ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

ఎఫ్ఎంసి కార్పొరేషన్ మరియు అరాజెన్ లైఫ్ సైన్సెస్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి

అరాజెన్ లైఫ్ సైన్సెస్ (గతంలో, జివికె బయో) మరియు ఎఫ్ఎంసి కార్పొరేషన్ ఒక వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు చేయడానికి అంగీకరించాయి. ఈ భాగస్వామ్యం ద్వారా, రసాయన శాస్త్ర ఆవిష్కరణ, జీవశాస్త్ర ఆవిష్కరణ మరియు రసాయన ప్రక్రియ అభివృద్ధి సహా ఎఫ్ఎంసి యొక్క అంతర్జాతీయ ఆవిష్కరణ మరియు అభివృద్ధి అవసరాల కోసం అరాజెన్ మద్దతును అందిస్తుంది.

ఈ భాగస్వామ్యం ఎఫ్ఎంసి కార్పొరేషన్ యొక్క ఆగ్రో-కెమికల్ పైప్‌లైన్‌ను వేగవంతం చేయడంపై దృష్టి పెడుతుంది. "పంట విజ్ఞానంలో ప్రముఖులలో ఒకరైన ఎఫ్ఎంసి కి సహకరిస్తూ ఒక దీర్ఘకాలిక భాగస్వామ్యం ద్వారా వారి పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాన్ని వేగవంతం చేయడంలో సహకరిస్తున్నందుకు మేము గర్వపడుతున్నాము. ఆవిష్కరణ మరియు అభివృద్ధి విభాగాలకు ఈ భాగస్వామ్యాన్ని విస్తరించడం అనేది అరాజెన్ పై ఎఫ్ఎంసి కి గల విశ్వాసం మరియు నమ్మకానికి నిదర్శనం, మా భాగస్వామి కోసం మరిన్ని విజయాలు సాధించాలని మేము కోరుకుంటున్నాము," అని అరాజెన్ సిఇఓ మన్ని కంటిపూడి పేర్కొన్నారు.

ఎఫ్ఎంసి కార్పొరేషన్ పరిశోధన మరియు అభివృద్ధి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అయిన కాథలీన్ షెల్టన్ ఈ భాగస్వామ్య ఒప్పందం గురించి మాట్లాడుతూ, " ఎఫ్ఎంసి కి అనేక సంవత్సరాలుగా అరాజెన్ విలువైన భాగస్వామిగా ఉంది" అని ఎఫ్ఎంసి వైస్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అయిన డాక్టర్ కాథలీన్ షెల్టన్ అన్నారు, "ఈ భాగస్వామ్యం పరిశోధన మరియు అభివృద్ధి రంగంలో అనేక విభాగాలకు విస్తరించింది మరియు పనిలో మా ధృడమైన భాగస్వామ్యాన్ని అభినందిస్తున్నాము."