సుస్థిర వ్యవసాయం పట్ల తన నిబద్ధతకు అనుగుణంగా, రైతులకి నిర్వహణ యొక్క విలువను వివరిస్తూ దేశవ్యాప్త ప్రచారం, అదే విధంగా దేశవ్యాప్తంగా మొక్కలను నాటే కార్యక్రమంతో కూడిన జాతీయ-వ్యాప్త ప్రచారోద్యమముతో ఎఫ్ఎంసి ఇండియా జూన్ 5, 2021 నాడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నది.
రాబోయే ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని, రైతు కమ్యూనిటీలో 28,000 కంటే ఎక్కువ మందిని చేరుతూ 16 రాష్ట్రాల వ్యాప్తంగా 730 రైతుల సమావేశాలను ఎఫ్ఎంసి నిర్వహించింది. వ్యవసాయ ఉత్పాదకతను గరిష్టంగా పెంచడానికి మరియు పర్యావరణ నష్టాన్ని కనీస స్థాయికి తగ్గించడానికి గాను వ్యవసాయ పెట్టుబడుల యొక్క సమర్థవంతమైన, సురక్షితమైన మరియు న్యాయపరమైన వాడకంపై కంపెనీ యొక్క క్షేత్ర సాంకేతిక నిపుణులు రైతులకు అవగాహన కల్పించారు. వీటిలో మోతాదు రేట్లు, వాడకపు పనిముట్ల యొక్క సరైన రక్షణ, సరైన మిశ్రమం మరియు పిచికారీ పద్ధతులు వంటి మంచి వ్యవసాయ పద్ధతులపై శిక్షణలు ఉన్నాయి.
ఎఫ్ఎంసి ఇండియా ప్రెసిడెంట్ శ్రీ ప్రమోద్ తోట గారు మాట్లాడుతూ "ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి మా కృషి సుస్థిర వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి గాను ఉత్తమ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడంపై ఉండినది” అన్నారు. సుస్థిరత్వం అనేది ఎఫ్ఎంసి యొక్క ప్రధాన విలువలలో ఒకటి మరియు మేము భారతదేశంలో రైతులకు మద్దతు ఇచ్చే చౌకైన వ్యవసాయ-పర్యావరణ సాంకేతికతలను అభివృద్ధి చేసే దిశగా పని చేస్తున్నాము. మెరుగైన భవిష్యత్తు కోసం సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి గాను మా క్షేత్ర సాంకేతిక నిపుణుల్లో 2,000 కంటే ఎక్కువ మంది ప్రతి సంవత్సరమూ రెండు మిలియన్ల మందికి పైగా రైతులతో నిమగ్నమై ఉంటారు. ప్రాజెక్ట్ సమర్థ్ మరియు ఉగమ్ వంటి వివిధ చొరవలు మరియు కమ్యూనిటీ అవుట్‌రీచ్ కార్యక్రమాల ద్వారా రైతు సమాజమును సాధికారపరచడం మరియు వారి జీవన ప్రమాణాలను పెంచడం మా లక్ష్యంగా ఉంది.”
“నైతిక విలువలు కలిగిన ఉత్పత్తి నిర్వహణ మరియు ఉత్పత్తి జీవిత కాలంలో వ్యవసాయ ఉత్పత్తుల యొక్క నైతిక, సురక్షితమైన మరియు సుస్థిరమైన వినియోగానికి ఎఫ్ఎంసి కట్టుబడి ఉంది," అని చెప్పారు.
ఉత్పత్తి ఆవిష్కరణ నుండి వినియోగదారుని వాడకం మరియు వ్యర్థమైన లేదా ఖాళీ డబ్బాలను పారవేయడం వరకు ఉత్పత్తి జీవన చక్రంలోని ప్రతి దశను ఉత్పత్తి నిర్వహణ అనుసంధానం చేస్తుంది.
భారతదేశంలో మూడు దశాబ్దాలకు పైగా సుస్థిరత్వాన్ని ముందుకు నడపడానికి మరియు ఉత్పాదకతను మెరుగుపరచడానికి అన్నిరకాల పంటలు మరియు భౌగోళిక ప్రాంతాల వ్యాప్తంగా భారతీయ రైతులతో ఎఫ్ఎంసి భాగస్వామ్యం నెరుపుతుంది మరియు కంపెనీ యొక్క సుస్థిరత్వ లక్ష్యాలతో అనువుగా ఉండే తన ఉత్పత్తి నిర్వహణను బలోపేతం చేసే చొరవలలో మరింత పెట్టుబడి పెట్టడానికి ప్రణాళిక చేస్తోంది.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తన కృషి, ప్రయత్నాలలో భాగంగా, ఎఫ్ఎంసి ఇండియా దేశవ్యాప్తంగా 9,000 కంటే ఎక్కువ మొక్కలను నాటింది.