ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

వ్యవసాయ పరిశోధనను ప్రోత్సహించడానికి ఎఫ్ఎంసి ఇండియా సైన్స్ లీడర్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది

భారతదేశంలో ఎనిమిది రాష్ట్రాల్లోని ప్రధాన వ్యవసాయ పాఠశాలలకు ఎఫ్ఎంసి బహుళ-సంవత్సరాల స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని ఏప్రిల్ 2021 లో ప్రారంభించింది. ఎఫ్ఎంసి సైన్స్ లీడర్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ఔత్సాహిక శాస్త్రవేత్తలకు వ్యవసాయ పరిశోధనలో తమ అభిరుచిని అభివృద్ధి చేసుకోవడానికి వారికి మరిన్ని అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా కలిగి ఉంది.

ప్రతి సంవత్సరం, 20 స్కాలర్‌షిప్‌లు పిహెచ్‌డి చదివే 10 విద్యార్థులకు మరియు వ్యవసాయ శాస్త్రాలలో ఎంఎస్‌సి అధ్యయనాలను నిర్వహించే 10 విద్యార్థులకు అందించబడతాయి. ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించడానికి, సైన్స్ మరియు పరిశోధన పట్ల వారి ఆసక్తిని మరియు ఉత్సాహాన్ని పెంచడానికి ఎఫ్ఎంసి నేరుగా విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేస్తుంది. భారతదేశంలో ఎక్కువమంది మహిళలు వ్యవసాయ శాస్త్రాలు మరియు పరిశోధనలో వారి కెరీర్‌ను కొనసాగించడాన్ని ప్రోత్సహించడానికి మహిళా అభ్యర్థులకు 50 శాతం స్కాలర్‌షిప్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. ఇది పురుషులు మరియు మహిళలకు సమాన అవకాశాలను అందించడానికి మరియు ఒక వైవిధ్యమైన మరియు సమగ్ర కార్మిక శక్తిని సృష్టించడానికి ఎఫ్ఎంసి ఆశయానికి అనుగుణంగా ఉంటుంది.

"వ్యవసాయ పరిశ్రమలో అత్యంత బలమైన ఆవిష్కరణ మరియు అభివృద్ధిలలో ఒకదానికి మార్గనిర్దేశం చేయడానికి 800 కంటే ఎక్కువ మంది శాస్త్రవేత్తలు మరియు సహచరులతో ఎఫ్ఎంసి ప్రపంచ స్థాయి పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్&డి) సంస్థను నిర్మించింది "అని ఎఫ్ఎంసి ఇండియా అధ్యక్షుడు ప్రమోద్ తోట అన్నారు. "భారతదేశంలో ఈ విధానం యొక్క స్థిరత్వానికి మద్దతును అందించేందుకు, అంతర్జాతీయ శాస్త్రవేత్తలకు అదనంగా స్థానిక శాస్త్రవేత్తలను తయారు చేయడమే మా నైపుణ్య వ్యూహంగా ఉంది.”

ఉపకార వేతనాల కార్యక్రమం క్రింద, కంపెనీలో పూర్తి స్థాయి ఉపాధి అవకాశాలలో ప్రాధాన్యతను పొందడానికి అదనంగా, అవార్డు పొందిన వారికి వారి సమగ్ర అభివృద్ధి కోసం ఇంటర్న్‌షిప్ మరియు పరిశ్రమ మెంటర్‌షిప్ కూడా అందించబడుతుంది.

"భారతదేశంలో పరిశోధన మరియు అభివృద్ధి రంగం గణనీయంగా పురోగమిస్తుంది మరియు ప్రపంచ స్థాయిలో గుర్తింపును పొందుతోంది. ఎఫ్ఎంసి సైన్సెస్ లీడర్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ అందిస్తున్న ఇంటర్న్‌షిప్స్ ద్వారా, ఈ రంగంలో నిష్ణాతులు అయిన వ్యక్తుల మధ్య ఒక ప్రపంచ స్థాయి సంస్థలో పని చేసే అవకాశాన్ని విద్యార్థులు పొందుతారు," అని తోటా వివరించారు. "ఎఫ్ఎంసి అందించే స్కాలర్‌షిప్పుల ద్వారా సమర్థవంతులైన విద్యార్థులను ఆకర్షించి, శిక్షణ అందించి భారతదేశంలోని పరిశోధనా మరియు అభివృద్ధి రంగానికి అందించాలని కోరుకుంటున్నాము. వ్యవసాయ పరిశ్రమలోని లాభదాయకమైన కెరీర్లని ఎంచుకోమని మేము వారిని ప్రోత్సహించాలని అనుకుంటున్నాము, తద్వారా భారతదేశ పరిశోధన మరియు అభివృద్ధి రంగానికి సహాయపడి మన దేశాన్ని పరిశోధన మరియు ఆవిష్కరణలకి కేంద్రంగా నిలపాలని భావిస్తున్నాము.”

ప్రపంచంలోని అతి పెద్ద అత్యాధునిక పంట రసాయనాల కంపెనీగా, రైతులు అసంఖ్యాకమైన చీడపీడల నుండి తమ పంటలను రక్షించుకోవడానికి సహాయపడేందుకు గాను అందుబాటులో అనుకూలమైన పరిష్కారాలను ఇవ్వడానికి ఎఫ్ఎంసి ప్రతి సంవత్సరమూ పరిశోధన మరియు అభివృద్ధిపై వందలాది మిలియన్ల డాలర్లను పెట్టుబడి పెడుతోంది. ఎఫ్ఎంసి శాస్త్రవేత్తలు సాంకేతిక విజేతలుగా తయారయ్యే కొత్త అణువులను కనుగొనడం గురించి పట్టుదలగా ఉన్నారు. దాని ఫలితంగా, ఎఫ్ఎంసి యొక్క ప్రొప్రయిటరీ కీటక నాశునులు, కలుపు నాశునులు మరియు శిలీంద్ర నాశునులు యొక్క ప్రపంచ శ్రేణి ఉత్పత్తులు, అనేకం కొత్త చర్యా రూపాలను అందిస్తూ, ప్రతిష్టాత్మక పంట శాస్త్రాల సదస్సు మరియు అవార్డులలో అత్యుత్తమ పరిశోధన మరియు అభివృద్ధి పైప్‌లైన్ విభాగము వద్ద అగ్రశ్రేణి గౌరవాలతో ఈ రెండు సంవత్సరాలలో గుర్తించబడినది 2018 మరియు 2020.

ఎఫ్ఎంసి హైదరాబాద్‌లో ఒక అత్యాధునిక రసాయనశాస్త్ర ఆవిష్కరణ కేంద్రమును కలిగి ఉంది, ఇది భారతదేశం మరియు ప్రపంచం కోసం కొత్త అణు అన్వేషణలో నిమగ్నమై ఉంది, అదేవిధంగా లక్ష్యిత చీడపీడలపై అణువుల పరీక్షతో సహా జీవశాస్త్ర ఆవిష్కరణలు చేసే పరిశోధన మరియు అభివృద్ధి సౌకర్యమును గుజరాత్‌లో కలిగి ఉంది.