ఎఫ్ఎంసి ఇండియా భారతదేశంలో కోవిడ్-19 సహాయ చర్యల పట్ల తన సంపూర్ణ సహకారాన్ని ప్రకటించింది, ఇది ఐదు రాష్ట్రాల్లోని ఆసుపత్రులలో ఆక్సిజన్ సరఫరాను పెంచడం పై దృష్టి పెడుతుంది మరియు కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి గ్రామీణ ప్రాంతాల్లో సురక్షతా అవగాహన ప్రచారాలను చేపడుతుంది.
ఆక్సిజన్ సరఫరాను పెంచడం
భారత ప్రభుత్వ అంచనా ప్రకారం, ఆసుపత్రులు మరియు ఆరోగ్య సంరక్షణ సదుపాయాల్లో ఆక్సిజన్ కోసం డిమాండ్ అనేది మహమ్మారికి ముందు ఉన్న డిమాండ్‌తో పోలిస్తే పది రెట్లు పెరిగింది. కోవిడ్-19 కేసులు వేగంగా పెరుగుతున్నాయి, కానీ కరోనావైరస్ తీవ్రంగా ఉన్న పేషంట్లకు అత్యవసరమైన ఆక్సిజన్ సరఫరా అందటం లేదు. వేగంగా పెరుగుతున్న మెడికల్ ఆక్సిజన్ ఆవశ్యకతను నెరవేర్చడంలో సహాయపడటానికి, ఎఫ్ఎంసి ఇండియా ఏడు ప్రెజర్ స్వింగ్ అడ్సార్ప్‌షన్ (పిఎస్ఏ) ఆక్సిజన్ ప్లాంట్లను సేకరించి ఢిల్లీ ఎన్‌సిఆర్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మరియు గుజరాత్లో ఆసుపత్రులకు అందించింది. ఈ ఆసుపత్రులలో పిఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పడం వలన, ఎటువంటి రవాణా సమస్యలు లేకుండా ఆక్సిజన్ సరఫరా నిరంతరంగా ఉంటుంది.
కరోనా రెండవ దశ పై దేశం పోరాటం చేస్తున్న సమయంలో, ఈ చొరవ వలన డిమాండ్ అధికంగా ఉండి సరఫరా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రతి రోజూ 1,680Nm3 ఆక్సిజన్ ఉత్పత్తి చేసి, కోవిడ్-19 పై పోరాడటానికి స్థానిక ఆసుపత్రులకు సహకారం అందిస్తుంది.
ఎఫ్ఎంసి ఇండియా ప్రెసిడెంట్ ప్రమోద్ తోటా ఇలా అన్నారు, "మన దేశం కోవిడ్-19 రెండవ దశ యొక్క తీవ్రత వలన అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది, ప్రాథమిక వైద్య సదుపాయాల కోసం విపరీతంగా పెరిగిన డిమాండ్ వలన కీలకమైన సరఫరాలలో కొరతలు ఏర్పడుతున్నాయి. ఏరియా ఆసుపత్రుల వద్ద ఏర్పడుతున్న అత్యవసర డిమాండ్‌ను తీర్చడంలో సహాయపడటానికి, అత్యవసర పేషంట్ కేర్ కోసం ఎఫ్ఎంసి ఇండియా ఏడు పిఎస్ఏ ప్లాంట్లను అందించి విలువైన ప్రాణాలను కాపాడటంలో సహాయం చేస్తుంది. ముఖ్యంగా, కోవిడ్-19 రేట్లు అధికంగా ఉండి, వైద్య సదుపాయాలు తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన ఆరోగ్య సంరక్షణ కొరతలను తీర్చడానికి మా ఛానెల్ భాగస్వాములు మరియు కమ్యూనిటీలతో భాగస్వామ్యం నేర్పడానికి మేము కట్టుబడి ఉన్నాము.”
గ్రామీణ అవగాహన కార్యక్రమాలు
రెండవ దశలో కరోనా వైరస్ గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తుంది. వ్యవసాయం చేస్తూ, మంచి వ్యవసాయ విధానాలను ఆచరిస్తూనే, కోవిడ్-19 నుండి తమను తాము రక్షించుకోవడానికి తీసుకోవలసిన భద్రతా చర్యల గురించి స్థానిక రైతులకు అవగాహన కలిపించడానికి ఎఫ్ఎంసి ఇండియా బహుముఖ ప్రచారాన్ని ప్రారంభిస్తుంది. భారతదేశంలో వివిధ ప్రముఖ వ్యవసాయ రాష్ట్రాలలో దాదాపుగా 100,000 రైతులను ఈ ప్రచార కార్యక్రమాలు చేరుకోవడానికి అవకాశం ఉంది. ఈ ప్రయత్నాలు అన్నీ ఎఫ్ఎంసి ఇండియా యొక్క ప్రస్తుత కమ్యూనిటీ సాధికారత కార్యక్రమం అయిన - ప్రాజెక్ట్ సమర్థ్ లో భాగం.