ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

సైన్స్ లీడర్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ కోసం పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో ఎఫ్ఎంసి ఇండియా కలిసి పనిచేస్తుంది

24 జూన్, 2022:   వ్యవసాయ విజ్ఞాన సంస్థ ఎఫ్‌ఎంసి ఇండియా, నేడు దేశంలోని ప్రధాన వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన లుథియానాలోని పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ (పిఎయు)తో ఒక అవగాహన ఒప్పందం (ఎంఒయు)పై సంతకం చేసింది. వ్యవసాయ రంగంలో ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో భారతదేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లోని ప్రసిద్ధ వ్యవసాయ పాఠశాలలకు సహకారం అందిస్తూ ఎఫ్ఎంసి ఇండియా, మల్టీ-ఇయర్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లో ఒక భాగమైంది. ఎఫ్‌ఎంసి ఇండియా రీసెర్చ్ మరియు డెవలప్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ ఆనందకృష్ణన్ బలరామన్ మరియు, డాక్టర్ షమ్మీ కపూర్, ది రిజిస్ట్రార్, పిఎయూ మరియు డాక్టర్ (శ్రీమతి) సందీప్ బెయిన్స్ డీన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్,, ఇతర డైరెక్టర్లు, డీన్లు మరియు విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాల అధిపతుల సమక్షంలో ఎంఒయూపై సంతకం చేసారు.

పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీతో ఒప్పందం ప్రకారం వ్యవసాయ శాస్త్రాల్లో డాక్టరేట్ మరియు మాస్టర్స్ డిగ్రీలను అభ్యసిస్తున్న విశ్వవిద్యాలయం నుండి విద్యార్థులకు ఎఫ్ఎంసి సంవత్సరానికి నాలుగు స్కాలర్‌షిప్‌లను ప్రదానం చేస్తుంది. అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించడానికి మరియు శాస్త్ర మరియు పరిశోధన కోసం వారి పట్టుదలను అభివృద్ధి చేయడానికి గాను ఎఫ్ఎంసి విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేస్తుంది. వ్యవసాయ శాస్త్రాలు మరియు పరిశోధనల్లో ఎక్కువ మంది మహిళలు వృత్తిని కొనసాగించేలా ప్రోత్సహించడానికి మహిళా అభ్యర్థులకు యాభై శాతం స్కాలర్‌షిప్‌లు కేటాయించబడ్డాయి. స్కాలర్‌షిప్‌లతో పాటు ఎఫ్ఎంసి తన దీర్ఘకాలిక సహకార పరిశోధన వృత్తిని మరియు విశ్వవిద్యాలయంతో కొనసాగుతున్న వ్యూహాత్మక సంబంధాలను మరింత మెరుగుపరుస్తుంది.

“ఎఫ్ఎంసి సైన్స్ లీడర్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ అనేది వ్యవసాయ పరిశోధనలో తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలనుకునే ఔత్సాహిక శాస్త్రవేత్తలకు గొప్ప అవకాశాలను సృష్టించే లక్ష్యంతో రూపొందించబడింది. అదనంగా, ఎఫ్ఎంసి స్కాలర్‌షిప్‌ల ద్వారా అవార్డు గ్రహీతలకు వారి సంపూర్ణ అభివృద్ధి కోసం ఇంటర్న్‌షిప్ మరియు ఇండస్ట్రీ మెంటార్‌షిప్ అవకాశం అందించబడుతుంది. ఇది వ్యవసాయ పరిశ్రమలో లాభదాయకమైన వృత్తిని కొనసాగించడానికి విద్యార్థులను ప్రోత్సహిస్తుంది మరియు చివరికి వ్యవసాయ రంగంలో ఉద్భవిస్తున్న సమస్యలను పరిష్కరించడం ద్వారా భారతీయ వ్యవసాయ రంగానికి దోహదపడుతుంది,” అని ఎఫ్ఎంసి ఇండియా పరిశోధన మరియు అభివృద్ధి డైరెక్టర్ డాక్టర్ ఆనందకృష్ణన్ బలరామన్ పేర్కొన్నారు.

