పంత్ నగర్, ఏప్రిల్ 29, 2022: తేనెటీగల పెంపకం ద్వారా గ్రామీణ మహిళల్లో వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి, వారి కుటుంబాలకు స్థిరమైన ఆదాయాన్ని ఉత్పత్తి చేయడానికి మరియు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రముఖ వ్యవసాయ విజ్ఞాన సంస్థ ఎఫ్‌ఎంసి ఇండియా నేడు గోవింద్ వల్లభ్ పంత్ వ్యవసాయ, సాంకేతిక పరిజ్ఞాన విశ్వవిద్యాలయంతో (జిబి పంత్ విశ్వవిద్యాలయం) తన సహకారాన్ని ప్రకటించింది.
మధుశక్తి (హిందీలో మధు అంటే "తేనె" మరియు శక్తి అనేది "స్త్రీ శక్తి"ని సూచిస్తుంది) అనే పేరుతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా చేపట్టిన ఒక వినూత్నమైన, స్థిరమైన అభివృద్ధి చొరవ. మూడు సంవత్సరాల పాటు కొనసాగే ఈ ప్రాజెక్టు ముఖ్యంగా హిమాలయ పర్వత శ్రేణుల దిగువ ప్రాంతంలో ఉన్న ఉత్తరాఖండ్ గ్రామీణ ప్రాంతం కోసం ప్లాన్ చేయబడింది, ఇక్కడ తేనె ఉత్పత్తికి ఉపయోగపడే సహజ మూలికలు మరియు వృక్షజాలం పుష్కలంగా ఉంది. ఉత్తరాఖండ్‌లోని జనాభాలో దాదాపు 53 శాతం మంది కొండలు మరియు పర్వతాలలో నివసిస్తున్నారు, వీరిలో 60 శాతం మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు.
ఎఫ్‌ఎంసి ఇండియా అధ్యక్షుడు శ్రీ అన్నవరపు రవి గారు మాట్లాడుతూ “మధుశక్తి ప్రాజెక్టుతో మేము వ్యవసాయ రంగంలో మహిళలకు స్థిరమైన వ్యాపార అవకాశాలతో సాధికారతను కల్పిస్తూ, గ్రామీణ కుటుంబాల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నాము. అలాగే, రాబోయే తరాల కోసం పర్యావరణాన్ని పరిరక్షిస్తూ సురక్షితమైన మరియు పోషకాలతో నిండిన ఆహార సరఫరాను నిర్వహించే రైతులకు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో మా నిబద్ధతలో స్థిరమైన వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతని అందిస్తున్నాము. ఈ ప్రాజెక్టు విజయవంతం కావడం అనేది, భారతదేశంలోని మహిళా రైతులను తేనెటీగల పెంపకాన్ని ఒక ఫలవంతమైన ప్రయత్నంగా చూడటానికి ప్రోత్సహించడమే కాకుండా, సాంద్ర వ్యవసాయం కింద పరాగ సంపర్కం కోసం దోహదపడే కీటకాలు మొదలైన వాటి పరిరక్షణకు సంబంధించిన ప్రపంచవ్యాప్తపు ఆందోళనను కూడా పరిష్కరిస్తుంది.”
ప్రాజెక్టులో భాగంగా సితార్‌గంజ్, కోటాబాగ్ గ్రామీణ ప్రాంతాలు మరియు అల్మోరా, రాణిఖెట్ పట్టణాల నుండి మహిళలను ఎంపిక చేసి తేనెటీగల పెంపకంలో శిక్షణ ఇస్తారు. రైతుల నుండి తేనెపట్టు ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి విశ్వవిద్యాలయంలోని హనీ బీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (హెచ్‌బిఆర్‌టిసి) సంస్థ తేనెటీగల పెంపకం, వాటి సంబంధింత ఉత్పత్తుల కోసం రైతులకు చెల్లించడానికి, మార్కెటింగ్ చేయడానికి ప్రత్యేక నిధులను ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రాజెక్టు పరాగ సంపర్కం ప్రవర్తనను నిశితంగా పర్యవేక్షిస్తుంది, దేశవ్యాప్తంగా తేనెటీగల పెంపకందారులకు ప్రయోజనం చేకూర్చే శాస్త్రీయ పరిజ్ఞానం సంపదను ఉత్పత్తి చేస్తుంది.
ప్రాజెక్టు మధుశక్తి విజయం అనేది దేశంలోని అనేక మంది మహిళా రైతులను తేనెటీగల పెంపకాన్ని ఒక వ్యవస్థాపక వ్యాపారంగా స్వీకరించడానికి ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఉత్తరాఖండ్‌లో పరాగ సంపర్కాల సాంద్రతలో పెరుగుదల అనేది పరాగసంపర్క రేటు పెరుగుదలలో మార్పుకు కారణం అవుతుందని మరియు వ్యవసాయ ఉత్పాదకతకు తోడ్పడే జీవవైవిధ్య వృద్ధికి సహకరిస్తుందని భావిస్తున్నారు. ప్రాజెక్టు ఇతర లక్ష్యాలలో తేనెటీగలను పరిరక్షణలో కీటక నాశినిల సరైన, వివేకవంతమైన వినియోగానికి దారితీసే మంచి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం లాంటివి కూడా ఉన్నాయి.
