ఎఫ్ఎంసి ఇండియా ఒక ప్రెషర్ స్వింగ్ అడ్సార్ప్షన్‌ను ప్రారంభించింది (పిఎస్ఎ) అది అరణ్య ఆసుపత్రికి విరాళంగా అందజేసిన ఆక్సిజెన్ ప్లాంటు, స్కీమ్ నంబర్ 74 లో, ఇండోర్, మధ్యప్రదేశ్.
శ్రీ కైలాష్ విజయ్‌వర్గియ, జాతీయ జనరల్ సెక్రెటరీ, భారతీయ జనతా పార్టీ మరియు శ్రీ రమేష్ మెండోలా, లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు, ఇండోర్-2, మధ్య ప్రదేశ్ సమక్షంలో శ్రీ రవి అన్నవరపు, ఎఫ్ఎంసి ఇండియా ప్రెసిడెంట్, ఎజిఎస్ బిజినెస్ డైరెక్టర్ గారు ఆక్సిజన్ ప్లాంట్ ని ప్రారంభించారు.
కొత్తగా నెలకొల్పబడిన పిఎస్ఎ ఆక్సిజెన్ ప్లాంటు, 16 పడకలు మరియు రోగులకు ఏక కాలములో మద్దతు ఇవ్వడానికై 10 NM3/ గంటల ఆక్సిజెన్ అందించడానికి సమృద్ధం చేయబడింది.
కార్యక్రమం సందర్భంగా, శ్రీ అన్నవరపు గారు ఇలా అన్నారు, “మహమ్మారిపై తన పోరాటంలో దేశానికి మద్దతు ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఇండోర్ లోని పిఎస్ఎ ఆక్సిజెన్ ప్లాంటు చిన్నదే అయినప్పటికీ, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలలో కీలకమైన ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతులను వృద్ధి చేసే దిశగా ఇది గణనీయమైన ముందడుగు. ఈ చొరవ ఈ రోజున మరియు భవిష్యత్తులో అవసరంలో ఉన్న రోగులకు మద్దతు అందించడంలో కీలకమవుతుందని మేము ఆత్మవిశ్వాసంతో ఉన్నాము.”
ఈ సందర్భంగా మాట్లాడుతూ, శ్రీ కైలాష్ విజయ్ వార్గియా గారు కమ్యూనిటీలకు సేవ చేయడంలో ఎఫ్ఎంసి యొక్క కృషిని కొనియాడారు.
ఇండోర్ శాసనసభ్యులు శ్రీ రమేష్ మెండోలా గారు ఎఫ్ఎంసి ఇండియా చొరవను ప్రశంసించారు. “ఇది ఎఫ్ఎంసి ఇండియా వారిచే ఒక గొప్ప చొరవ మరియు ఇండోర్ యందు ఆరోగ్యసంరక్షణ మౌలిక వసతులను బలోపేతం చేయడంలో మద్దతునిస్తుంది” అని ఆయన అన్నారు. ఒకవేళ మూడో వేవ్ వచ్చిన పక్షములో, లిక్విడ్ ఆక్సిజెన్ తో సహా కీలకమైన వనరులు తగినన్ని సరఫరా జరిగేలా చూసుకుంటూ దానిని ఎదుర్కోవడానికి మేము చాలా బాగా సంసిద్ధులమై ఉన్నాము. ఈ ఆలోచనాత్మక దోహదం పట్ల మేము ఎఫ్ఎంసి కార్పొరేషన్ వారికి కృతజ్ఞులమై ఉన్నాము.”
“ఈ సందర్భంగా ఎఫ్ఎంసి వద్ద ఇండియా 3 ప్రాంతము కొరకు ప్రాంతీయ డైరెక్టర్ శ్రీ డి.కె. పాండే గారు మాట్లాడుతూ, “ఎఫ్ఎంసి బృందాలు గ్రామ స్థాయిలో తమ “కోవిడ్-సురక్షిత గ్రామ ప్రచారోద్యమం” ద్వారా గ్రామీణ సమాజాలకు మహమ్మారి గురించి మరియు దాని నుండి కోలుకొని బ్రతకడానికి ఉత్తమ ఆచరణల గురించి అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నాయి”, అన్నారు.
ఎఫ్ఎంసి ఇండియా ఢిల్లీ ఎన్‌సిఆర్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మరియు గుజరాత్‌లోని ఆసుపత్రుల కోసం ఎనిమిది ప్రెషర్ స్వింగ్ అడ్సార్ప్షన్ (పిఎస్ఎ) ఆక్సిజన్ ప్లాంట్లను సేకరించడానికి మరియు దానం చేయడానికి కట్టుబడి ఉంది. ఈ ఆసుపత్రులలో పిఎస్ఎ ఆక్సిజన్ ప్లాంట్ల ఇన్‌స్టాలేషన్ రవాణా లాజిస్టిక్స్ సవాళ్లు లేకుండా ఆక్సిజన్ యొక్క నిరంతర సరఫరాకు వీలు కల్పిస్తుంది.
కోవిడ్-19 నుండి తమను తాము రక్షించుకోవడానికి భద్రత మరియు వెల్‌నెస్ చర్యల గురించి స్థానిక రైతులు మరియు సాగుదారులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఎఫ్ఎంసి ఇండియా ఒక బహుముఖ ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. భారతదేశంలోని ప్రముఖ వ్యవసాయ రాష్ట్రాలలో దాదాపుగా 1.3Mn రైతులను ఈ అవగాహన కార్యక్రమం చేరుకుంది.