ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

ఎఫ్ఎంసి ఇండియా ద్వారా అందించబడుతున్న ప్రతిష్టాత్మక సైన్స్ లీడర్స్ స్కాలర్‌షిప్ మద్దతుతో ఇవ్వబడిన మట్టి యొక్క స్థిరమైన వినియోగం పై బీహార్‌కు చెందిన దివ్య రాజ్ దృష్టి పెట్టాలనుకుంటున్నారు`

జూన్ 4, 2024: ఉత్తరాఖండ్‌ రాష్ట్రం, పంత్ నగర్‌లోని జిబి పంత్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ (జిబిపియుఎటి) యొక్క మట్టి శాస్త్రం మరియు వ్యవసాయ రసాయన శాస్త్రం విభాగంలో రెండవ సంవత్సరం మాస్టర్స్ విద్యార్థిని అయిన దివ్య రాజ్ వ్యవసాయ శాస్త్ర సంస్థ అయిన ఎఫ్ఎంసి ఇండియా యొక్క ప్రతిష్టాత్మక సైన్స్ లీడర్స్ స్కాలర్‌షిప్ అందుకుంది. మట్టి శాస్త్రం పై అమితమైన ఆసక్తితో మరియు ఎఫ్ఎంసి ఇండియా యొక్క సహకారంతో, మెరుగైన మట్టి వినియోగం ద్వారా తగిన మరియు సుస్థిరమైన వ్యవసాయ ఉత్పత్తి కోసం మట్టి గుణాలు మరియు వాటి నిర్వహణ గురించి తన జ్ఞానం మరియు అవగాహనను పెంచుకునే లక్ష్యం కలిగి ఉన్నారు

Ms. Divya Raj - FMC Science Leaders Scholarship

కొనసాగుతున్న ఎఫ్ఎంసి సైన్స్ లీడర్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2021లో ప్రారంభించబడింది, ఇది వ్యవసాయ శాస్త్రాలను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఏటా ఇరవై స్కాలర్‌షిప్‌లను ప్రదానం చేస్తుంది. పిహెచ్‌డి చదువుతున్న విద్యార్థులకు పది స్కాలర్‌షిప్‌లు మరియు వ్యవసాయ శాస్త్రంలో ఎంఎస్‌సి చేస్తున్న పది మంది విద్యార్థులకు పది స్కాలర్‌షిప్‌లు అందించబడ్డాయి. వ్యవసాయ శాస్త్రాల్లో విజయవంతమైన కెరీర్‌ను సాధించాలని ఆకాంక్షించే మరియు ప్రతిభగల మహిళల కోసం ఈ స్కాలర్‌షిప్‌లలో, యాభై శాతం కేటాయించబడింది. అనుభవం లేని శాస్త్రవేత్తలకు వ్యవసాయ పరిశోధన మరియు ఆవిష్కరణలో తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఎఫ్ఎంసి ఇండియా కార్యక్రమం అవకాశాలను అందిస్తుంది. ఈ పరిశ్రమలో పని చేద్దాము అని అనుకుంటున్న యువత యొక్క సామర్థ్యం మరియు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి మరియు పరిశోధన మరియు ఆవిష్కరణ కోసం ఈ పది స్కాలర్‌షిప్ కార్యక్రమం రూపొందించబడింది.

ఎఫ్ఎంసి ఇండియా అధ్యక్షుడు రవి అన్నవరపు ఇలా చెప్పారు, "ఎఫ్ఎంసి వద్ద, వ్యవసాయం యొక్క సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించే వైవిధ్యమైన మరియు సమగ్ర పని వాతావరణాన్ని సృష్టించడం పట్ల అంకితభావం ఉంది. తదుపరి తరానికి చెందిన యువ శాస్త్రవేత్తలు వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలను ఎంచుకునే విధంగా స్ఫూర్తిని కలిగించడానికి మేము కట్టుబడి ఉన్నాము. పరిశోధన మరియు ఆవిష్కరణ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న మేము, సరికొత్త ఆలోచనలను అందించగల యువత నైపుణ్యాన్ని పెంచి పోషించడం పై దృష్టి పెట్టాము, ఈ విధంగా చేయడం ద్వారా, అందరి ప్రయోజనం కోసం వ్యవసాయ విధానాలను బలోపేతం చేసి సుస్థిరత సాధించడమే మా లక్ష్యం."

