిస్తుంది. మా ఆవిష్కరణలు సమాజం మరియు పర్యావరణం పట్ల బాధ్యతను కలిగి ఉంటాయి అని మేము హామీ ఇస్తున్నాము, మా వద్ద ఆవిష్కరణల కోసం పరిశోధనా మరియు అభివృద్ధి స్థాయి వద్ద ఉత్తమ టెస్టింగ్ సదుపాయాలు, దోషాలు లేని రెగ్యులేటరీ సమాచారం, నిజాయితీతో కూడిన ఉత్పత్తి ప్రతిపాదన, బాధ్యతతో కూడిన తయారీ / రవాణా మరియు మా ఉత్పత్తులను ఉపయోగించే వారిచే సురక్షితమైన మరియు ఆలోచనాపూర్వక వినియోగం, వినియోగం తరువాత వ్యర్థాలు మరియు ఖాళీ డబ్బాలను సురక్షితంగా పారవేయడానికి శిక్షణ.
24x7 సహాయం కోసం విష నియంత్రణ కేంద్రం: 1800-102-6545
పైన పేర్కొన్న నంబర్ పై ఎఫ్ఎంసి ఒక ప్రత్యేకమైన పురుగు మందుల విష నియంత్రణ కాల్ సెంటర్ కలిగి ఉంది, ఇది వృత్తినిపుణులైన మెడికల్ ప్రాక్టీషనర్ల ద్వారా నిర్వహించబడుతుంది. సంవత్సరంలో 365 రోజులు, పగలు మరియు రాత్రి పూట ఈ కేంద్రం కాల్స్/సందేశాల కోసం అందుబాటులో ఉంటుంది. ఎవరైనా వ్యక్తి లేదా ఏదైనా జంతువు ఎఫ్ఎంసి ఉత్పత్తిని పొరపాటున లేదా ప్రమాదవశాత్తుగా వినియోగం/దుర్వినియోగం చేసినప్పుడు ఏదైనా దుష్ప్రభావానికి లోనైతే, పేర్కొనబడిన నంబర్ పై దానిని నివేదించవచ్చు మరియు సహాయం పొందవచ్చు.
దుష్ప్రభావాన్ని నివేదించడానికి మీరు ఏమి చేయాలి?
ప్రత్యేకమైన ఎఫ్ఎంసి నంబర్ 1800-102-6545 కు కాల్ చేయండి. మీరు కాల్ సెంటర్‌కు కాల్ చేసినప్పుడు ఈ క్రింది సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోండి:
- పేరు
- స్థానం
- సంప్రదించవలసిన నంబర్
- జిల్లా పేరు (తప్పనిసరి)
- రాష్ట్రం (తప్పనిసరి)
- పట్టణం/ తహసీల్/ తాలూకా
- మెడికల్ ఎమర్జెన్సీ రకం a7 ప్రాథమిక వివరాలు
- వినియోగించిన ఎఫ్ఎంసి ఉత్పత్తి
ఉత్పత్తి నిర్వహణ శిక్షణ:
ఎఫ్ఎంసి ఉత్పత్తుల యొక్క నైతికమైన, సురక్షితమైన మరియు తెలివైన వినియోగం కోసం రైతులు డీలర్లు, మెడికల్ ప్రాక్టీషనర్లు, స్ప్రే ఆపరేటర్లు, అప్లికేటర్లు మరియు ఎఫ్ఎంసి సిబ్బంది కోసం సంవత్సరం అంతటా స్వంతంగా లేదా క్రాప్‌లైఫ్ ఇండియా సహకారంతో క్రమం తప్పకుండా శిక్షణా కార్యక్రమాలను చేపడుతుంది.
పంట సంరక్షణ ఉత్పత్తులు, ముఖ్యంగా ఎఫ్ఎంసి ఉత్పత్తుల కొనుగోలు మరియు వినియోగంలో ఆచరించవలసిన ఉత్తమ పద్ధతులు గురించి ఈ కార్యక్రమంలో శిక్షణ ఇవ్వబడుతుంది. ఇవే కాకుండా, ఉపయోగించే పరికరాల నిర్వహణ గురించి మరియు లేబుల్ పై ఉన్న సూచనలను చదివి అర్థం చేసుకోవడానికి శిక్షణ ఇవ్వబడుతుంది.
రైతులు ఈ చర్యలు చేపట్టేలా ఎఫ్ఎంసి ప్రోత్సహిస్తుంది:
- ఒక ఎఫ్ఎంసి ఉత్పత్తిని కొనుగోలు చేసినప్పుడు డీలర్ నుండి తగిన ఇన్వాయిస్ పొందడం.
- సరైన సమయంలో సరైన కీటకాల పై సరైన ఉత్పత్తి యొక్క వినియోగం.
- పిచికారీ చేసేటప్పుడు సరైన మోతాదులో ఉత్పత్తి యొక్క వినియోగం.
- కీటక నాశినిల వినియోగం / పిచికారీ చేసే సమయంలో సరైన రీతిలో మరియు సరిగ్గా నిర్వహించబడుతున్న పరికరాల ఉపయోగం
- ఉత్పత్తిని కలిపేటప్పుడు మరియు వినియోగించేటప్పుడు వారు సరైన వ్యక్తిగత సంరక్షణ పరికరం (పిపిఇ) కిట్ ధరించడం.
- ఉత్పత్తి లేబుల్ పై ఉన్న సూచనలను వారు క్షుణ్ణంగా చదివి అనుసరించడం.
- గాలికి వ్యతిరేక దిశలో పిచికారీ చేయకపోవడం.
- పిచికారీ చేసిన తరువాత స్నానం చేయడం.
- పురుగు మందుల డబ్బాలను పిల్లలకు దూరంగా ఒక చల్లని, పొడి ప్రదేశంలో జాగ్రత పరిచి ఆ గదికి తాళం వేయడం.
- లేబుల్ ప్రకారం వాటిని పారవేయడానికి ముందు వారు ఖాళీ డబ్బాలను మూడు సార్లు కడగడం.