భారతదేశ ప్రజలకు వెన్నుదన్నుగా నిలబడటానికి తమ నిబద్ధతలో భాగంగా వారు విధ్వంసకరమైన కోవిడ్-19 యొక్క రెండవ దశతో పోరాడటం కొనసాగిస్తున్నందున, ఎఫ్ఎంసి ఇండియా, కరోనావైరస్ పై సమగ్ర అవగాహనను పెంచడానికి మరియు గ్రామీణ కమ్యూనిటీల మధ్య వ్యాప్తిని అడ్డుకోవడంలో సహాయపడేందుకు దేశంలో ఒక బహుళ-ఛానల్ అవగాహనా ప్రచారోద్యమాన్ని నడపడం ప్రారంభించింది.
20 రోజులకు పైగా రోజువారీ ఎపిసోడ్లను వరుసగా ప్రసారం చేయడానికి గాను ఎఫ్ఎంసి, ఎఆర్‌డిఇఎ (వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి మరియు పర్యావరణ అవగాహన) ఫౌండేషన్ మరియు డిజిటల్ మీడియా ఛానెల్ గ్రీన్ టీవీతో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. ప్రతి సంభాషణాత్మక ఘట్టములో ఒక వైద్య నిపుణులు ఉంటారు, వారు వ్యాధి యొక్క వివిధ అంశాలపై వీక్షకులకు అవగాహన కల్పిస్తారు మరియు ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా ప్రశ్నలకు సమాధానం ఇస్తారు.
"మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పరీక్ష మరియు చికిత్స పై అయిష్టత మరియు కోవిడ్-19 లక్షణాలపై పరిమిత జ్ఞానం వలన గ్రామీణ ప్రాంత ప్రజలు మరింత ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు ” అని ఎఫ్ఎంసి ఇండియా యొక్క జాతీయ సేల్స్ మరియు మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీ రవి అన్నవరపు గారు అన్నారు. కరోనావైరస్ నుండి భారతీయ లోతట్టు ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించి రక్షించాల్సిన అవసరం ఉంది. మా కమ్యూనిటీ సాధికారతా చొరవ అయిన ప్రాజెక్ట్ సమర్థ్‌కు అనుగుణంగా, ఎఫ్ఎంసి ఇండియా, ప్రజలు సంక్రమణకు గురి కావడం నుండి తమకు తాముగా రక్షించుకొనే చర్యలను తీసుకోవడానికి సహాయపడేందుకు ఒక నివారణ విధానాన్ని ఎంచుకుంది.”
1.3 మిలియన్ల కంటే ఎక్కువ మంది వీక్షకులను చేరుకోవాలని ఆశిస్తూ, ఈ సిరీస్ "కోవిడ్-రహిత గ్రామం" అర్హత కల్పించబడింది" మరియు జూన్ 1, 2021 నుండి ప్రతి రోజు ఉదయం 8:30am కి గ్రీన్ టీవీ ఫేస్‌బుక్ మరియు యూట్యూబ్ ఛానెళ్లపై ప్రసారం చేయబడుతుంది మరియు చివరి ఎపిసోడ్ జూన్ 20, 2021 నాడు ప్రసారం చేయడానికి షెడ్యూల్ చేయబడినది. మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడానికి గాను ఈ ఎపిసోడ్‌లు ఎఫ్ఎంసి ఇండియా యొక్క ఫేస్‌బుక్ మరియు యూట్యూబ్ ఛానెళ్లపై కూడా పోస్ట్ చేయబడతాయి.
20-రోజుల సిరీస్‌కు అదనంగా, కోవిడ్-సముచిత ప్రవర్తనపై ఒక చిన్న అవగాహన చిత్రం త్వరలోనే విడుదల చేయబడుతుంది. ఎఫ్ఎంసి తన సోషల్ మీడియా ఛానెళ్ల ద్వారా రైతులతో కోవిడ్-19 పై అవగాహన సమాచారాన్ని మరియు చిట్కాలను పంచుకోవడం కొనసాగిస్తుంది.
ఒకవేళ, మీరు ప్రత్యక్ష ప్రసార సెషన్లను చూడకపోయి ఉంటే, వాటిని మీరు ఇక్కడ చూడవచ్చు: