ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

ఎఫ్ఎంసి కార్పొరేషన్ తమ భారతదేశ వ్యాపార అధ్యక్షుడిగా రవి అన్నవరపు పేరును ప్రకటించింది

ఎఫ్ఎంసి ఇండియా యొక్క కొత్త అధ్యక్షుడుగా శ్రీ రవి అన్నవరపు గారి నియామకాన్ని జులై 1, 2021 నుండి అమలులోకి వచ్చేలా ఎఫ్ఎంసి కార్పొరేషన్ ప్రకటించింది. భారతదేశంలో కంపెనీ యొక్క వ్యాపార వ్యూహం మరియు పనితీరు కొరకు రవి బాధ్యత వహిస్తారు. అతను ఎఫ్ఎంసి యుఎస్ఎ అధ్యక్షుడి హోదాలో ఉన్న శ్రీ ప్రమోద్ తోట గారి నుండి పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. అన్నవరపు గారు, ఎఫ్ఎంసి వైస్ ప్రెసిడెంట్ మరియు ఎఫ్ఎంసి ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ అయిన శ్రీమతి బెత్‌వైన్ టాడ్ గారికి రిపోర్ట్ చేస్తారు.

రవి గారు పంట రక్షణ రంగం గురించి లోతైన పరిజ్ఞానం కలిగిన ఒక బృంద నాయకుడు మరియు స్థానిక మార్కెట్, వినియోగదారుని అవసరాలపై మంచి అవగాహన ఉంది" అని శ్రీమతి టాడ్ చెప్పారురవి గారి నాయకత్వంలో, భారతదేశ వ్యవసాయ రంగానికి ఎఫ్‌ఎంసి సేవ చేయడం కొనసాగిస్తుందని నేను నమ్ముతున్నాను అతని నాయకత్వంలో స్థానిక పరిశోధన ద్వారా అభివృద్ధి చేయబడిన సృజనాత్మక టెక్నాలజీలు రైతుల జీవితాలకు ఒక సానుకూల మార్పును తీసుకువస్తాయి.”

తన పదవీ కాలములో ఎఫ్ఎంసి ఇండియాకు అతని నాయకత్వానికి గాను మిస్. టోడ్ శ్రీ తోటాకు ధన్యవాదాలు తెలిపారు: "భారతదేశంలో వ్యాపార అభివృద్ధి మరియు విజయం కోసం అతని అపారమైన సహకారం కోసం నేను ప్రమోద్‌కు ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. మహమ్మారి కొనసాగుతున్న సమయంలో, మన ఉద్యోగులకు అదేవిధంగా గ్రామీణ భారతదేశంలోని వ్యవసాయ కమ్యూనిటీలకు మద్దతు ఇవ్వడానికి గాను ఒక మార్పిడిగా కోవిడ్-19 ప్రతిస్పందనను నడపడంతో సహా అతను మా భారతదేశ వ్యాపారానికి విజయవంతంగా నాయకత్వం వహించారు. అతను ప్రాజెక్ట్ సఫల్ (ఫాల్ ఆర్మీవర్మ్ సమర్థవంతమైన నియంత్రణ), ఉగమ్ (మంచి నేల ఆరోగ్య పద్ధతుల ప్రచారం), ప్రాజెక్ట్ సమర్థ్ (సురక్షితమైన నీటి చొరవ) మరియు వ్యవసాయ సుస్థిరత దిశగా చురుకుగా ప్రేరణను అందిస్తోన్న సైన్స్ లీడర్స్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ లాంటి కీలక ప్రాజెక్టులకు వెన్నెముకగా నిలిచారు.”

“ఎఫ్ఎంసి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటైన భారతదేశంలో, సంస్థ కార్యకలాపాలకు నాయకత్వం వహించే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నాను," అని ఎఫ్ఎంసి ఇండియాలో ప్రస్తుతం సేల్స్ మరియు మార్కెటింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీ అన్నవరపు గారు అన్నారు. "ఒక సంస్థగా, మేము మా కస్టమర్లకు సృజనాత్మకమైన పంటరక్షణ పరిష్కారాలను అందించడానికి మరియు మేము పనిచేసే రైతు సమాజం పై సానుకూల ప్రభావాన్ని చూపడానికి కట్టుబడి ఉన్నాము. భారతదేశ వ్యాప్తంగా రైతులకు ఎఫ్ఎంసి ఇండియా ఒక విశ్వసనీయ భాగస్వామిగా ఉండేలా చూసుకోవడంలో ప్రమోద్ యొక్క వారసత్వాన్ని కొనసాగించడానికి నేను ఎదురుచూస్తున్నాను.

శ్రీ అన్నవరపు గారు 2013 లో కార్పొరేట్ వ్యూహం మరియు అభివృద్ధి డైరెక్టర్‌గా ఎఫ్ఎంసి లో చేరారు, మరియు 2016 లో మార్కెటింగ్ యొక్క గ్లోబల్ హెడ్ తో సహా పూర్వ ఎఫ్ఎంసి ఆరోగ్య మరియు పోషణ వ్యాపారంలో సీనియర్ వాణిజ్య విధులను నిర్వర్తించారు. రెండు సంవత్సరాల తర్వాత, అతను యు.ఎస్. నుండి భారతదేశానికి మార్కెటింగ్, వ్యూహము మరియు వ్యాపార అభివృద్ధి డైరెక్టర్‌గా తిరిగి వచ్చారు మరియు 2019 లో తన అత్యంత ఇటీవలి హోదాను పొందారు. ఎఫ్ఎంసి కు ముందు, అతను మెకిన్సీ అండ్ కంపెనీలో మేనేజ్మెంట్ కన్సల్టెంట్ గా పని చేశారు మరియు అభివృద్ధి వ్యూహం మరియు ఎం మరియు ఎ అంశాల్లో ఫార్చ్యూన్ 100 స్పెషాలిటీ కెమికల్స్ వ్యాపార సంస్థలకు సలహా అందజేసేవారు. శ్రీ అన్నవరపు గారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ నుండి తన బిటెక్ పూర్తి చేసుకున్నారు. అతను మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి కెమికల్ ఇంజనీరింగ్ లో పిహెచ్‌డి పట్టా కూడా పొందారు మరియు ఎంఐటి స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి ఎంబిఏ పట్టా పొందియున్నారు.