ఎఫ్ఎంసి కార్పొరేషన్ భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో పనోలి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని రెండవ తయారీ పరిశ్రమలో సౌర శక్తిని ఉపయోగించడం ప్రారంభించింది. గత సంవత్సరం ఏప్రిల్‌లో మొదటి పరిశ్రమ సౌర శక్తిని విజయవంతంగా ఉపయోగించడం ప్రారంభించిన తరువాత సౌర శక్తి వినియోగం రెండవ పరిశ్రమకి విస్తరించబడింది.
ఎఫ్ఎంసి యొక్క పనోలి పరిశ్రమ తన కార్యకలాపాలు నిర్వహించడానికి ఇప్పుడు తన పూర్తి విద్యుత్ అవసరాలలో 20 శాతం ఒక 50 MW సౌర విద్యుత్ ప్లాంట్ నుండి పొందుతుంది, ఇది కెపిఐ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, గుజరాత్ ఎనర్జీ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్, (జిఇటిసిఓ) మరియు గుజరాత్ ఎనర్జీ డెవెలప్‌మెంట్ ఏజెన్సీ (జిఇడిఏ) భాగస్వామ్యంతో సాధ్యం అయింది.
"శక్తిని సమర్థవంతంగా వినియోగించుకునే ప్రక్రియలలో ఎఫ్ఎంసి యొక్క అంతర్జాతీయ పెట్టుబడుల వలన గడిచిన రెండు సంవత్సరాలలో అతి తక్కువ అంతరాయాలతో సంపూర్ణ శక్తి యొక్క వినియోగం తగ్గింది. పనోలి తయారీ పరిశ్రమ వద్ద సౌర శక్తి వినియోగాన్ని విస్తరించడం ఈ దిశగా వేసిన మరో ముందడుగు, ఇది మా కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను తగ్గిస్తుంది మరియు స్థానిక ప్రజల ఆరోగ్యాన్ని మరియు భద్రతను కాపాడుతుంది," అని ఎఫ్ఎంసి ఇండియా ప్రెసిడెంట్ అయిన ప్రమోద్ తోట గారు అన్నారు.
సౌర శక్తి వినియోగం వలన గ్రీన్ హౌస్ గ్యాస్ (జిహెచ్‌జి) ఉద్గారాలు సున్నాకి తగ్గుతాయి మరియు ఇది ప్లాంట్ యొక్క పూర్తి ఉద్గారాలను 2,000 టన్నులకు పైగా తగ్గిస్తుంది.
తోట గారు ఇలా కూడా చెప్పారు, "పరిశ్రమ వద్ద విద్యుత్ అవసరం పెరిగే అవకాశం ఉన్నందున మేము సౌర మరియు పవన వంటి పునరుత్పాదక శక్తుల వినియోగాన్ని మరింతగా పెంచాలని భావిస్తున్నాము. సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు భారతదేశ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల మధ్య, ఎఫ్ఎంసి యొక్క సుస్థిరత కార్యక్రమాలు దేశ తయారీ పరిశ్రమకి ప్రమాణాలు నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.”
అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ (ఐఇఎ) నివేదిక ప్రకారం, తదుపరి రెండు దశాబ్దాలలో ప్రపంచంలోని అన్ని దేశాలతో పోలిస్తే భారతదేశంలో విద్యుత్ డిమాండ్ అత్యధికముగా ఉంటుంది మరియు 2030 నాటికి శక్తి వినియోగంలో యూరోపియన్ యూనియన్‌ని దాటి భారతదేశం మూడవ స్థానానికి చేరుకుంటుంది.