జిబి పంత్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ చౌహాన్ మాట్లాడుతూ “తేనెటీగల పెంపకం రాష్ట్రంలోని గ్రామీణ మహిళలకు కనీస పెట్టుబడితో బహుళ ప్రయోజనాలను కల్పించే, అదనపు ఆదాయాన్ని తెచ్చిపెట్టే అత్యంత స్థిరమైన వ్యాపార అవకాశాలలో ఒకటి. పుష్కలమైన వృక్షజాలం ఉన్న ఈ రాష్ట్రంలో తేనెటీగలు విస్తృతమైన తేనెను ఉత్పత్తి చేస్తాయి మరియు జీవావరణ వ్యవస్థను సమతుల్యంగా ఉంచుతాయి. ఈ ప్రాజెక్టు పర్యావరణానికి మాత్రమే కాకుండా వ్యక్తిగత రైతులకు కూడా విజయం చేకూరుస్తుంది.”
ఉత్తరాఖండ్ వంటి అత్యంత జీవవైవిధ్యం గల రాష్ట్రం తేనెటీగల పెంపకానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ రాష్ట్రం 12,500 మెట్రిక్ టన్నుల తేనెను ఉత్పత్తి చేస్తుంది. మధుశక్తి వంటి ఒక వినూత్నమైన చొరవతో ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంచనాలు కొనసాగుతున్నాయి.
తేనెటీగల పెంపకం అనేది అత్యంత ఆకర్షణీయమైన,లాభదాయకమైన గ్రామీణ వ్యవసాయ ఆధారిత సంస్థ, దీనికి ఎలాంటి అధునాతన సాంకేతికత లేదా మౌలిక సదుపాయాలు అవసరం లేదు,, కనీస పెట్టుబడి మాత్రమే అవసరం అవుతుంది. ఇది వ్యవసాయ రంగంలో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి సమగ్ర వ్యవసాయ వ్యవస్థలో అనుబంధ కార్యాచరణకు ఉత్తమంగా సరిపోతుంది.
ఈ ప్రాజెక్టు, జి.బి. పంత్ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎ.కె. శుక్లా, ఎఫ్‌ఎంసి ఇండియా అధ్యక్షుడు అన్నవరపు రవి, విశ్వవిద్యాలయం డైరెక్టర్ రీసెర్చ్ డాక్టర్ అజీత్ నైన్, ప్రజా మరియు పారిశ్రామిక వ్యవహారాల ఎఫ్‌ఎంసి డైరెక్టర్ రాజు కపూర్, ఎఫ్‌ఎంసి స్టీవార్డ్‌షిప్ లీడ్ ఫర్ ఆసియా పసిఫిక్ ఎస్లీ ఎన్‌జీ వంటి పలువురు ప్రముఖుల సమక్షంలో విజయవంతంగా ప్రారంభించబడింది.
ఎఫ్ఎంసి పరిచయం
ఎఫ్‌ఎంసి అనేది ఒక ప్రపంచ స్థాయి వ్యవసాయ విజ్ఞాన సంస్థ. ఇది పెరుగుతున్న ప్రపంచ జనాభాకు సరిపడా ఆహార ధాన్యాలు, పంటలను మరియు ఇంధనాన్ని, మారుతున్న వాతావరణానికి అనుగుణంగా ఉత్పత్తి చేసే సాగుదారులకు సహాయం చేయడానికి కట్టుబడి ఉంది. ఎఫ్‌ఎంసి సంస్థ నుండి వినూత్నమైన పంట సంరక్షణ పరిష్కారాలు - జీవావరణ వ్యవస్థ, పంట పోషణ, డిజిటల్ మరియు ఖచ్చితమైన వ్యవసాయంతో సహా - సాగుదారులు, పంట సలహాదారులు మరియు టర్ఫ్, పెస్ట్ మేనేజ్‌మెంట్ నిపుణులు పర్యావరణాన్ని పరిరరక్షించడంలో వారికి ఎదురయ్యే ఆర్థికపరమైన సవాళ్లను పరిష్కరించుకోవడానికి వీలు కల్పిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 100 పైగా ప్రాంతాల్లో సుమారు 6,400 మంది ఉద్యోగులతో నిర్మితమై ఉన్న ఎఫ్‌ఎంసి సంస్థ, కొత్త కలుపు నాశిని, కీటక నాశిని మరియు శిలీంద్ర నాశిని క్రియాశీల పదార్థాలు, ఉత్పత్తి సూత్రీకరణలను మరియు మన గ్రహ పరిరక్షణ కోసం స్థిరంగా మెరుగ్గా ఉండే మార్గదర్శక సాంకేతికతలను కనుగొనడానికి కట్టుబడి ఉంటుంది. సందర్శించండి fmc.com మరియు ag.fmc.com/in/en మరింత తెలుసుకోవడానికి మరియు ఎఫ్ఎంసి ఇండియాను ఫాలో అవ్వడానికి ఫేస్‌బుక్® మరియు యూట్యూబ్®.