ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

కోర్ ప్రైమా™ కీటక నాశిని

కోర్ ప్రైమా™ కీటక నాశిని అనేది నీటిలో కరిగిపోయే గుళికల రూపంలో ఒక ఆంత్రానిలిక్ డయామైడ్ విస్తృత వ్యాప్తి చెందే కీటక నాశిని. ఇది ప్రత్యేకించి లెపిడోప్టెరన్ పురుగులపై క్రియాశీలకంగా ఉంటుంది, ప్రాథమికంగా ఒక ఓవీ-లార్వాసంహారక మందు రూపంలో. కోర్ ప్రైమా™ కీటక నాశిని అనేది యాక్టివ్ పదార్థం రైనాక్సిపైర్® యాక్టివ్‌ని కలిగి ఉంది, ఇది ఇతర కీటక నాశినిలను తట్టుకునే శక్తిని గల కీటకాలను నియంత్రించే ఒక విశిష్టమైన చర్య రూపాన్ని కలిగి ఉంది. అలాగే, దీని పని తీరు సెలెక్టివ్‌గా ఉంటుంది మరియు లక్ష్య-యేతర ఆర్థ్రోపాడ్లకి హాని కలిగించదు మరియు సహజ పరాన్నజీవులు, వేటాడే పురుగులు మరియు పుప్పొడి వ్యాప్తికారకాలను సంరక్షిస్తుంది. ఈ లక్షణాలు కోర్ ప్రైమా™ ని సమగ్ర కీటక నిర్వహణ (ఐపిఎం) కార్యక్రమాల కోసం ఒక అద్భుతమైన సాధనంగా చేస్తాయి మరియు ఆహార రిటైలర్లు మరియు వినియోగదారుల కోరిక ప్రకారం ఎక్కువ నాణ్యత గల ఉత్పత్తిని అందించే లక్ష్యంగా కీటక నిర్వహణలో రైతులకు గొప్ప సానుకూలతను అందిస్తాయి.

సంక్షిప్త సమాచారం

  • భారతదేశంలో కూరగాయల ఉత్పత్తిదారుల కోసం ఎఫ్ఎంసి నుండి ఒక వినూత్న సాంకేతిక పరిజ్ఞానము
  • కాయ తొలుచు పురుగుల భరోసా ఇవ్వబడిన నియంత్రణ
  • కీటకాల కారణంగా జరిగే నష్టం నుండి మెరుగైన రక్షణ కారణంగా మెరుగైన పూత మరియు కాయ నిలుపుదల
  • మొక్క ఆరోగ్యంపై పనిచేసే తీరు
  • సమగ్ర చీడపీడల యాజమాన్యము (ఐపిఎం) నకు ఖచ్చితంగా సరిపోతుంది

ఉపయోగించిన పదార్ధాలు

  • రైనాక్సిపైర్® యాక్టివ్ - క్లోరాంట్రానిలిప్రోల్ 35% డబ్ల్యు/డబ్ల్యు డబ్ల్యుడిజి ని కలిగి ఉంది

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

3 లేబుల్స్ అందుబాటులో ఉన్నాయి

సపోర్టింగ్ డాక్యుమెంట్లు

ఉత్పత్తి అవలోకనం

రైనాక్సిపైర్® యాక్టివ్ కలిగి ఉన్న కోర్ ప్రైమా™ కీటక నాశిని అనేది ఎఫ్ఎంసి అందిస్తున్న కొత్త ఉత్పత్తి, ఇది టొమాటో మరియు బెండ పంటలలో ఆర్థికంగా ఎక్కువ ప్రభావం చూపే లెపిడోప్టెరన్ కీటకాల నుండి అద్భుతమైన రక్షణను అందిస్తుంది. ఈ విశిష్టమైన ఫార్ములేషన్ శీఘ్రమైన చర్యను, అధిక కీటక నాశిని సామర్థ్యాన్ని, దీర్ఘకాలిక నియంత్రణను అందించడంతో పాటుగా సులభమైన వాడకమును మరియు పంటలు మరియు లక్ష్యం చేసుకోని ప్రాణులకు అద్భుతమైన భద్రతను అందిస్తుంది. ప్రాథమికంగా ఇది అంతర్గ్రహణ విధానం ద్వారా చేసే కోర్ ప్రైమా™ మొక్కలను ఆశించిన కీటకాలు నిమిషాల్లో ఫీడింగ్ ఆపివేస్తాయి. అద్భుతమైన పంట రక్షణ మరియు దీర్ఘకాలిక అవశేష నియంత్రణ అనేవి శీఘ్రమైన ఫీడింగ్ నిలుపుదల, ట్రాన్స్‌లామినార్ చలనము, మొక్క లోపల అంతర్వాహక చలనము, వర్షపు నీటిని తట్టుకునే మెరుగైన స్థితి మరియు అధిక ఆంతరిక సామర్థ్యం వంటి దాని ధర్మాల యొక్క సమ్మిళిత ప్రభావాలుగా ఉంటాయి.

పంటలు

పేర్కొనబడిన పంటల జాబితా, లక్షిత తెగుళ్లు, వినియోగ సూచనలు, ఆంక్షలు మరియు జాగ్రత్తల గురించి ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్‌ని చూడండి. కావలసిన ఫలితాల కోసం పేర్కొనబడిన సూచనలను జాగ్రత్తగా చదవండి మరియు అనుసరించండి.

ఈ ఉత్పత్తి యొక్క నియంత్రణ మా పరిధిలో లేనందున, మేము ఉత్పత్తి యొక్క నాణ్యత పై మినహా వేటికి హామీ ఇవ్వము.

పూర్తి పంట జాబితా

  • టొమాటో
  • బెండకాయ