ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

ఇండియాలో వ్యవసాయ రంగం యొక్క రూపాంతర అభివృద్ధికై వాతావరణ మార్పును ఎదుర్కోవడం

యుఎన్ఎఫ్‌సిసిసి కి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సిఓపి 26) యొక్క 26వ సెషన్ వాతావరణ మార్పు పైన మరియు ఆ ప్రభావాన్ని ఎలా నిర్మూలించవచ్చనే విషయం పైన అనేక సంభాషణలను జరిపింది. అతి తక్కువ అభివృద్ధి చెందిన దేశాల యొక్క దృష్టి కోణముతో విడుదల చేయబడిన ఒక పత్రము, అత్యంత తీవ్రంగా ప్రభావితం అయిన దేశాల యొక్క అవసరాలను పేర్కొంటున్నది మరియు అత్యంత నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని పరిగణనలోకి తీసుకోకుండా సిఓపి 26 విజయవంతం కాదు అని పేర్కొంది.

వాతావరణము మరియు శీతోష్ణస్థితి పరిస్థితులపై అత్యధికంగా ఆధారపడియున్న అత్యంత నిస్సహాయ రంగాలలో వ్యవసాయ రంగం ఒకటిగా ఉంది. ఇండియా, తన 1.3 బిలియన్ జనాభా యొక్క సుమారు 68% తో, ప్రత్యక్షంగా గానీ లేదా పరోక్షంగా గానీ వ్యవసాయంపై నిమగ్నమై ఆధారపడి, ప్రపంచంలోని అత్యధిక ఆహార ఉత్పత్తిదారు దేశాలలో ఒకటిగా ఉంది. 1950లలో 51% నుండి సుమారు 16% వరకూ జిడిపి కి వ్యవసాయ దోహదము తగ్గిపోయినప్పటికీ, వ్యవసాయముపై ఆధారపడిన కుటుంబాల సంఖ్య 1951 లో 70 మిలియన్ల నుండి 2020 లో 120 మిలియన్లకు పెరిగింది. వ్యవసాయంపై ఈ విధంగా భారీగా ఆధారపడటం అనేది ఇండియాను వాతావరణ మార్పుకు మరింత నిస్సహాయంగా చేస్తోంది. 2017 యొక్క ఆర్థిక సర్వే ప్రకారము – విపరీతమైన వాతావరణ పరిస్థితుల కారణంగా దేశం సాలీనా 9-10 బిలియన్ యుఎస్‌డి వరకూ నష్టాలను భరించవలసి వచ్చింది. ఇది ఆహార భద్రతకు మరియు దేశం లోని గ్రామీణ జీవనోపాధులకు ఒక ముఖ్యమైన సవాలుగా ఉంది.

వాతావరణ మార్పును అధికం చేసే ముఖ్యమైన సవాళ్ళు

వ్యవసాయంపై ఆధారపడడం పెరిగినప్పటికీ సైతమూ, భూ కమతము యొక్క సగటు సైజును 1.08 హెక్టార్లకు తగ్గిస్తూ సాగు చేయదగిన భూమి పరిమాణములో అదే విధంగా నాణ్యతలో కూడా తగ్గిపోతోంది. చిన్న కమతాలుగా సాగుకు యోగ్యమైన భూమి యొక్క విభజన, నిర్లక్ష్యముతో కూడిన నేల యాజమాన్యముతో కలిసి భూసార క్షీణత పెరిగిపోతున్న తీరును ఎక్కువ చేస్తోంది. దీనికి మించి పైపెచ్చుగా, సిఎస్ఇ ప్రకారము, భారతదేశ భూమిలో 30% ప్రస్తుతం ఎడారీకరణ దిశగా పయనిస్తుంది.

