భారతదేశం 155 మిలియన్ల హెక్టార్లకు పైగా వ్యవసాయ యోగ్యమైన భూమితో ప్రపంచములోని అత్యధిక సాగుభూమి గల దేశాలలో (యుఎస్, చైనా మరియు బ్రెజిల్ తో పాటు) ఒకటిగా మరియు ప్రపంచంలోని ముఖ్య వ్యవసాయ ఉత్పత్తిదారులలో ఒకటిగా ఉంది. 2019 లో, వ్యవసాయ రంగం సుమారుగా ₹ 19 లక్షల కోట్లు (యుఎస్‌డి 265 బిలియన్) వ్యాపారాన్ని ఉత్పన్నం చేసింది, అది ఇండియా యొక్క స్థూల దేశీయ ఉత్పత్తి (జిడిపి)లో 18% కలిగి ఉంది మరియు భారతదేశ జనాభాలో సగం కంటే ఎక్కువ మందికి ఉపాధిని ఇస్తోంది. అయినప్పటికీ, తక్కువ ఉత్పాదకత (~3 టన్నులు/హెక్టారుకు), లాభసాటిగా లేని కమతాల సైజు (<2 ఎకరాలు), సరిపోని వ్యవసాయ పెట్టుబడుల వినియోగ సామర్థ్యం, అధిక జైవిక నష్టాలు మరియు తక్కువ స్థాయి యాంత్రీకరణతో సహా వ్యవసాయరంగాన్ని పట్టి పీడిస్తున్న నిర్మాణాత్మక సవాళ్లు ఎన్నో ఉన్నాయి.
వ్యవసాయ ప్రక్రియలో ఏక కాలములో రైతుల ఆదాయాలను రెట్టింపు చేసుకుంటూనే భారతదేశం ప్రపంచంలోని వ్యవసాయ ఉత్పత్తిదారులలో అగ్రస్థానములో ఉండాలనే తన జాతీయ ఆకాంక్షను సాధించడానికి, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడానికి మరియు రైతులందరికీ మార్కెట్ సమాచార ప్రాప్యతను ప్రజాస్వామ్యబద్ధం చేయడానికి గాను ప్రముఖ డిజిటల్ మరియు ప్రశస్తమైన వ్యవసాయ సాంకేతికతలను అవలంబించవలసిన తక్షణ అవసరం వ్యవసాయ రంగానికి ఉంది.
డ్రోన్‌లు అనేవి, అవసరం-ఆధారంగా, నేరుగా పెట్టుబడి వినియోగ సామర్థ్యమును మరియు రైతు భద్రతను పెంచే పంట పెట్టుబడుల ప్రశస్తమైన మరియు ఏకీకృత దృష్టి సారింపు వాడకం ద్వారా అదే సమయములో పొలానికి పెట్టే మొత్తమ్మీది ఖర్చును తగ్గిస్తూ వ్యవసాయ రంగమును విప్లవాత్మకం చేసే సమర్థతను కలిగి ఉండేటటువంటి ఒక సాంకేతిక పరిజ్ఞానము.
చైనా, జపాన్, ఆసియన్ దేశాలు, యుఎస్ఎ మరియు బ్రెజిల్ వంటి అనేక వ్యవసాయాధారిత దేశాలు వ్యవసాయంలో వాడకం కోసం డ్రోన్లను వాడుకోవడంలో చాలా శీఘ్రంగా కృషి చేస్తున్నాయి మరియు కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- ఎఐ) ద్వారా శక్తివంతం చేయబడిన డ్రోన్లను వినియోగించడానికి నిబంధనాయుత మరియు నిర్మాణాత్మక అభివృద్ధి రెండింటికీ ప్రాధాన్యతను ఇచ్చాయి. ఉదాహరణకు, చైనాలో, డ్రోన్లు వ్యవసాయ విప్లవానికి నాయకత్వం వహిస్తున్నాయి. ఎక్స్ఎజి పరిశోధన ప్రకారం "పంట యాజమాన్యం కొరకు డ్రోన్‌ల యొక్క వాడకం తర్వాత చైనాలో వ్యవసాయ దిగుబడులు 17-20 శాతం మెరుగుపడ్డాయి”. దాని డ్రోన్ మార్కెట్ 13.8 శాతం సిఎజిఆర్ (కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు) వద్ద పెరుగుతోంది. అందువల్ల, చైనా వ్యవసాయ భూమిపై, 42,000 డ్రోన్‌లు ప్రతి రోజూ 1.2 మిలియన్ విమానాల కంటే ఎక్కువ పని చేస్తున్నాయి.
