ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

వ్యవసాయ మరియు అనుబంధ వ్యాపారాలలో నాయకత్వ బాధ్యతలను చేపట్టడానికి మహిళలను ప్రోత్సహించడం

చారిత్రాత్మకంగా, ఒక దేశం యొక్క ఎదుగుదల మరియు దీర్ఘకాలిక అభివృద్ధిలో మహిళలు ఒక కీలకమైన పాత్రను పోషిస్తారు మరియు తరచుగా ఒక అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ యొక్క వెన్నెముకగా పరిగణించబడతారు.



ప్రాథమికంగా ఒక వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశంలో, వ్యవసాయ క్షేత్రాలలో పురుషులతో మహిళలు కలిసి పనిచేయడం కనిపిస్తుంది. ఆర్థిక అభివృద్ధి మరియు కొత్త ఉద్యోగాల సృష్టితో, గ్రామీణ ప్రాంతాల నుండి నగరాలకు పురుషుల వలసలు వేగంగా పెరుగుతుంది, వ్యవసాయ రంగంలో రైతులుగా, వ్యాపారస్తులుగా మరియు కూలీలుగా మహిళల పాత్రకు తగిన ప్రాధాన్యం లభించలేదు. ఈ రంగము భారతీయ జనాభాలో 60 శాతం కంటే ఎక్కువ మందికి ఉపాధి కలిపిస్తుంది మరియు దేశం యొక్క జిడిపికి దాదాపుగా 18 శాతం అందిస్తుంది. వాస్తవానికి, భారతదేశంలో ఆర్థికంగా చురుకైన మహిళల్లో సుమారుగా 80 శాతం వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నారని ఒక ఆక్స్‌ఫామ్ పరిశోధన పేర్కొంటున్నది, ఇది స్వయం-ఉపాధిగల రైతులలో 48 శాతం మరియు వ్యవసాయ కూలీలలో 33 శాతంగా ఉంటుంది.

అయినప్పటికీ, వ్యవసాయ రంగం మరియు సేద్యపరికరాలు మరియు యంత్ర సామాగ్రి, ఎరువులు, కీటక నాశిని, ఫైనాన్సింగ్, మత్స్యపరిశ్రమ మరియు ఎఫ్ఎంసిజి వంటి అనుబంధ రంగాలలో మధ్యస్థాయి మరియు సీనియర్ స్థాయి యాజమాన్య స్థానాలతో సహా అన్ని స్థాయిలలోనూ మహిళల యొక్క వాటా తులనాత్మకంగా అంత గణనీయంగా లేదు.



సామాజిక-సాంస్కృతిక సందర్భం



వ్యవసాయ రంగం తరచుగా నిర్మాణాత్మక సవాళ్లు మరియు అర్థరహితమైన ఆలోచనలతో సతమతమవుతూనే ఉంది. ఇది ప్రత్యేకించి మహిళలు సాంప్రదాయ బద్ధమైన పాత్రల్లో ఒదిగిపోతున్న గ్రామీణ ప్రాంతాల్లో ప్రబలంగా ఉంది – వారు కుటుంబం కోసం గృహిణిలుగా మరియు సంరక్షకులుగా మరియు ప్రాథమిక సంపాదనాపరులైన వారి పురుష భాగస్వాములకు మద్దతుగా ఉంటున్నారు. ఈ రంగములో మహిళలు తమ సామర్థ్యాన్ని వెలికి తీయడాన్ని నిరుత్సాహపరచే స్వీకార లోపము ప్రధానంగా పురుషాధిపత్య సమాజముచే ప్రదర్శించబడుతోందనే వాస్తవముతో దీనిని కలిపి చూడవచ్చు.



దానికి అదనంగా, అనుబంధ పరిశ్రమలలో సైతమూ, మహిళలు తమ జీవనపయనం అంతటా అడ్డంకులను ఎదుర్కోవచ్చు, అది వారి కెరీర్ ఎంపిక అయినా లేదా కంపెనీ హోదా సోపానములో తమకు ఒక చోటును సృష్టించుకోవడానికి వారు చేసే ప్రయత్నాలు అయినా కావచ్చు. అమ్మకాలు, పరిశోధన, మందులు, తయారీ మొదలగు వంటి విధులు సాంప్రదాయకంగా పురుషుడి పనిగా భావించడం జరుగుతుంది. మహిళలు అందించే సృజనాత్మకత మరియు ప్రతిభను వినియోగించుకోలేని గ్రామీణ మార్కెట్ సంబంధిత పరిశ్రమలలో ఈ పరిస్థితి చాలా ఎక్కువగా ఉంటోంది.