జిబిపియుఎటి వద్ద పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ యొక్క డీన్ అయిన డాక్టర్ కిరణ్ పి రావర్కేర్ ఇలా చెప్పారు, "క్రిటికల్ థింకింగ్ ను మెరుగుపరుచుకోవడానికి మరియు పరిశోధన లక్ష్యాలను మెరుగుపరుచుకోవడానికి ఎఫ్ఎంసి సిబ్బంది మరియు అడ్వైజరీ కమిటీ కీలక పాత్ర పోషించారు. ఎఫ్ఎంసి తో మా భాగస్వామ్యం కారణంగా అందించబడిన స్కాలర్‌షిప్‌ల సహాయంతో మా విద్యార్థులు తమ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు అనలైటికల్ సామర్థ్యాలను ప్రత్యేక శిక్షణ, మరియు జాతీయ మరియు అంతర్జాతీయ సెమినార్లు, వర్క్‌షాప్‌లు మరియు అటువంటి ఫోరంలలో పాల్గొనడం ద్వారా మెరుగుపరుచుకున్నారు. ఆకర్షణీయమైన అవకాశాలతో తమ కెరీర్లను నిర్మించుకోవడానికి మా విద్యార్థులు ఆచరణీయమైన మార్గాలను కనుగొనడమే కాక ప్రస్తుత ఆవశ్యకతలకు సరిపోయే విధంగా ఒక అవగాహనను పెంపొందించుకుంటున్నారు. ఉదాహరణకు, మట్టి ఆరోగ్యం పట్ల దివ్య యొక్క ఆసక్తి క్లైమేట్ చేంజ్ ఛాంపియన్ల అవసరాన్ని సూచిస్తుంది, వీరు ఈ సంబంధిత సమస్యల గురించి పరిశోధన చేస్తారు మరియు ప్రభుత్వం మరియు పరిశ్రమతో కలిసి పెరుగుతున్న ఈ సమస్యల కోసం తగిన పరిష్కారాలు కనుగొంటారు. మా తెలివైన విద్యార్థులకు ఇటువంటి అవకాశాలను అందించినట్లయితే, మరింత విస్తృత శ్రేణిలో సుస్థిరమైన వ్యవసాయ విధానాలలో అభివృద్ది జరుగుతుంది అని మాకు విశ్వాసం ఉంది."

ఈ అవకాశం అందుకోవడం పై తన అనుభవాన్ని పంచుకున్న దివ్య ఇలా చెప్పారు, "వ్యవసాయం అంటే కేవలం సేద్యం మాత్రమే కాదు అని నేను బలంగా విశ్వసిస్తున్నాను; ఇది విస్తృతమైన కెరీర్ అవకాశాలను అందిస్తుంది. జిబి పంత్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చేరిన తరువాత ఎఫ్ఎంసి సైన్స్ లీడర్స్ స్కాలర్‌షిప్ కార్యక్రమం గురించి నేను తెలుసుకున్నాను. నా అండర్‌గ్రాడ్యుయేట్ స్టడీస్ సమయంలో మట్టి శాస్త్రం పట్ల నాకు అమితమైన ఆసక్తి కలిగింది, సుస్థిరమైన వ్యవసాయ ఉత్పత్తి కోసం మట్టి గుణాలు మరియు వాటి నిర్వహణ గురించి ఇది మౌలికమైన సమాచారాన్ని అందిస్తుంది. ఈ స్కాలర్‌షిప్ కార్యక్రమం ద్వారా నాకు గణనీయమైన తోడ్పాటును అందించిన ఎఫ్ఎంసి కి నా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను, ఈ కార్యక్రమం నాకు ఆర్థిక స్వాతంత్రం అందించింది మరియు విశ్వవిద్యాలయంలో నా చదువు పై దృష్టి పెట్టగలిగాను. నా పరిశోధనతో, నేను ఒక సుస్థిరమైన విధానంలో మట్టిని వినియోగించే పద్ధతుల కోసం వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేసి వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న కీలకమైన సవాళ్లను పరిష్కరించాలని అనుకుంటున్నాను."

