ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

భారతదేశంలో పనోలి సైట్ ఎఫ్ఎంసి లో మొదటగా వర్షపు నీటి సంరక్షణ చర్యలు చేపట్టింది

స్వయం సమృద్ధి మరియు స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి గుజరాత్ రాష్ట్రంలో ఎఫ్ఎంసి ఇండియాకి గల పనోలి తయారీ పరిశ్రమ Rain water harvesting వర్షపు నీటిని ఆదా చేసే రెండు ప్లాంట్లను నెలకొల్పింది, ప్రతి సంవత్సరం వర్షా కాలంలో ఇవి 2,500 కిలో లీటర్ల కంటే ఎక్కువ వర్షపు నీటిని సేకరిస్తాయి అని భావించబడుతుంది. 

వాతావరణ శాఖ అందజేసిన సమాచారం ప్రకారం ప్రతి ఏటా సగటు వర్షపాతం 970mm గా నమోదవుతుంది, ప్రతి సంవత్సరం ప్లాంట్-1 1,560 కిలో లీటర్లు మరియు ప్లాంట్-2 906 కిలో లీటర్ల నీటిని ఒడిసి పట్టుకుంటున్నాయి.

ఈ కార్యక్రమం రెండు ప్రయోజనాలను అందిస్తుంది. మొదటిది, వృథాగా పోయే నీరు సేకరించబడుతుంది మరియు రీసైకిల్ చేయబడుతుంది. రెండవది, బాహ్య నీటి సరఫరా వనరుల పై పరిశ్రమ ఆధారపడటం తగ్గించింది.

3,000 చదరపు మీటర్ల వైశాల్యం ఉన్న పై కప్పు పై పడిన వర్షపు నీరు పైపుల ద్వారా పై కప్పు నుండి ఒక స్టోరేజ్ ట్యాంక్‌కి తరలించబడుతుంది, ఫిల్టర్ చేయబడుతుంది మరియు తిరిగి వినియోగించడానికి రా స్టోరేజ్ ట్యాంక్‌కి పంప్ చేయబడుతుంది. ఇప్పటివరకు 74 కిలో లీటర్ల నీరు సేకరించబడింది.