పిఎయూ రిజిస్ట్రార్ డాక్టర్ షమ్మీ కపూర్ వ్యవసాయం మరియు ఆహార రంగంలో సమగ్ర పరిష్కారాలను అందించినందుకు గాను మరియు వ్యూహం, ప్రణాళిక మరియు కార్యాచరణ ప్రణాళికల్లో రైతులను ముందంజలో ఉండేలా ఎఫ్ఎంసి చేసిన సహకారాన్ని ప్రశంసించారు. “ఎఫ్ఎంసి సైన్స్ లీడర్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ లాంటి స్కాలర్‌షిప్‌లు సంస్థల్లోని పండితుల యువ వినూత్న ఆలోచనలను ప్రేరేపించడం ద్వారా భవిష్యత్‌లో స్థిరమైన వ్యవసాయ సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో బలంగా సహాయపడతాయి. పరిశ్రమ నిపుణులను మార్గదర్శకులుగా చేర్చుకోవడం విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది మరియు దేశ వృద్ధికి మంచి సహకారం అందించడంలో వారికి సహాయపడుతుంది” అని డాక్టర్ కపూర్ పేర్కొన్నారు అకేషన్. 

 

Image

డాక్టర్ (మిసెస్) సందీప్ బెయిన్స్, డీన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్, పిఎయు కూడా విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులకు మద్దతు ఇచ్చినందుకు, వారి సబ్జెక్టు విభాగంలో వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఎఫ్ఎంసి తీసుకున్న చొరవను అభినందించారు. వివిధ విద్యా, పరిశోధన మరియు విస్తరణ కార్యక్రమాల్లో ప్రముఖ పరిశ్రమ భాగస్వాములతో పిఎయూ చేస్తున్న సహకారాలను ఆమె హైలైట్ చేశారు మరియు భవిష్యత్తు విద్యార్థులను తీర్చిదిద్దడంలో, ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో అలాంటి సహకారాల ప్రాముఖ్యతను గురించి నొక్కి చెప్పారు

అంతేకాకుండా పిఎయూ, ఎఫ్ఎంసి నిపుణులతో విశ్వవిద్యాలయాల పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల పరస్పర సంభాషణను కూడా నిర్వహించింది, ఇది విద్యార్థి సంఘం సాధారణంగా వ్యవసాయ పరిశ్రమలో మరియు ముఖ్యంగా ఎఫ్ఎంసిలో కెరీర్ అవకాశాలను అన్వేషించడంలో సహాయపడింది.

ఎఫ్ఎంసి పరిచయం

ఎఫ్‌ఎంసి అనేది ఒక ప్రపంచ స్థాయి వ్యవసాయ విజ్ఞాన సంస్థ. ఇది పెరుగుతున్న ప్రపంచ జనాభాకు సరిపడా ఆహార ధాన్యాలు, పంటలను మరియు ఇంధనాన్ని, మారుతున్న వాతావరణానికి అనుగుణంగా ఉత్పత్తి చేసే సాగుదారులకు సహాయం చేయడానికి కట్టుబడి ఉంది. ఎఫ్‌ఎంసి సంస్థ నుండి వినూత్నమైన పంట సంరక్షణ పరిష్కారాలు - జీవావరణ వ్యవస్థ, పంట పోషణ, డిజిటల్ మరియు ఖచ్చితమైన వ్యవసాయంతో సహా - సాగుదారులు, పంట సలహాదారులు మరియు టర్ఫ్, పెస్ట్ మేనేజ్‌మెంట్ నిపుణులు పర్యావరణాన్ని పరిరరక్షించడంలో వారికి ఎదురయ్యే ఆర్థికపరమైన సవాళ్లను పరిష్కరించుకోవడానికి వీలు కల్పిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 100 పైగా ప్రాంతాల్లో సుమారు 6,400 మంది ఉద్యోగులతో నిర్మితమై ఉన్న ఎఫ్‌ఎంసి సంస్థ, కొత్త కలుపు నాశిని, కీటక నాశిని మరియు శిలీంద్ర నాశిని క్రియాశీల పదార్థాలు, ఉత్పత్తి సూత్రీకరణలను మరియు మన గ్రహ పరిరక్షణ కోసం స్థిరంగా మెరుగ్గా ఉండే మార్గదర్శక సాంకేతికతలను కనుగొనడానికి కట్టుబడి ఉంటుంది. సందర్శించండి fmc.com మరియు ag.fmc.com/in/en మరింత తెలుసుకోవడానికి మరియు ఎఫ్ఎంసి ఇండియాను ఫాలో అవ్వడానికి ఫేస్‌బుక్® మరియు యు-ట్యూబ్®.