ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

ఫెర్టెర్రా® కీటక నాశిని

ఫెర్టెర్రా® కీటక నాశిని – క్రియాశీల పదార్థము రైనాక్సిపయర్® యాక్టివ్‌ను కలిగి ఉంది, వరి మరియు చెరకు పంటలలో తొలిచే పురుగుల నియంత్రణ కొరకు గుళికల రూపంలో ఉండే ఒక ఆంత్రానిలిక్ డైమైడ్ కీటక నాశిని. ఫెర్టెర్రా® కీటక నాశిని, ఇతర కీటక నాశునులు నిరోధకత కలిగి ఉండే పురుగులను నియంత్రించే ఒక విశిష్ట చర్యా రూపమును కలిగి ఉంది. ఇది లక్ష్యం చేసుకోబడని మేలుచేయు పురుగుల కోసం ఎంపిక చేయదగినది మరియు సురక్షితమైనది మరియు సహజ పరాన్నజీవుల నాశినులను, వేటాడే జీవులను మరియు పుప్పొడి సరఫరాదారులను సంరక్షిస్తుంది. ఈ లక్షణాలు ఫెర్టెర్రా® కీటక నాశిని మందును సమగ్ర కీటక యాజమాన్యము (ఐపిఎం) కోసం శ్రేష్టమైన సాధనంగా చేస్తాయి మరియు పొలం పనులలో రైతులకు ఎక్కువ సానుకూలతను అందిస్తాయి. ఇది, ఆహార రిటైలర్లు, ఎగుమతిదారులు మరియు వినియోగదారుల డిమాండ్లను నెరవేర్చే అధిక నాణ్యత ఉత్పత్తిని అందించడం లక్ష్యంగా చేసుకొంది.

సంక్షిప్త సమాచారం

  • ఫెర్టెర్రా® కీటక నాశిని అధిక కీటకనాశన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది మరియు దీర్ఘకాలిక నియంత్రణను అందిస్తుంది
  • గుళికల రూపములోని ఫార్ములేషన్ వాడకం కోసం రైతులకు సౌలభ్యతను అందిస్తుంది
  • వరిలో కాండం తొలుచు పురుగు యొక్క శ్రేష్టమైన నియంత్రణ కారణంగా, ఇది గొప్పదైన పంట ఆరోగ్యం మరియు అధిక దిగుబడి సామర్థ్యాన్ని నిర్ధారిస్తుంది
  • చెరకు పంటలో పీక పురుగు మరియు మొవ్వ తొలిచే పురుగుపై శ్రేష్టమైన నియంత్రణ. తక్కువ పంట దిగుబడి కారణంగా కలుగుతున్న నష్టాల నుండి రైతులను రక్షిస్తుంది మరియు తద్వారా రాబడి గరిష్టం అవుతుంది

ఉపయోగించిన పదార్ధాలు

  • రైనాక్సిపైర్® యాక్టివ్ - క్లోరంత్రానిలిప్రోల్ 0.4%జి ఆర్ కలిగి ఉంది

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

4 లేబుల్స్ అందుబాటులో ఉన్నాయి

సపోర్టింగ్ డాక్యుమెంట్లు

ఉత్పత్తి అవలోకనం

ఎఫ్ఎంసి వారి ఫెర్టెర్రా® కీటక నాశిని అనేది ఈ రోజున వరి రైతుకు పరిచయం చేయాల్సిన అవసరం లేని ఒక ఉత్తమమైన కీటక నాశక ఉత్పాదనగా ఉంది. రైనాక్సీపైర్ ® యాక్టివ్ యొక్క ప్రపంచ శ్రేణి టెక్నాలజీ ద్వారా సమర్పించబడిన ఫెర్టెర్రా® అనేది వరి మరియు చెరకు పంటలలో సాటిలేని పంట రక్షణను అందించే గుళికల రూపములోని కీటక నాశిని. వాడకానికి సులభమైన గుళికల ఫార్ములేషన్ అయిన ఫెర్టెర్రా® కీటక నాశిని, తొలిచే పురుగుల యొక్క సర్వోత్తమ నియంత్రణను ప్రదర్శించి, అధిక పంట దిగుబడికి కారణమయింది. లక్షలాది రైతులు తమ పొలాల్లో ఫెర్టెర్రా ® కీటక నాశిని యొక్క అద్భుత ప్రయోజనాలను గమనించారు మరియు ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది.

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

పంటలు

పేర్కొనబడిన పంటల జాబితా, లక్షిత తెగుళ్లు, వినియోగ సూచనలు, ఆంక్షలు మరియు జాగ్రత్తల గురించి ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్‌ని చూడండి. కావలసిన ఫలితాల కోసం పేర్కొనబడిన సూచనలను జాగ్రత్తగా చదవండి మరియు అనుసరించండి.

ఈ ఉత్పత్తి యొక్క నియంత్రణ మా పరిధిలో లేనందున, మేము ఉత్పత్తి యొక్క నాణ్యత పై మినహా వేటికి హామీ ఇవ్వము.

పూర్తి పంట జాబితా

  • వరి
  • చెరకు