2019లో, వాతావరణ మార్పుపై అంతర్‌ప్రభుత్వ ప్యానల్ (ఐపిసిసి) ఇలా నివేదించింది “భూ క్షీణత అనేది గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేయడం మరియు కార్బన్ గ్రాహ్యత యొక్క తగ్గుదల తీరుల ద్వారా వాతావరణ మార్పుకు ఒక వాహకము అవుతుంది". ఇది ఒక విష వలయము మరియు వాతావరణ మార్పు యొక్క సామాజిక-ఆర్థిక ప్రభావాలు భూమి క్షీణతను మరింత వేగవంతం చేస్తాయి. వాతావరణ మార్పులు అనిశ్చితి వాతావరణ మరియు ప్రకృతి సంక్షోభానికి కూడా దారి తీస్తాయి – అది కరవైనా, మహమ్మారి ఐనా, తుపానులైనా, భారీ వర్షమైనా లేదా వరదలైనా కావచ్చు. గాలిలోతేమ, ఉష్ణోగ్రత, మరియు వర్షపాతములో అనిశ్చితి పెరిగిన కారణంగా సాంప్రదాయక వ్యవసాయ కాలమానము తీవ్రమైన వాతావరణ మార్పుల కారణంగా అస్తవ్యస్తం అవుతుంది

నీటి పారుదలలో పెరిగిన నీటి వాడకము ఇండియా యొక్క తలసరి నీటి లభ్యతను 60% చే క్షీణింపజేయడం గడచిన 50 సంవత్సరాల పాటుగా కొనసాగుతూనే ఉంది, భూమి క్షీణతను వేగవంతం చేసింది. పైపెచ్చుగా, వరి మరియు చెరకు వంటి నీటి అవసర తీవ్రత గల పంటల కొరకు ప్రపంచం యొక్క అగ్రగామి ఎగుమతిదారులలో ఒకటిగా ఉంటూ, మేము వ్యవసాయ ఎగుమతులతో పాటుగా నీటిని (వాస్తవ నీరు) ఎగుమతి చేయడం ఆపివేశాము. ఈ క్షీణత వాతావరణ మార్పును వేగవంతం చేయడం మాత్రమే కాకుండా, తదనంతర ఎదుగుదల విడతల పాటుగా తక్కువ ఉత్పాదకతకు కూడా దారి తీస్తుంది.

అంచనాల ప్రకారము, వాతావరణ మార్పు ప్రతి సంవత్సరమూ జిడిపి లో సుమారుగా 1.5% నష్టం కలిగేలా దెబ్బతీస్తూ, సుమారు 4-9% వరకూ వ్యవసాయ ఉత్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది. భారతదేశం అనేక దేశాలతో పోలిస్తే వ్యవసాయ ఉత్పత్తిలో వెనుకబడి ఉంది. ఉదాహరణకు, మొక్క జొన్న, వరి, వేరు శెనగ, మరియు పప్పు దినుసుల యొక్క ఉత్పాదకత వాటికి సంబంధించిన ప్రాపంచిక సగటుల కంటే 54%, 40%, 31%, మరియు 33% తక్కువగా ఉంది. ఈ అంశాలు అన్నియునూ ఆహార భద్రతకు సమస్యగా మారాయి – ప్రపంచం యొక్క మొత్తం భూమి వైశాల్యములో కేవలం 2.4% తో, ఇండియా సుమారుగా 18% యొక్క ప్రపంచ జనాభాకు తోడ్పాటు ఇవ్వాల్సి ఉంది. మనం వ్యవసాయం మరియు 145 మిలియన్ కుటుంబాలపై వాతావరణ మార్పు యొక్క ప్రభావమును తగ్గించవలసిన అత్యంత కష్టమైన బాధ్యతను ఎదుర్కొంటున్నాము.

అవకాశం ఉన్న అంశాలు: సాంకేతికత, సుస్థిరత్వము మరియు పాలసీ మద్దతు

2030 నాటికి ఇండియా, భూమి క్షీణతను వెనక్కి మళ్ళించడానికి గాను కనీసం 30 మిలియన్ హెక్టార్ల బీడు భూములను పునరుద్ధరించవలసిన అవసరం ఉంది. వాతావరణ మార్పు యొక్క ప్రభావమును నిర్మూలించి మరియు వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడానికి గాను అత్యాధునిక-సాంకేతిక ఆవిష్కరణలను సుస్థిరత్వము మరియు వీలు కల్పించే పాలసీ మద్దతుతో కలుపుకొని పాటించవలసిన తక్షణ కర్తవ్యం వ్యవసాయ రంగానికి అవసరమై ఉంది.

