ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి
News & Insights

ఉగమ్

డిసెంబర్ 5, 2020 నాడు 1ప్రపంచ ధరిత్రి దినోత్సవమును సంస్మరణ చేసుకోవడానికి, ఎఫ్ఎంసి ఇండియా దేశవ్యాప్తంగా మంచి నేల ఆరోగ్య పద్ధతులను ప్రోత్సహించడానికి గాను అచ్ఛీ సమాజ్, అచ్ఛీ ఉపజ్ (మంచి అవగాహన, మంచి పంటకోత) అనే ట్యాగ్ లైన్ తో ప్రచారోద్యమం ఉగమ్ (హిందీలో ఎదుగుదల అని అర్థం) ను ప్రారంభించింది.

2నేల ఆరోగ్య దినం 2020– నేలను సజీవంగా ఉంచండి, జీవవైవిధ్యాన్ని రక్షించండి అనే ఇతివృత్తానికి అనుగుణంగా, ఈ ప్రచారోద్యమం అవగాహన, పరిజ్ఞానం మరియు వారి నేల ఆరోగ్యాన్ని మరింత సుస్థిరమైన రీతిలో నిర్వహించడానికి సరైన సాధనాల పట్ల రైతులను సాధికారపరచడానికి లక్ష్యం చేసుకుంది. ఉగమ్ ప్రచారోద్యమం క్రింద, ఆధునిక భూసార పరీక్ష పరికరాలతో ఎఫ్ఎంసి బ్రాండుతో కూడిన సంచార ‘నేల ఆరోగ్య వ్యాన్’ గుజరాత్ రాష్ట్రం నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించింది.

3ఒక అర్హత కలిగిన వ్యవసాయ నిపుణుడు కలిగిన నేల ఆరోగ్య వ్యాన్, రోజువారీ రైతుల సమావేశాలను నిర్వహిస్తూ గుజరాత్ గ్రామాల గుండా ప్రయాణిస్తోంది మరియు అప్పటికప్పుడే నేల ఆరోగ్య నివేదికలను ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా అందిస్తోంది. రైతులు మరింత విషయ పరిజ్ఞానమును పొందడానికి గాను వ్యాన్‌లో వివిధ సంభాషణాత్మక కమ్యూనికేషన్ పరికరాలు, విఆర్ కంటెంట్ మరియు గేమింగ్ ఎంగేజ్మెంట్స్ కూడా లోడ్ చేయబడ్డాయి.

4ప్రస్తుతం అనుసరించబడుతున్న నిబంధనలు మరియు భద్రతా ప్రోటోకాల్స్ పాటిస్తూ, వ్యాన్ లోపల సామాజిక దూరం పట్ల ధ్యాస వహిస్తూ నిర్ధారిత బ్యాచుల వారీగా పరస్పర చర్యలు, శానిటైజేషన్ ప్రక్రియలు మరియు ఇతర అవసరమైన చర్యలు నిర్వహించబడుతున్నాయి.

5నేల ఆరోగ్య వ్యాన్ ఎఫ్ఎంసి ఇండియా ప్రెసిడెంట్ శ్రీ ప్రమోద్ తోట గారిచే డిజిటల్‌గా జెండా ఊపి ప్రారంభించబడింది. “వ్యవసాయ ఉత్పాదకత కోసం నేల ఆరోగ్యం అనేది అత్యంత ముఖ్యమైన అంశాల్లో ఒకటి. ప్రపంచంలో వేగంగా పెరుగుతున్న జనాభాకు ఆహారం అందించడానికి గాను ఆధునిక వ్యవసాయ మిషన్‌కు మద్దతు ఇవ్వడానికి నేల జీవవైవిధ్యాన్ని రక్షించడం చాలా కీలకం. భారతదేశం యొక్క రైతులకు మద్దతు ఇవ్వడానికి గాను ఇటువంటి విశిష్టమైన పరిశ్రమ-ప్రముఖ జాతీయ నేల ఆరోగ్య అవగాహన ప్రచారోద్యమాన్ని నిర్వహించడం, అభివృద్ధి చేయడం మరియు అమలు చేయడం పట్ల భారతదేశ బృందం పట్ల నాకు గర్వంగా ఉంది" అని శ్రీ ప్రమోద్ తోట గారు అన్నారు.

6ఉగమ్ ప్రచారోద్యమం ప్రారంభమైన నాటి నుండీ, 70+ గ్రామాల్లోని 30,000 కంటే ఎక్కువ రైతులను చేరుకున్నది, దానికి అదనంగా ఫేస్‌బుక్, వాట్సాప్ మరియు యూట్యూబ్ వంటి డిజిటల్ ఛానెళ్ల ద్వారా మరెంత మందినో చేరుకుంది. ప్రారంభించిన నెలలోపుననే 4500+ ఎకరాల వ్యవసాయ భూమి నుండి అందుకున్న నమూనాలపై 1400 కంటే ఎక్కువ నేల ఆరోగ్య నివేదికలు తయారు చేయబడ్డాయి. సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి గాను ఎఫ్ఎంసి ఇండియా వారు ఈ చొరవను తీసుకున్నారు.