ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

భారతదేశం యొక్క కెమికల్స్ మరియు పెట్రోకెమికల్స్ అవార్డులు 2021 ప్రధానం సందర్భంగా ఎఫ్ఎంసి ఇండియా డిజిటల్ మరియు టెక్నాలజీ - ఎనేబుల్డ్ కంపెనీగా ప్రకటించబడింది

ఎఫ్ఎంసి ఇండియా మార్కెట్‌లో అగ్ర స్థానానికి చేరుకోవడమే కాకుండా ; భారతదేశంలోని రైతులకు పరిష్కారాలను అందించడానికి ఇది చేపడుతున్న ఆవిష్కరణల కోసం అవసరమైన గుర్తింపును కూడా పొందుతుంది. ఇటీవల పొందిన జాతీయ గుర్తింపులో, న్యూఢిల్లీలోని హోటల్ తాజ్ ప్యాలెస్‌లో మార్చి 17th నాడు జరిగిన కెమికల్స్ మరియు పెట్రోకెమికల్స్ అవార్డుల 2021 వేడుకలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్ఐసిసిఐ) వారిచే సంవత్సరం యొక్క డిజిటల్ మరియు టెక్నాలజీ-ఎనేబుల్డ్ కంపెనీగా ఎఫ్ఎంసి ఇండియా సత్కారమును పొందింది.

ఈ సంవత్సరం ప్రవేశ పెట్టబడిన డిజిటల్ మరియు టెక్నాలజీ ఎనేబుల్డ్ కంపెనీ అవార్డు విభాగం సహా 16 విభాగాలలో భారతీయ కెమికల్ పరిశ్రమకి వ్యక్తులు మరియు సంస్థలు చేసిన సహకారాన్ని ఈ వార్షిక అవార్డుల కార్యక్రమం గుర్తిస్తుంది. రైతు స్థాయిలో చర్చ నుండి పంపిణీదారు మరియు రిటైలర్‌లతో సంప్రదింపుల వరకు వ్యవసాయ విలువ చైన్‌ను పూర్తిగా డిజిటైజ్ చేయడానికి ఎఫ్ఎంసి చేస్తున్న కృషికి గుర్తింపు పొందింది.

భారతదేశ ప్రభుత్వ కెమికల్స్ మరియు ఫెర్టిలైజర్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కెమికల్స్ మరియు పెట్రోకెమికల్స్ విభాగం సెక్రటరీ అయిన శ్రీ యోగేంద్ర త్రిపాఠి సమక్షంలో గౌరవనీయులైన కేంద్ర మంత్రి (స్వతంత్ర అధికారం), ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ మరియు కెమికల్స్ మరియు ఫెర్టిలైజర్స్ మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి అయిన శ్రీ మన్‌సుఖ్ మాండవియా నుండి ‌‌ ఎఫ్ఎంసి తరఫున ప్రజా మరియు పరిశ్రమ వ్యవహారాల డైరెక్టర్ అయిన శ్రీ రాజు కపూర్ గారు అవార్డును అందుకున్నారు.

మేము న్యాయనిర్ణేతలకు సమర్పించినట్టి అవిశ్రాంతమైన కఠోర శ్రమ పట్ల ఎఫ్ఎంసి ఇండియా కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ గొప్ప అభినందనలు తెలుపుతున్నాము! అలాగే, ఈ అవార్డు కొరకు మా ప్రయాణము యొక్క కార్యానికి మద్దతు ఇవ్వడంలో అద్భుతమైన కృషి చేసినందుకు గాను బకుల్, వికాస్ ఠక్కర్ మరియు అభయ్ అరోరా (పనోలి నుండి) గారికి గొప్ప ధన్యవాదాలు.

"పరిశ్రమచే గుర్తించబడటం అనేది మాకు ఎనలేని గౌరవం" అని ఎఫ్ఎంసి ఇండియా ప్రెసిడెంట్ శ్రీ ప్రమోద్ తోట గారు అన్నారు. "ఈ మహమ్మారి మన దేశం యొక్క వ్యవసాయ పరిశ్రమను గణనీయంగా దెబ్బతీసింది. వీటన్నింటి ద్వారా భారతదేశంలోని రైతులకు మద్దతును అందించే తన నిబద్ధతకు కట్టుబడి ఉండడానికి ఎఫ్ఎంసి ఇండియా ధృడ సంకల్పంతో ఉంది.”

 

FMC India names Digital enabled company