అత్యాధునిక సాంకేతికతలు సరికొత్త పంట రక్షణ సాంకేతికతలతో పాటుగా కృత్రిమ మేధస్సు, ఐఓటి, మెషీన్ లర్నింగ్, బ్లాక్ చైన్, ప్రెసిషన్ వ్యవసాయం, డ్రోన్‌లు, స్మార్ట్ ట్రాక్టర్లు/ అగ్రి-బోట్లు, స్మార్ట్ గోదాములు మరియు రవాణా అనుకూలీకరణ, వాస్తవ-సమయపు దిగుబడి అంచనా మరియు ధర సమాచారముతో సహా ఇవన్నీ కర్బన పాదముద్రను తగ్గిస్తూ మరియు లాభాలను పెంచుతూ ట్రేసబిలిటీ, వాస్తవ-సమయపు దృశ్యత, అధిక ఉత్పాదకత, మరియు శ్రేష్టమైన నాణ్యతకు వీలు కల్పిస్తూ వ్యవసాయ రంగంలో మార్పును తీసుకువస్తాయి. ప్రెసిషన్ వ్యవసాయం పంటల యొక్క సమగ్ర ఉత్పాదకత, నాణ్యత, మరియు దిగుబడిని మెరుగుపరచడానికై తగినంతగా వాడకం ద్వారా నీరు, ఎరువులు మరియు కీటక నాశినిల సామర్థ్యమును గరిష్టం చేయడానికి డేటా విశ్లేషణలను సానుకూలం చేస్తుంది. డ్రోన్‌లు నేల మరియు పొలం ప్రణాళిక, పంట పర్యవేక్షణ, కలుపుమొక్కలు, కీటకాలు మరియు వ్యాధుల నుండి పంట రక్షణ, కూలీల ఒత్తిడిని రూపుమాపుట మరియు ఉత్పాదకతను పెంచడం ద్వారా రైతులకు సహాయపడగలుగుతాయి. ఎఫ్ఎంసి వంటి అగ్రగామి వ్యవసాయ శాస్త్రాల కంపెనీలు కేవలం పెట్టుబడుల సరఫరాదారులగానే నిలిచిపోవడానికి బదులు పరిష్కార ప్రదాతలుగా మారడానికి గాను అటువంటి సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించుకుంటున్నాయి. అదే విధంగానే, పాడి పశువుల యొక్క ఉత్పాదకతను పెంపొందించడం మరియు పాడిపరిశ్రమ రంగం నుండి వెలువడుతున్న మిథేన్ ఉద్గారాల సమస్యను పరిష్కరించడం కూడా కీలకం అవుతుంది.

సుస్థిరమైన ఆచరణలు అనగా వ్యవసాయ కార్యకలాపాల వల్ల సంభవించే పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి గాను పంట మార్పిడి, పప్పు దినుసులతో మిశ్రమ పంటలు వేయడం, జైవిక ఎరువులు వాడటం, కీటక నాశినిలు లేదా రసాయన ఎరువుల సక్రమ వాడకం మరియు సమీకృత కీటక యాజమాన్యం వంటి వాటిని — ప్రోత్సహించి మరియు పెంపొందించాల్సి ఉంటుంది. ప్రకృతి వనరుల పరిరక్షణను బిందు సేద్యం మరియు వ్యవసాయంలో సౌర వనరుల వినియోగం వంటి పద్ధతుల ద్వారా ముందుకు తీసుకువెళ్ళవచ్చు. ఉష్ణోగ్రత మరియు వర్షపాతం లోని హెచ్చుతగ్గులను పరిష్కరించగల వాతావరణాన్ని- తట్టుకునే పంటల అభివృద్ధి మరియు పంపిణీ కొరకు పెట్టుబడులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతులు మరియు విస్తరణ కార్యకర్తలలో సుస్థిర వ్యవసాయ పద్ధతుల గురించి పరిజ్ఞాన మార్పిడి మరియు సామర్థ్య పెంపుదలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎఫ్ఎంసి ఇండియాతో సహా అగ్రగామి వ్యవసాయ కంపెనీలు, ఉత్పాదనా ప్రక్రియలో నేల, నీరు మరియు పెట్టుబడులను ముందుకు నడిపే సారధ్యం వహించడానికి రైతు కమ్యూనిటీలతో సన్నిహితంగా కలిసి పని చేస్తున్నాయి.

