పండ్లు మరియు కూరగాయల (ఎఫ్ మరియు వి) సాగు అనేది రాబోయే కాలంలో కూడా భారతదేశ వ్యవసాయ అభివృద్ధికి కీలకమైన అంశంగా కొనసాగుతుంది. ఈ కాలములో 2.6% యొక్క వ్యవసాయ వృద్ధితో పోల్చి చూస్తే గత దశాబ్దం నుండి 4.6% సిఏజిఆర్ వద్ద కూరగాయల ఉత్పత్తి అభివృద్ధి చెందుతోంది. ఆధునిక నవ్యత ఈ ఎదుగుదలను నడుపుతోంది మరియు ఉత్పాదకతలో మరింత పెరుగుదలకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. పెరుగుతున్న జనాభా యొక్క పోషక అవసరాలను తీర్చే ఆహార భద్రత నుండి రైతుల ఆర్థిక స్థితిలో మెరుగుదల వరకు మరియు ఆరోగ్యకరమైన మరియు వ్యాధి-రహిత జీవితాన్ని నిర్వహించడానికి, ఎఫ్&వి అనుసరించదగిన మార్గం.
ఈ రోజున, పండ్లు మరియు కూరగాయల పంటలు మొత్తం సాగు విస్తీర్ణములో 17% లో (ఇంకా పెరుగుతుంది) పండిస్తున్నారు మరియు అవి వ్యవసాయ జిడిపి లో సుమారు 30% వరకు ఉంటున్నాయి. పంటల సాగు, మార్కెట్ లింకేజ్, ఆర్థిక సహాయం మొదలైన వాటికి సంబంధించిన సమాచారానికి రైతులకు పరిమిత ప్రాప్యత ఉండటం వలన ఆశించిన ఫలితాలను సాధించడంలో కొన్ని సవాళ్లు ఉన్నాయి. అయితే డిజిటల్ ఆవిష్కరణ మరియు సాంకేతికత కారణంగా సమాచారంలో అంతరం గణనీయంగా తగ్గుతుంది. భారత ప్రభుత్వం 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యం కలిగి ఉంది. సుస్థిరమైన భవిష్యత్తు కోసం ఉత్తమ పద్ధతులను అనుసరిస్తూ పండ్లు మరియు కూరగాయల పంటలను సాగు చేయడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది.
ఎఫ్ఎంసి వద్ద మేము, రైతులు తమ ఆదాయం మరియు జీవనోపాధిని మెరుగుపరచుకోవడానికి సహాయపడే వినూత్నమైన, సరికొత్త సాంకేతికతలు మరియు ప్రత్యేకంగా రూపొందించబడిన పరిష్కారాలను అవలంబించడంలో రైతులకు సహాయపడుతున్నాము. ఈ విభాగముపై ప్రత్యేక దృష్టితో ఎఫ్ఎంసి ఇండియా 2020 లో ఒక పంట బృందాన్ని ఏర్పాటు చేసింది. పరిష్కారాల-ఆధారిత విధానంపై ఒక నూతన దృష్టితో, పంట బృందం వివిధ పంటలలో ఉత్తమ ఫలితాలను అందించడాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ బృందం, రైతులు ఉత్తమ వ్యవసాయ పద్ధతులను నేర్చుకోవడానికి మరియు ఉత్తమ ఫలితాల కోసం పరిష్కారాల ఆధారిత సమగ్ర కీటక యాజమాన్య విధానాన్ని అమలు చేయడానికి కూడా సహాయపడుతుంది.
ఎఫ్ఎంసి ఇప్పటివరకు వరుస క్రమ పంటల కోసం పరిష్కారాలను అందించే సంస్థగా గుర్తించబడుతుంది, కానీ ఈ సరికొత్త విధానంతో ఎఫ్ మరియు వి రైతులకు కూడా చేరువ కావాలని కోరుకుంటుంది. వారి ఉత్పాదకతను మెరుగుపరచడానికి మరియు వారి భవిష్యత్తును సురక్షితం చేయడానికి గాను సుస్థిరమైన పరిష్కారాలను అందించడం ద్వారా వారి కలలను నెరవేర్చడానికి మేము వారికి సహాయపడుతున్నాము.