మా పరిశ్రమలో విజయం కోసం గిరాకిని సృష్టించడం అనేది చాలా ముఖ్యం. ఇక్కడే అనేక సంప్రదింపు విధానాల ద్వారా ఉత్పత్తి కెపిఐలు మరియు ఉత్పత్తికి సంబంధించి వినియోగదారు అందుకునే అంతిమ విలువ ప్రదర్శింపబడతాయి. ఆ విధంగా ఒక సంతృప్తికరమైన అవకాశం ఒక వినియోగదారునిగా మారుతుంది.
2020 లో మనము కోవిడ్ మహమ్మారితో పోరాటం చేయడం మాత్రమే కాకుండా, వినియోగదారును సంప్రదించడానికి సరికొత్త విధానాలను కనుగొనేలా చేసింది, వాటిలో ఒకటి ఇ-ఫీల్డ్స్ (మునుపటి సంచికలో కవర్ చేయబడింది). మరియు ఇందులోని ప్రతి ఒక్క విధానం సాంకేతికతను జోడించడానికి మరియు ప్రత్యామ్నాయాలు కలిపించుకోవడానికి అనేక అవకాశాలను అందించింది - ఇందులో సరికొత్త అంశం మా ప్రయోగాత్మక ప్లాట్ల సౌందర్యాన్ని ఒడిసి పట్టుకోవడానికి డ్రోన్ కెమెరాల వినియోగం.
అథారిటీ® నెక్స్ట్, అనే ఈ కలుపు నాశిని మహారాష్ట్రలోని సోయా చిక్కుడు రైతుల కోసం ఈ సంవత్సరం నుండి అందించబడుతుంది; ఇది మా పైలట్ ప్రాజెక్ట్ కోసం బాగా ఉపయోగపడింది. వాట్సాప్ వీడియో కాల్స్, జూమ్ లేదా నేరుగా సందర్శించడం ద్వారా మా బృందం 27000+ రైతులను సంప్రదిస్తున్నప్పటికీ, హై డెఫినిషన్ డ్రోన్ కెమెరాల ద్వారా ఈ-ఫీల్డ్స్ ను తదుపరి స్థాయికి తీసుకువెళదామని మేము భావించాము.
అథారిటీ® నెక్స్ట్ 1 రోజు నుండి ఒక ఉత్తమ కలుపు నియంత్రణను అందిస్తుంది, మరియు 40డిఎఎస్ వద్ద శుభ్రమైన, కలుపు రహిత క్షేత్రంలో ఆరోగ్యకరమైన పంట పెరుగుదలతో కెపిఐలు స్పష్టంగా కనపడుతున్నాయి. ట్రీట్ చేయబడిన ప్లాట్ యొక్క విహంగ వీక్షణం కోసం మేము 4 అడుగులు, 10 అడుగులు, 70 అడుగులు మరియు 100 అడుగుల ఎత్తు నుండి కూడా డ్రోన్ కెమెరా ఉపయోగించి చిత్రాలను తీసాము. ఫలితం అద్భుతంగా ఉంది; కొన్ని చిత్రాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
పూత దశలో కొరాజెన్ ® యొక్క వాడకము తర్వాత 85-90డిఎఎస్ వద్ద మేము తదుపరి షూట్ కోసం ప్రణాళిక వేసుకున్నాము. ఈ దశలో కలుపు నాశిని యొక్క కెపిఐలు మాత్రమే కాకుండా బలవర్ధకమైన ఆకుపచ్చని మరియు ఎక్కువ దట్టంగా కాయలు కాసిన పంటలో కనిపించే సర్వోత్తమ కీటక సంరక్షణ ఫలితం కూడా క్యాప్చర్ చేయబడుతుంది. ఆ విధంగా ఈ వీడియోలు మా ఉత్పత్తుల కోసం ఉత్సాహం మరియు గిరాకీని పెంచడానికి గాను వివిధ వేదికలలో రైతుల సమావేశాల కోసం ఉపయోగించబడతాయి.
డ్రోన్ కెమెరాల వలన మేము ఇప్పుడు 100 అడుగుల ఎత్తు వరకు వెళ్లగలము, ఇది మాకు అనేక అవకాశాలను సృష్టిస్తుంది. మరియు మేము వాటిని రాబోయే కాలములో అత్యుత్తమంగా ఉపయోగించుకుంటాము.