డ్రోన్‌లు మరియు ఖచ్చితత్త్వంతో కూడిన సేద్యం
ఖచ్చితత్వంతో కూడిన వ్యవసాయం అనేది మొత్తం ఉత్పాదకత, నాణ్యత మరియు దిగుబడిని మెరుగుపరచడానికి నీరు, ఎరువులు మరియు కీటక నాశిని మందుల సామర్థ్యాన్ని గరిష్టం చేయడానికి రైతులకు ఒక మార్గం. క్షేత్ర స్థాయి తక్షణ తనిఖీలో కనిపించని కొన్ని నిర్దిష్ట సమస్యలను డ్రోన్లను ఉపయోగించి కూడా స్పష్టంగా ఋజువు చేయవచ్చు.
వ్యవసాయ సవాళ్లను పరిష్కరించడం గురించి డ్రోన్లు రైతులకు సహాయపడే అనేక మార్గాలు ఉన్నాయి:
- మట్టి మరియు పొలం ప్రణాళిక రచన: నేలలో పోషక స్థాయిలు, నేల లోని తేమ సాంద్రతలు, మరియు నేలకోతను తనిఖీ చేయడంతో సహా, నీటి పారుదల కొరకు నేల మరియు నీటి విశ్లేషణ, ఎరువుల వాడకం మరియు మొక్కలు నాటే కార్యక్రమాల కోసం డ్రోన్లను ఉపయోగించవచ్చు.
- పంట పర్యవేక్షణ: పంటలపై వివిధ రకాల జైవిక మరియు అజైవిక ఒత్తిడిల ప్రభావాన్ని నిర్మూలించడానికి చర్యలను గురి చేయగల నిరంతర మరియు స్థిరమైన పంట నిఘాను డ్రోన్లు నిర్వర్తించవచ్చు. అటువంటి నిఘా చర్య ద్వారా ఉత్పన్నం చేయబడిన డేటా పెట్టుబడుల వినియోగాన్ని అనుకూలీకృతం చేయడానికి మరియు సుస్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి స్థల నిర్దిష్ట వ్యవసాయ స్థితికి సహాయపడగలదు.
- కలుపుమొక్కలు, పురుగులు మరియు వ్యాధుల నుండి పంట రక్షణ: సరియైన మోతాదును నిర్ధారించడానికి, వాడేవారు ప్రమాదవశాత్తు వాటికి గురి కావడం తగ్గించడానికి మరియు ఉత్పత్తుల యొక్క మొత్తంమీది సమర్థతను మెరుగుపరచడానికి మరియు అందువల్ల రైతులకు ఫలితాలను మెరుగుపరచడానికి వీలు కల్పించే విధంగా డ్రోన్లు సరియైన పరిమాణములో పురుగులు, కలుపులు మరియు వ్యాధి నియంత్రణ ఉత్పత్తులను పిచికారీ చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి.
- ఉత్పాదకత: ఒక్కో రోజుకు పంట కవరేజ్ ప్రదేశమును పెంపొందిస్తూనే కీటక నాశినిలు చల్లడం లేదా ఎరువులు వేయడం వంటి వ్యవసాయ పనులపై డ్రోన్లు గణనీయంగా కూలీల ఒత్తిడిని తగ్గించగలుగుతాయి. జైవిక సవాళ్లకు త్వరగా ప్రతిస్పందిస్తూనే, రైతులు ఆదా చేసిన సమయాన్ని ఇతర కార్యకలాపాలకు ఉపయోగించగలిగేలా ఇది రైతులకు సేద్యములో గణనీయమైన సౌలభ్యాన్ని అందిస్తుంది.
- కొత్త సర్వీస్ నమూనాలు: డేటా సేకరణ మరియు వ్యవసాయ ఇన్పుట్ల అప్లికేషన్ కొరకు డ్రోన్లను వినియోగించడం వలన, కొత్త సేవా నమూనాలు సృష్టించబడతాయి, ఇందులో క్రాప్ ఇన్పుట్ సంస్థలు డ్రోన్ ఆపరేటర్లు మరియు ఇతర వాల్యూ చైన్ భాగస్వాములతో చేతులు కలిపి పంట రక్షణ/పోషణ కొరకు ఒక రుసుము వద్ద ఈ సేవను రైతులకు అందించవచ్చు.
డ్రోన్ల ద్వారా ఉపాధి అవకాశాలను సృష్టించడం
డ్రోన్లను నడపడం అనేది ఒక ప్రతిభతో కూడిన నైపుణ్యం కాబట్టి, తగు శిక్షణను ఇవ్వడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిని ఉత్పన్నం చేయడానికి అద్భుతమైన సంభావ్యత ఉంది. ఈ కొత్త తరం టెక్నాలజీలు గ్రామీణ ప్రాంతాల్లో 2.1 మిలియన్ల ఉద్యోగాలను కల్పిస్తాయని అంచనా వేయబడింది.
