ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

పంట రక్షణ నిర్వహణను ప్రోత్సహించడానికి ఎఫ్ఎంసి ఇండియా మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన వ్యవసాయ శాఖతో ఉమ్మడి ప్రచారాన్ని ప్రారంభించింది

అకోలా, ఆగస్ట్ 31, 2022: వ్యవసాయ శాస్త్ర సంస్థ అయిన ఎఫ్ఎంసి ఇండియా నేడు మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వ్యవసాయ శాఖ భాగస్వామ్యంతో భారతదేశంలోని అకోలా జిల్లాలోని వ్యవసాయ సమాజానికి కీటక నాశినిల ఉపయోగం గురించి తన భద్రతా అవగాహన మరియు నిర్వహణ ప్రచారాన్ని మూడవ సంవత్సరం ప్రారంభించింది.



వ్యవసాయ సమాజంలో ప్రమాదవశాత్తూ విషప్రయోగం సంభవించే కేసులను నివారించే లక్ష్యంతో సురక్షితమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించడాన్ని ప్రోత్సహించడానికి 2020 లో అకోలాలో ఎఫ్ఎంసి ఇండియా ప్రారంభించిన ఇనీషియేటివ్‌పై ఈ సంవత్సరం ప్రచారం ఏర్పాటు చేయబడుతుంది.

ఎఫ్‌ఎంసి ఇండియా ప్రెసిడెంట్ శ్రీ రవి అన్నవరపు అవగాహన ప్రచారాన్ని వివరిస్తూ ఇలా చెప్పారు, "భారతదేశంలోని రైతు సంఘం సంక్షేమానికి ఎఫ్‌ఎంసి భారీగా పెట్టుబడి పెడుతోంది. అందుకని, మేము చాలా సంవత్సరాలుగా సురక్షితమైన మరియు స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణ ఇస్తున్నాము. 2021లో మా ప్రచారం అకోలాలోని వివిధ గ్రామాల్లోని 7,500 మంది రైతులకు చేరుకుంది మరియు ఈ సంవత్సరం ప్రచారం కొత్త స్థాయిలకు చేరుకుంటుందని మరియు వారి అవగాహన, జ్ఞానాన్ని మెరుగుపరచడానికి మరింత విస్తృతమైన రైతు సంఘాన్ని చేరుతుందని మేము గట్టిగా నమ్ముతున్నాము.”

image



ప్రచారంలో భాగంగా, వివిధ పంట కాలాలు మరియు పంట రకాలలో కీటక నాశినిల సరైన వినియోగం గురించి రైతు సమావేశాలు మరియు విద్యా సెషన్లను నిర్వహించడానికి ఎఫ్ఎంసి ఇండియా ప్రభుత్వ వ్యవసాయ శాఖ, ఆరోగ్య శాఖ మరియు కృషి విజ్ఞాన కేంద్రం (భారతదేశంలో వ్యవసాయ విస్తరణ కేంద్రాలు)తో కలిసి పని చేస్తుంది అకోలా అంతటా పెద్ద సంఖ్యలో గ్రామాలు మరియు రైతులకు విద్యా సెషన్‌లను అందించడానికి మొబైల్ వ్యాన్‌లు భారీ స్థాయిలో సమీకరించబడ్డాయి.



అకోలా జిల్లా సిఇఒ సౌరభ్ కటియార్, అకోలా జిల్లా జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ ప్రతిభాతై భోజనే, అదనపు సిఇఒ డాక్టర్ సౌరభ్ పవార్, అకోలా జిల్లా వ్యవసాయ సూపరింటెండెంట్ శ్రీ ఆరిఫ్ షా, మాజీ జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ శ్రీమతి పుష్పతాయి ఇంగలే, అకోలా జిల్లా వ్యవసాయ అభివృద్ధి అధికారి మిస్టర్ మురళీధర్ ఇంగలే, జిల్లా నాణ్యత నియంత్రణ అధికారి మిలింద్ జంజల్, ఎఫ్ఎంసి ఇండియా ఏరియా మార్కెటింగ్ మేనేజర్ మిస్టర్ హిరామన్ మండల్‌తో సహా గౌరవనీయ అతిథుల సమక్షంలో ఈ సంవత్సరం ప్రచారాన్ని ప్రారంభించారు.

image2

ప్రాజెక్ట్ సమర్థ్ (సురక్షితమైన నీటి చొరవ), ఉగమ్ (మంచి నేల ఆరోగ్య పద్ధతులను ప్రోత్సహించడం) మరియు ప్రాజెక్ట్ మధుశక్తి (తేనెటీగల పెంపకం ద్వారా గ్రామీణ మహిళల్లో వ్యవస్థాపకతను పెంపొందించడానికి జిబి పంత్ యూనివర్శిటీతో సహకారం) వంటి కార్యక్రమాలు మరియు ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌ల ద్వారా వ్యవసాయ సమాజానికి మద్దతు ఇవ్వడంలో ఎఫ్ఎంసి ఇండియాకు ఒక సుదీర్ఘమైన ట్రాక్ రికార్డ్ ఉంది.

ఎఫ్ఎంసి పరిచయం

ఎఫ్‌ఎంసి అనేది ఒక ప్రపంచ స్థాయి వ్యవసాయ విజ్ఞాన సంస్థ. ఇది పెరుగుతున్న ప్రపంచ జనాభాకు సరిపడా ఆహార ధాన్యాలు, పంటలను మరియు ఇంధనాన్ని, మారుతున్న వాతావరణానికి అనుగుణంగా ఉత్పత్తి చేసే సాగుదారులకు సహాయం చేయడానికి కట్టుబడి ఉంది. ఎఫ్‌ఎంసి సంస్థ నుండి వినూత్నమైన పంట సంరక్షణ పరిష్కారాలు - జీవావరణ వ్యవస్థ, పంట పోషణ, డిజిటల్ మరియు ఖచ్చితమైన వ్యవసాయంతో సహా - సాగుదారులు, పంట సలహాదారులు మరియు టర్ఫ్, పెస్ట్ మేనేజ్‌మెంట్ నిపుణులు పర్యావరణాన్ని పరిరరక్షించడంలో వారికి ఎదురయ్యే ఆర్థికపరమైన సవాళ్లను పరిష్కరించుకోవడానికి వీలు కల్పిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 100 పైగా ప్రాంతాల్లో సుమారు 6,400 మంది ఉద్యోగులతో నిర్మితమై ఉన్న ఎఫ్‌ఎంసి సంస్థ, కొత్త హెర్బిసైడ్, క్రిమిసంహారకాలు మరియు శిలీంద్ర సంహారిణి క్రియాశీల పదార్థాలు, ఉత్పత్తి సూత్రీకరణలను మరియు మన గ్రహ పరిరక్షణ కోసం స్థిరంగా మెరుగ్గా ఉండే మార్గదర్శక సాంకేతికతలను కనుగొనడానికి కట్టుబడి ఉంటుంది. ఫేస్‌బుక్® మరియు యూట్యూబ్® పై ఎఫ్ఎంసి ఇండియా గురించి మరింత తెలుసుకోవడానికి మరియు అనుసరించడానికి fmc.com మరియు ag.fmc.com/in/en ను సందర్శించండి.