ఇంకా,రైతులకు సహాయపడేందుకు వివిధ స్థాయిల్లో ప్రభుత్వ తోడ్పాటును మళ్ళించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వము కేవలం దిగుబడుల పైన మాత్రమే కాకుండా మొత్తం వ్యవసాయ ఉత్పాదన ఫలితాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తూనే వనరుల సంరక్షణను పెంపొందించడానికి కృషి చేయాలి. ప్రస్తుతం అత్యంత ఆవశ్యకం అయినది సేద్యపు నీటిని పొందడానికి విద్యుత్ పై సబ్సిడీని డ్రిప్ ఇరిగేషన్ మరియు సోలార్ ప్యానెళ్ల ఇన్‌స్టాలేషన్‌తో భర్తీ చేయడం. నేలను సంరక్షించి నీరు మరియు పోషకాలను సమర్థవంతంగా ఉపయోగించుకుని తక్కువ నీటిని వినియోగించుకునే పంటల (చిరుధాన్యాలు మరియు పప్పు దినుసులు) ఉత్పత్తికి రాయితీలు కల్పించడం, మరియు ఆకర్షణీయమైన కనీస మద్దతు ధర మరియు రైతులకు పెట్టుబడి రాయితీలను ప్రకటించడం అనేవి సరియైన దిశలో ముందడుగు వేసినట్లవుతుంది. సహజ వనరుల లభ్యతపై ప్రతికూల ప్రభావమును చూపించే పంటల (చెరకు మరియు వరి) కొరకు రాయితీలను ఇవ్వడం గురించి పునఃసమీక్ష చేయడం ముఖ్యం. ఎఫ్‌పిఒ ల సమన్వయ సామర్థ్యాలను వృద్ధి చేసి వినియోగించుకోవడం వ్యవసాయము మరియు రైతుల యొక్క సుస్థిరత్వమును నిర్ధారిస్తుంది.

ముగింపు

పాలసీ లక్ష్యంగా ఆహార భద్రతకు తొలి ప్రాధాన్యతను ఇచ్చిన అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారతదేశం ఒకటి మరియు 1970ల హరిత విప్లవంతో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించిందిసాంకేతిక పరిజ్ఞానము మరియు ఆవిష్కరణ, సుస్థిరమైన ఆహారోత్పత్తి మరియు వాతావరణ మార్పు యొక్క ప్రభావ నిర్మూలన కొరకు వ్యవసాయంలో రూపాంతరం యొక్క తదుపరి తరంగాన్ని ముందుకు నడుపుతుంది. రైతులు సుస్థిరమైన పద్ధతులు అవలంబించడానికి, సుస్థిరమైన పరిష్కారాల ద్వారా ప్రభావమును చూపగల సంస్థలను ప్రోత్సహించడానికి, వినియోగదారులు మరియు రైతులకు అవగాహన కల్పించడానికి మరియు ఉన్నదానితో సంతృప్తిపడే సేద్యం నుండి డిమాండ్-ఆధారితంగా నడపబడే సుస్థిర సేద్యానికై వ్యవసాయ రంగానికి పునరవగాహన ఇవ్వడానికి సుస్థిరమైన వ్యవసాయ-సంస్కరణలు మరియు ప్రోత్సాహక వ్యవస్థలను రూపొందించడం కీలకం అవుతుంది.