నేల చౌడు బారకుండా ఆపండి, నేల ఉత్పాదకతను పెంచండి
సుస్థిరత్వం అనేది ఎఫ్ఎంసి ఇండియా బిజినెస్ యొక్క మూలబిందువుగా ఉంది మరియు మేము వివిధ సుస్థిరత్వ చొరవలను ముందుకు తీసుకువెళ్ళడానికి కట్టుబడి ఉన్నాము. నేల ఆరోగ్యం అనేది మాకు ఉన్న ప్రధాన సుస్థిరతా ఇతివృత్తాలలో ఒకటి, ఎందుకంటే వ్యవసాయం కోసం నేల అనేది ఒక కీలకమైన వనరు అని మనందరికీ తెలుసు.
భారతదేశపు నేలలు ఈ రోజున అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి – సంవత్సరాల పాటుగా నేల నాణ్యత సమగ్రంగా క్షీణిస్తూనే ఉంది మరియు భారతదేశంలో నేల ఆరోగ్యం గురించి అవగాహన కల్పించవలసిన బాధ్యత మనకు ఉంది. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు ఒక సంతకందారు హోదాలో ప్రత్యేకించి, "ఆకలి లేకుండా చేయడం" అనేది ఒక ముఖ్యమైన అత్యావశ్యకం.
5th డిసెంబర్ 5 వ తేదీ భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ నేల దినోత్సవంగా జరుపుకోబడుతుంది. ప్రపంచ నేల దినోత్సవం 2021 కోసం ఇతివృత్తం ' నేల చౌడు బారకుండా ఆపడం, నేల ఉత్పాదకతను పెంచడం . నేల చౌడు బారడం యొక్క ప్రమాదాల గురించి అవగాహన కల్పించడం దీని ఉద్దేశ్యం.
ప్రతి సంవత్సరం లాగానే, ఎఫ్ఎంసి బృందము 5th డిసెంబర్ 2021 నాడు ప్రపంచ నేల దినోత్సవం రోజున వివిధ కార్యకలాపాలను నిర్వహించింది. నేల ఆరోగ్యం గురించి రైతులు, ఛానల్ భాగస్వాములు మరియు ఇతర హక్కుదారులకు అవగాహన కల్పించడానికి మేము అనేక వేడుకలను నిర్వహించాము. 600+ రైతు సమావేశాలు నిర్వహించబడ్డాయి, అందులో 200+ ఛానెల్ భాగస్వాములు పాల్గొన్నారు, 850+ మొక్కలు నాటడం జరిగింది, 20+ వాహన ర్యాలీలు నిర్వహించబడ్డాయి మరియు దాదాపుగా 80 ప్రభుత్వ అధికారులతో బృందాలు నిమగ్నమయ్యాయి. నేల దినోత్సవం వ్యాసరచన పోటీ, స్థానిక కళాశాలలు/పాఠశాలలలో చర్చావేదిక పోటీ నిర్వహించడం మరియు ఈ విషయముపై మహిళా రైతులకు డ్రామా మరియు చిరు-నాటికలలో నిమగ్నం చేయడం ద్వారా మా సృజనాత్మక నాయకులు ఈ ప్రచారోద్యమాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్ళారు.
క్షేత్ర స్థాయి కార్యకలాపాలతో పాటుగా, మేము నేల ఆరోగ్యం దిశగా డిజిటల్ ప్రచారోద్యమాలను కూడా ప్రారంభించాము. నేల చౌడు బారడం గురించి మేము భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి నుండి ఒక నేల శాస్త్రవేత్తతో ఒక వెబినార్ నిర్వహించాము, అందులో నేల చౌడుబారడానికి కారణాలు మరియు సవాళ్లను తగ్గించే మార్గాల గురించి ఆయన తన జ్ఞానాన్ని పంచుకున్నారు. ఇతర డిజిటల్ కార్యకలాపాలలో నేల స్థితి, ప్రపంచ నేల దినోత్సవ ఇతివృత్తముపై సంక్షిప్త దృశ్య వివరణలు మరియు నేల ఆరోగ్య అవగాహన దిశగా ఎఫ్ఎంసి కార్యక్రమానికి మద్దతు ఇవ్వడానికి ఒక కస్టమర్ యొక్క ప్రతిజ్ఞ ఇమిడి ఉన్నాయి.
ఈ ప్రచారోద్యమం ప్రముఖ ప్రింట్ మీడియా మరియు స్థానిక టీవీ ఛానెళ్ల ద్వారా కవర్ చేయబడింది. ఈ ప్రచారోద్యమం దేశంలోని అనేకమంది పరిశ్రమ అగ్రగణ్యులు అదేవిధంగా నేల నిపుణులచే బాగా ప్రశంసించబడింది.
ఈ ప్రచారోద్యమం సుస్థిరమైన వ్యవసాయానికి దోహద పడటమే లక్ష్యంగా చేసుకొంది. ప్రతి సంవత్సరం ఇది నేల ఆరోగ్యం గురించి అవగాహనను పెంపొందించడానికి మాకు ఒక అవకాశం కల్పిస్తుంది మరియు భారతదేశాన్ని సమృద్ధిగల నేల దేశంగా చేసే దిశగా పనిచేస్తూ ఉండటానికి మాకు ప్రేరణనిస్తుంది!