కీటక నాశినిలను సరిగ్గా నిర్వహించకపోవడం అనేది మహారాష్ట్రలో ఒక దీర్ఘ-కాలిక సమస్యగా ఉంటోంది. ముఖ్యంగా, 2017 సంవత్సరంలో పంట రక్షణ ఉత్పత్తులను సరిగ్గా నిర్వహించని కారణంగా యవత్మాల్ మరియు పరిసర జిల్లాలు 30 మంది రైతులు మరియు వ్యవసాయ కార్మికుల మరణానికి సాక్షీభూతంగా నిలిచాయి. అప్పటి నుండి మహారాష్ట్ర వ్యవసాయ శాఖ వివిధ అగ్రోకెమికల్ కంపెనీల యొక్క సమన్వయ సహకారంతో కీటక నాశినిల యొక్క సురక్షితమైన వాడకంపై నిరంతర అవగాహన ప్రచార కార్యక్రమాన్ని చేపడుతుంది.
ఎఫ్ఎంసి వద్ద మేము, రైతులు టచ్ పాయింట్స్ వద్ద మా ప్రధాన బాధ్యతలలో ఒకటిగా సారధ్యబాధ్యతల్ని నడుపుతున్నాము. 2018 మరియు 2019లో, చంద్రాపూర్ జిల్లాలో ఈ సమస్యపై వ్యవసాయ శాఖ సమన్వయంతో ఎఫ్ఎంసి భారీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సంవత్సరం అకోలా జిల్లాలో రైతుల కోసం కీటక నాశినిల భద్రతా అవగాహన కార్యక్రమాలను నిర్వహించడానికి గాను ఎఫ్ఎంసి నోడల్ కంపెనీగా నియమించబడింది.
వ్యవసాయ శాఖ, ఆరోగ్య శాఖ మరియు కెవికె యొక్క సమన్వయ సహకారంతో మేము ఈ విషయం పై వివిధ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. అధిక ప్రభావం చూపే విధంగా జిల్లా మరియు తాలూకా స్థాయి అధికారుల సన్నిహిత సమన్వయంతో వ్యాన్ ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. మొదటి వ్యాన్ ప్రచార కార్యక్రమం అకోలా జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ జితేంద్ర పాపడ్కర్ గారి స్వహస్తాలతో ప్రారంభించబడింది.
ఆత్మా (అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ) యొక్క సమన్వయంతో, మేము కేవలం అకోలా జిల్లాలో మాత్రమే కాకుండా 4 ఇతర పరిసర జిల్లాలలోని వేలాది మంది రైతులకు పిపిఇ కిట్లను కూడా పంపిణీ చేస్తున్నాము. ప్రతి కిట్‌లో ఒక ఏప్రాన్, మాస్క్, కళ్ల రక్షణ గేర్ మరియు గ్లోవ్స్ ఉంటాయి. రైతులు పరిమిత సంఖ్యలలో ఉండే సమావేశాలను నిర్వహించడానికి మరియు పిపిఇ కిట్ల వాడకము మరియు వాటి ప్రాముఖ్యతపై శిక్షణ కోసం వ్యాన్ ప్రచార కార్యక్రమాలు ఉపయోగించబడుతున్నాయి. మా ఉద్యమములో టిఎఓ లు (తాలూకా వ్యవసాయ అధికారులు) కూడా పాల్గొన్నారు మరియు రైతులు మరియు వ్యవసాయ కార్మికులకు వివిధ పంటలపై క్రిమి సంహారక మందుల యొక్క సురక్షిత వాడకముపై అవగాహన కల్పించారు.
ఇప్పటివరకు, మేము ఈ ప్రచార కార్యక్రమం క్రింద 115 గ్రామాల్లో 5000 కంటే ఎక్కువ మంది రైతులు మరియు రైతు కార్మికులను చేరుకున్నాము. అవగాహనను మరింత పెంచడానికి మరియు పంట రక్షణ ఉత్పత్తుల సురక్షితమైన వాడకాన్ని నిర్ధారించడానికి గాను మా ప్రచారోద్యమం యొక్క చేరువను మరింత విస్తరించడానికి మరియు రాష్ట్ర అధికారులతో సన్నిహితంగా పనిచేయడానికి మేము కట్టుబడి ఉన్నాము.