డ్రోన్లను సమర్థవంతంగా వినియోగించడానికి ఇప్పటికే ఉన్న సవాళ్లను పరిష్కరించడం
సమర్థవంతంగా వినియోగించడానికి ముందు పరిష్కరించవలసిన సవాళ్లు అనేకం ఉన్నాయి.
- రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్: డ్రోన్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ ఇప్పటికీ రూపకల్పనలో ఉంది. ఆమోదించబడిన కీటక నాశినిలపై ఆమోదించబడిన లేబుల్ క్లెయిమ్స్ యొక్క విస్తరణకు అనుమతించడానికై మార్గదర్శకాల వేగవంతమైన రూపకల్పన (డ్రోన్ల ద్వారా వాడకం కోసం దానిని ఉపయోగించవచ్చు) రైతుల పొలాల్లో కీటక నాశినిలను చల్లడానికై డ్రోన్లను వినియోగించడాన్ని వేగవంతం చేస్తుంది.
- పరిమిత ఎగిరే సమయం మరియు పరిధి: ప్రయోజనాలతో పాటుగా, వ్యవసాయ ఆవశ్యకతల కోసం డ్రోన్లను ఉపయోగించడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అధిక బరువు వేయడం కారణంగా డ్రోన్లు ఎగిరే సమయం సాధారణంగా 20-60 నిమిషాలుగా ఉంటుంది. ఇది ఒక్కొక్క ఛార్జ్‌కు పరిమిత పొలం కవరేజ్‌కు దారితీస్తుంది మరియు డ్రోన్ యొక్క ఆపరేటింగ్ ఖర్చును పెంచుతుంది. వ్యవసాయ కార్యకలాపాలలో ఉపయోగించే డ్రోన్లకు సానుకూలతను అందించడానికి గాను, అతి తక్కువ బరువుతో అధిక శ్రేణి బ్యాటరీలను అభివృద్ధి చేయడానికి నడుస్తున్న ప్రస్తుత పరిశోధనను ప్రభుత్వ మద్దతుతో వేగవంతం చేయాల్సి ఉంటుంది.
- ఆచరణీయమైన వాణిజ్య నమూనా: డ్రోన్లను పొందడం, కనెక్టివిటీ మరియు ఆపరేషనల్ ఖర్చులు చూసుకోవడం మరియు చిన్న వ్యవసాయ కమతాలను పాలుపంచుకోనివ్వడం యొక్క ప్రారంభ ఖర్చును పరిగణించుకుంటూ, ప్రభుత్వ ప్రోత్సాహకాల ద్వారా మద్దతు ఇవ్వబడే ఒక సానుకూలమైన నమూనాను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, అది పైలట్లకు శిక్షణ ఇవ్వడమే కాకుండా హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్ మౌలిక సదుపాయాలలో పెట్టుబడిని ఆకర్షిస్తుంది.
గ్రామీణ భారతదేశం అనుసరించవలసిన మార్గం ఏమిటి?
రైతులు తమ పొలాలు మరియు వనరులను మెరుగైన మరియు మరింత సుస్థిరమైన మార్గంలో నిర్వహించడానికి వారికి సహాయపడటం ద్వారా భారతీయ వ్యవసాయాన్ని రూపాంతరం చేయడానికి డ్రోన్లు గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వాడకాన్ని ప్రోత్సహించడానికి గాను, అనుమతి సమ్మతి ఖర్చులను తగ్గించే క్రియాశీల కార్యకలాపాలు, శిక్షణ కేంద్రాలు మరియు వ్యవసాయ పెట్టుబడుల పరిశ్రమలతో కార్యాచరణ ఒడంబడికలను వేగవంతంగా అందించడానికై డ్రోన్ తయారీదారులకు ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టవలసిన అవసరం ఉంది. డ్రోన్లు మరియు సంబంధిత సేవలను కొనుగోలు చేయడానికి గాను రైతులకు సబ్సిడీలను కూడా అందించవచ్చు.
రిజిస్ట్రేషన్, స్వాధీనం చేసుకోవడం మరియు ఆపరేషన్ నుండి దానిని వినియోగించడాన్ని సులభం మరియు సురక్షితం చేయడానికి డ్రోన్ల యొక్క ఉత్పత్తి నిర్వహణ అనే ప్రధాన సమస్యను కూడా పరిష్కరించవలసి ఉంటుంది.
ఇంకా ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, సరైన సంస్కరణలతో, భారతదేశం తదుపరి వ్యవసాయ విప్లవాన్ని తీసుకురావడానికై డ్రోన్లు అందించే ప్రయోజనాలను పొందడానికి సిద్ధంగా ఉంది.