ఎఫ్ఎంసి, ఒక అత్యాధునిక సాంకేతిక ఆవిష్కర్త అవ్వడమే కాకుండా, ఇది అనుకూలీకృతమైన మరియు సుస్థిరమైన సేద్యపు పరిష్కారాల సహాయంతో రైతులకు మద్దతు ఇవ్వడం ద్వారా భారతదేశంలో గ్రామీణ కమ్యూనిటీల ఎదుగుదల మరియు అభివృద్ధికి కూడా కట్టుబడి ఉంది.
ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డిజి) 6.1 కు ఎఫ్ఎంసి కట్టుబడి ఉంది, ఇది 2030 నాటికి అందరికీ సురక్షితమైన మరియు తక్కువ ధర వద్ద త్రాగునీటిని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఐక్యరాజ్య సమితి యొక్క ఒక నివేదిక ప్రకారం భారతదేశం నీటి నాణ్యత సూచికలో 122 దేశాలలో 120 వ స్థానంలో ఉంది, మరియు భారతదేశంలోని నీటి సరఫరాలో సుమారుగా 70 శాతం నీరు కలుషితం అయింది. భారతదేశంలో తగినంతగా లేని సురక్షితమైన త్రాగు నీరు, దేశం యొక్క ఆరోగ్య సంరక్షణ, సామాజిక మరియు ఆర్థిక రంగాలను ప్రభావితం చేస్తోంది.
భారతదేశంలోని 163 మిలియన్లకు పైగా ప్రజలకు వారి రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి త్రాగునీరు అందడం లేదు. ఫలితంగా, భారతదేశంలో దాదాపుగా 400 మిలియన్ల ప్రజలు కలుషిత నీటి వలన కలిగే వ్యాధులచే బాధపడుతున్నారు మరియు 500 కంటే ఎక్కువమంది పిల్లలు ప్రతి రోజూ అతిసార వ్యాధితో మరణిస్తున్నారు. మహిళలు మరియు బాలికలు దూరప్రాంతం మరియు అసురక్షిత ప్రదేశాల నుండి నీటిని తెచ్చుకోవడానికి మిలియన్ల కొద్దీ గంటల సమయాన్ని వెచ్చించి ఉత్పాదకతను కోల్పోవడంతో పాటుగా అదనంగా కలుషిత నీటి వలన కలిగే వ్యాధుల కారణంగా సుమారు అర్ధ బిలియన్ డాలర్ల విలువైన పని దినాలు ప్రతి సంవత్సరమూ నష్టపోవడం జరుగుతోంది. గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న 70% జనాభా తీవ్రమైన నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు, ఈ సమస్య మరీ ఎక్కువగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.
భారతదేశంలోని గ్రామీణ సమాజాలకు త్రాగునీటిని అందుబాటులోకి తీసుకురావడానికి ఎఫ్ఎంసి ఒక బహుళ వార్షిక కార్యక్రమం – సమర్థ్ ను ప్రారంభించింది. 2019 లో ఉత్తర ప్రదేశ్ నుండి సమర్థ్ (సమర్థ్ అనేది ఒక హిందీ పదం, దాని అర్థం సాధికారత) ప్రారంభించబడింది మరియు ఇప్పుడు భారతదేశంలో మరిన్ని రాష్ట్రాలకు విస్తరించబడుతోంది.
ముఖ్యాంశాలు దశ 1, 2019
- గంటకు 2000 లీటర్లు, రోజుకు 48 కిలోలీటర్ల నీటిని వడబోసే సామర్థ్యంతో ఉత్తర ప్రదేశ్‌లో 15 నీటి వడబోత ప్లాంటులు నెలకొల్పబడ్డాయి.
- 60 లబ్ధిదారు గ్రామాలు, దాదాపుగా 40000 అవసరమున్న రైతు కుటుంబాలకు సేవలు అందించబడ్డాయి.
- పంపిణీ యూనిట్లు స్వైప్ కార్డుల ద్వారా నియంత్రించబడతాయి. ప్రతి స్వైప్ 20 లీటర్లను విడుదల చేస్తుంది.
- ప్రతి రోజుకు 18-20-లీటర్ల నీటి కేటాయింపుతో ప్రతి కుటుంబం ఒక స్వైప్ కార్డును పొందుతుంది.
- ఈ ప్లాంట్లు సహకార ప్రాతిపదికన గ్రామ కమ్యూనిటీ ద్వారా నిర్వహించబడతాయి. ఎఫ్ఎంసి సిబ్బంది, శిక్షణ మరియు నిర్వహణ కోసం స్థానిక కమ్యూనిటీలకు మద్దతు ఇస్తుంది.
ముఖ్యాంశాలు దశ 2, 2020
- ఉత్తర ప్రదేశ్‌లో 20 కమ్యూనిటీ నీటి వడబోత (శుద్ధి) ప్లాంట్లు ఇంకా నెలకొల్పబడుతూ ఉన్నాయి.
- పంజాబ్ రాష్ట్రములో 9 కమ్యూనిటీ నీటి వడబోత (శుద్ధి) ప్లాంట్లు ఇంకా నెలకొల్పబడుతూ ఉన్నాయి.
- 100 లబ్ధిదారు గ్రామాలు, దాదాపుగా 80,000 అవసరమున్న రైతు కుటుంబాలు సేవలు అందించడానికి లక్ష్యంగా చేసుకోబడ్డాయి.
- పంపిణీ యూనిట్లు స్వైప్ కార్డుల ద్వారా నియంత్రించబడతాయి. ప్రతి స్వైప్ 20 లీటర్లను విడుదల చేస్తుంది.
- ప్రతి రోజుకు 18-20-లీటర్ల నీటి కేటాయింపుతో ప్రతి కుటుంబం ఒక స్వైప్ కార్డును పొందుతుంది.
- ఎఫ్ఎంసి సిబ్బంది, శిక్షణ మరియు నిర్వహణ కోసం స్థానిక కమ్యూనిటీలకు మద్దతు ఇస్తుంది.