ఫార్మింగ్ కమ్యూనిటీకి సేవ అందించడానికి మరియు భారతదేశంలో స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఎఫ్ఎంసి ఇండియా నిరంతరం దానిని ఇన్నోవేట్ చేస్తుంది. 2018 యొక్క ద్వితీయార్ధములో భారతదేశంలో మొక్క జొన్న పంటలపై దాడి చేసిన కత్తెర పురుగు (ఎఫ్ఎడబ్ల్యూ) యొక్క తాకిడి ముప్పును పరిష్కరించడానికి గాను, ఎఫ్ఎంసి, ఇండియాలోని ఒక సైన్స్ అడ్వొకసీ సలహా సంస్థ అయిన దక్షిణ ఆసియా బయోటెక్ కన్సార్టియం (ఎస్ఎబిసి) తో ఒడంబడికను కుదుర్చుకొంది. ఈ ప్రాజెక్ట్ ఈ క్రింది ఉద్దేశ్యాలతో ఎఫ్ఎంసి ప్రాజెక్ట్ సఫల్ (కత్తెర పురుగు నుండి వ్యవసాయం మరియు రైతులను రక్షించుట) గా పేర్కొనబడింది:
- ప్రతిష్టాత్మకమైన దేశీయ మరియు అంతర్జాతీయ వనరుల నుండి శాస్త్రీయ డేటా మరియు అనుభవం మరియు పరిశీలించదగిన నివేదికల ఆధారంగా కత్తెర పురుగు పై ఒక విజ్ఞాన వనరును అభివృద్ధి చేయడం
- సమీకృత కీటక యాజమాన్యము (ఐపిఎం) యొక్క వ్యవసాయ పద్ధతులను ప్రదర్శించి చూపడానికై సంబంధిత కృషి విజ్ఞాన్ కేంద్రాల (కెవికె లు) సమన్వయ సహకారంతో క్షేత్ర స్థాయి వ్యవసాయ ప్రదర్శనా క్షేత్రాలను నిర్వహించడం
- సమాచారాన్ని విస్తరింపజేయడానికి గాను నెట్‌వర్క్ మరియు సంస్థల రిపోజిటరీతో ఎఫ్ఎడబ్ల్యు పై ప్రత్యేక వెబ్-ఆధారిత పోర్టల్
- సామర్థ్య పెంపుదల మరియు నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం
ఈ ప్రాజెక్ట్ ఎఫ్ఎంసి ఏషియా పసిఫిక్ రీజియన్ ప్రెసిడెంట్ శ్రీమతి బెత్‌వైన్ టోడ్, ఎఫ్ఎంసి ఇండియా ప్రెసిడెంట్ శ్రీ ప్రమోద్ మరియు ఎఫ్ఎంసి ఇండియా లీడర్‌షిప్ టీమ్ యొక్క సభ్యుల ద్వారా ప్రారంభించబడింది. ప్రాజెక్ట్ సఫల్ ఒక కేస్ స్టడీగా తయారయింది. అంతర్జాతీయ సస్య రక్షణ సదస్సు, ఏషియన్ సీడ్ కాంగ్రెస్, ఎఫ్ఎడబ్ల్యు కాన్ఫరెన్స్ ఇండోనేషియా మొదలైనటువంటి వివిధ అంతర్జాతీయ మరియు స్థానిక వేదికలలో ఇది ఒక ఆదర్శవంతమైన అట్టడుగు స్థాయి నుండి చేపట్టదగిన విస్తరణ ప్రాజెక్టుగా ఎన్నో ప్రశంసలు మరియు గుర్తింపును పొందినది.
గడచిన 18 నెలల పాటుగా పనిచేస్తున్న ప్రాజెక్ట్ సఫల్ ఇప్పుడు రైతులు మరియు ప్రభుత్వ అధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కెవికె, ఎన్జిఓలు మొదలైన ఇతర భాగస్వాములు అందరి వద్ద ఎఫ్ఎడబ్ల్యు పై అద్భుతమైన అవగాహనకు దారితీసింది. ఈ భయానకమైన పురుగును నియంత్రించడానికి ఇది మంచి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది మరియు అవగాహన మరియు సామర్థ్య పెంపుదల ద్వారా దేశం ఈ పురుగును సమర్థవంతంగా మరియు సకాలములో ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.