దివ్య బీహార్ రాష్ట్రంలో తన పాఠశాల మరియు ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసింది మరియు ఐసిఎఆర్ ఫెలోషిప్ కింద పంత్ నగర్ లోని జిబిపియుఎటి వద్ద అండర్‌గ్రాడ్యుయేట్ డిగ్రీలో చేరింది, ఇక్కడ మట్టి శాస్త్రం పై ఆమెకు ఆసక్తి కలిగింది. మట్టి శాస్త్రం పట్ల దివ్యకు ఉన్న ఆసక్తి వలన జిబిపియుఎటి, పంత్ నగర్, ఉత్తరాఖండ్ వద్ద మట్టి శాస్త్రం విభాగంలో మాస్టర్స్ డిగ్రీ కోసం చదువుతున్నారు. తన విద్య ద్వారా వ్యవసాయ సూత్రాలు మరియు అధ్యయనాల పై ఆమె క్షుణ్ణంగా తెలుసుకున్నారు.

ప్రతి సంవత్సరం, వ్యవసాయ శాస్త్రాలలో పిహెచ్‌డి/ఎంఎస్‌సి చదువుతున్న మరో ఇరవై మంది విద్యార్థులు, దేశం నలుమూలల నుండి ఇప్పటికే ఎఫ్ఎంసి సైన్స్ లీడర్స్ స్కాలర్‌షిప్ నుండి లబ్ది పొందుతున్న విద్యార్థుల సమూహంలో చేర్చబడతారు.  

ఎఫ్ఎంసి పరిచయం 

ఎఫ్‌ఎంసి అనేది ఒక ప్రపంచ స్థాయి వ్యవసాయ విజ్ఞాన సంస్థ. ఇది పెరుగుతున్న ప్రపంచ జనాభాకు సరిపడా ఆహార ధాన్యాలు, పంటలను మరియు ఇంధనాన్ని, మారుతున్న వాతావరణానికి అనుగుణంగా ఉత్పత్తి చేసే సాగుదారులకు సహాయం చేయడానికి కట్టుబడి ఉంది. ఎఫ్‌ఎంసి సంస్థ నుండి వినూత్నమైన పంట సంరక్షణ పరిష్కారాలు - జీవావరణ వ్యవస్థ, పంట పోషణ, డిజిటల్ మరియు ఖచ్చితమైన వ్యవసాయంతో సహా - సాగుదారులు, పంట సలహాదారులు మరియు టర్ఫ్, పెస్ట్ మేనేజ్‌మెంట్ నిపుణులు పర్యావరణాన్ని పరిరరక్షించడంలో వారికి ఎదురయ్యే ఆర్థికపరమైన సవాళ్లను పరిష్కరించుకోవడానికి వీలు కల్పిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వంద కంటే ఎక్కువ సైట్‌లలో సుమారు 6,400 ఉద్యోగులతో, కొత్త కలుపు నాశిని, కీటక నాశిని మరియు శిలీంద్ర నాశిని క్రియాశీల పదార్థాలు, ఉత్పత్తి సూత్రీకరణలను మరియు మన గ్రహానికి హానిని కలిగించని స్థిరంగా మెరుగ్గా ఉండే మార్గదర్శక సాంకేతికతలను కనుగొనడానికి ఎఫ్‌ఎంసి కట్టుబడి ఉంటుంది. సందర్శించండి fmc.com మరియు ag.fmc.com/in/en మరింత తెలుసుకోవడానికి మరియు ఎఫ్ఎంసి ఇండియాను ఫాలో అవ్వడానికి ఫేస్‌బుక్ మరియు యు-ట్యూబ్.