ప్రాజెక్ట్ www.fallarmyworm.org.in కింద అభివృద్ధి చేయబడిన ఫ్యా వెబ్‌సైట్ పెస్ట్ చుట్టూ భారతదేశంలో జరుగుతున్న అన్ని అభివృద్ధిలకు ప్రామాణిక మరియు సూచనగా మారింది. అవగాహన కల్పించడానికి గాను తయారు చేయబడిన పోస్టర్లు, కరపత్రాలు, బొమ్మలు మొదలైనటువంటి ప్రోత్సాహక సామాగ్రి, మొక్క జొన్నను పండిస్తున్న రాష్ట్రాలలోని వ్యవసాయ శాఖలు మరియు విశ్వవిద్యాలయాల ద్వారా విస్తృతంగా ఉపయోగించబడ్డాయి.
అద్భుతమైన ఫలితాలను అందించడానికి గాను, కార్పొరేట్ వ్యవహారాలు, రెగ్యులేటరీ, పరిశోధన మరియు అభివృద్ధి మరియు వాణిజ్య బృందాలతో సన్నిహితంగా పనిచేస్తూ టీమ్ వర్క్ ద్వారా ప్రాజెక్ట్ సఫల్ శ్రేష్టతలో ఎఫ్ఎంసి సంస్కృతిని ఉదాహరణగా చూపించింది. ప్రాజెక్ట్ యొక్క వార్షిక నివేదిక ఇటీవల న్యూఢిల్లీలో ఆవిష్కరించబడింది.
ఈ ప్రతిష్టాత్మక విజ్ఞాన నాయకత్వ కార్యక్రమాన్ని ప్రారంభించి 2 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి అయ్యాయి మరియు ఇప్పటికే సఫల్ బృందం ఎవరూ సాధించని విజయాలను అందుకుంది.
“మా విస్తృత ప్రపంచ జ్ఞానం మరియు సుస్థిరమైన పరిష్కారాల ద్వారా భారతదేశ రైతులకు సేవలు అందించడానికి మేము ఈ అవకాశాన్ని కలిగి ఉన్నందుకు సంతోషిస్తున్నాము", అని మా ముంబై ప్రధాన కార్యాలయం నుండి మే 2019 లో ప్రాజెక్టును ప్రారంభిస్తున్న సందర్భంగా బెత్‌వైన్ అన్నారు.
“ప్రాజెక్ట్ సఫల్ అనేది, భారతీయ రైతులు తమ పంటలను కత్తెర పురుగు వంటి భయంకరమైన పురుగుల నుండి రక్షించడానికి ఎఫ్ఎంసి చూపిన చొరవలలో ఒకటి, అది రైతుల ఆదాయం పెంపొందడానికి మరియు వ్యవసాయ సుస్థిరతకు దారితీస్తుంది. ప్రాజెక్ట్ సఫల్ తో ఈ కృషిలో ఎస్ఎబిసి ని భాగస్వామ్యం చేయడం పట్ల మేము గర్వపడుతున్నాము." - అన్నారు ఎఫ్ఎంసి ఇండియా ప్రెసిడెంట్, ఎజిఎస్ బిజినెస్ డైరెక్టర్ శ్రీ ప్రమోద్ తోటా గారు.
“లోతట్టు ప్రాంతాలలోని వ్యవసాయ విస్తరణ వ్యవస్థలో మేము చెప్పుకోదగిన విప్లవాన్ని సాధించగలిగాము. భారతదేశంలో సామాజిక-ఆర్థిక, ఆహార మరియు దాణా భద్రతకు అడ్డంకిని నివారించడంలో సహాయపడటానికి మేము ఐసిఎఆర్ సంస్థలు, కెవికెలు, ఎస్ఎయు లు మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖలు మరియు స్వచ్ఛంద సంస్థలతో సహా వివిధ ఏజెన్సీలను విజయవంతంగా ఒక్క తాటి పైకి తీసుకురాగలిగాము", - డాక్టర్ సి డి మాయీ, అధ్యక్షుడు, దక్షిణ ఆసియా బయోటెక్నాలజీ సెంటర్.
“ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ, రెగ్యులేటరీ, పరిశోధనా మరియు అభివృద్ధి మరియు వాణిజ్య బృందాలతో సహా ఎఫ్ఎంసి బృందం యొక్క ఉత్తమ ప్రయత్నం వలన ప్రాజెక్ట్ విజయవంతం అయింది. ఎపిఎసి స్థాయిలో ప్రాజెక్ట్‌కి లభించిన అంతర్గత గుర్తింపు చాలా సంతృప్తికరంగా ఉంది" - రాజు కపూర్, హెడ్-పబ్లిక్ మరియు పారిశ్రామిక వ్యవహారాలు.