సవాళ్లను ఎదుర్కోవడం



సంస్థాగత విలువలు మరియు సంస్కృతికి అనుగుణంగా ప్రతిభను పొంది మరియు అభివృద్ధి చేసుకోవడానికి వ్యూహాత్మక చొరవ కార్యక్రమాలను చేపట్టడం వ్యవసాయ మరియు సంబంధిత రంగాలలోని ప్రధాన వ్యక్తుల కొరకు తక్షణ కర్తవ్యంగా ఉంది. ఇది 'హార్డ్‌వేర్' మరియు 'సాఫ్ట్‌వేర్' చొరవ కార్యక్రమాల కలయికతో సాధించవచ్చు. ఇక్కడ, 'హార్డ్‌వేర్' అనేది మహిళలకు అనుకూలమైన, సంతోషకరమైన మరియు మద్దతు కలిగిన అదేవిధంగా సమానమైన అవకాశాల క్షేత్రాన్ని అందించే మౌలిక సదుపాయాలతో కూడిన పని సంస్కృతిని సృష్టిస్తూ మహిళల భద్రత మరియు రక్షణకు సంబంధించిన నిర్దిష్ట పాలసీలను సూచిస్తుంది. ఇక్కడ 'సాఫ్ట్‌వేర్' అంటే, చేరిక కల్పనపై శిక్షణ, తెలియని మరియు తెలిసిన వివక్షను గుర్తించడం మరియు తొలగించడం మరియు మొదలైనటువంటి విధానాల ద్వారా వైవిధ్యత మరియు చేకూర్పుకు సంబంధించి మనో భావనల్లో స్థిరమైన మరియు శాశ్వత మార్పును తీసుకురావడం అని అర్థం. ఇది ముందస్తుగా ఉండే లింగపరమైన ఆకాంక్షల నుండి దూరంగా జరిగి మరియు కెరీర్ మార్గాలకు రూపకల్పన చేయబడిన నిజమైన వైవిధ్య మరియు సంఘటిత పని వాతావరణాన్ని సృష్టించడానికి సంస్థకు సహాయపడుతుంది.



అదనంగా, సంస్థలు ఒక సంఘటితమైన కలిగిన మరియు వైవిధ్యమయమైన పని వాతావరణాన్ని బలోపేతం చేసి మరియు ప్రోత్సహించడానికి గాను, సంస్థ లోపున అన్ని స్థాయిలలోనూ మహిళా ప్రతిభ వనరులను వృద్ధి చేయడానికి లక్ష్యంగా చేసుకున్న ఒక ఊద్దేశ్యపూర్వకమైన మరియు వ్యూహాత్మకమైన కార్యక్రమాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఉంది, ఇది పురుషాధిక్య భావనతో ఉన్న విధులతో సహా అన్ని కార్యవిధుల వ్యాప్తంగా మహిళలకు శిక్షణ మరియు తర్ఫీదు ఇవ్వడం ద్వారా సాధించబడుతుంది.



వ్యవసాయ శ్రామికులలో మహిళల కొరకు ఎదుగుదల మార్గాలను ప్రోత్సహించే కార్యక్రమాలు మరియు దీర్ఘకాలిక లక్ష్యాలను వ్యాపారాలు నెలకొల్పాల్సిన అవసరం ఉంది. అదనంగా, కంపెనీలు ఏకీకృత బృంద చర్చలు వంటి బహిరంగ కమ్యూనికేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేయవచ్చు, ఇందులో మహిళా ఉద్యోగులు తాము ఎదుర్కొనే సమస్యలు లేదా సవాళ్లను స్వేచ్ఛగా చర్చించవచ్చు. వ్యవసాయ క్షేత్రములో ఒక ప్రముఖ కంపెనీగా ఉన్న ఎఫ్ఎంసి, ఈ విషయాన్ని పరిష్కరించడానికి గాను వివిధ వ్యూహాత్మక చొరవ కార్యక్రమాలను చేపట్టింది. ఎఫ్ఎంసి యొక్క మహిళా ఇనిషియేటివ్ నెట్‌వర్క్ (విన్) మరియు వైవిధ్యత మరియు చేరిక (డి మరియు ఐ) కౌన్సిల్ అనేవి లింగ సమానత్వం మరియు జాతి సమత్వం దిశగా కంపెనీ యొక్క నిబద్ధతను ప్రదర్శించే కొన్ని మార్గాలుగా ఉన్నాయి. కంపెనీ, తన అనేక వైవిధ్యత మరియు చేరిక వ్యూహాల ద్వారా, అన్ని ప్రాంతాలు మరియు ఉద్యోగ స్థాయిలలో 2027 నాటికి తన ప్రాపంచిక శ్రామిక దళములో 50:50 లింగ నిష్పత్తిని నెలకొల్పే దిశగా పని చేస్తోంది.



తన వంతుగా ప్రభుత్వం కూడా మహిళలను సాధికారపరచడంలో తన ప్రయత్నాల్లో తీవ్రంగా కృషి చేస్తుంది. అట్టడుగు స్థాయిలో, నారి శక్తి పురస్కారములు మరియు మహిళల కోసం శిక్షణ మరియు ఉపాధి కార్యక్రమం (స్టెప్) కు మద్దతు వంటి విద్యా పథకాలు మరియు శిక్షణ మరియు నైపుణ్య కార్యక్రమాలు ఉన్నాయి. ప్రత్యేకించి 2 మరియు 3 శ్రేణి నగరాల్లో గ్రాడ్యుయేట్ కార్యక్రమాలు అందించబడుతున్నాయి, అవి ముఖ్యంగా మహిళలు మరియు రైతు సమాజానికి నిర్దిష్టమైనవిగా ఉన్నాయి. కార్పొరేట్ పనిప్రదేశాన్ని లక్ష్యంగా చేసుకొని, శ్రామిక శక్తిలో మహిళల యొక్క భాగస్వామ్యానికి సంబంధించి ఖచ్చితమైన గణాంకాలను అందించగల లింగ సారూప్యత లేదా మహిళల ప్రాతినిధ్యము వంటి స్పష్టమైన విషయాంశాలను ప్రభుత్వం నెలకొల్పింది.



వ్యవసాయ రంగములోని వివిధ సంస్థలు మహిళల విజయాన్ని గుర్తించవలసిన అవసరం ఉంది మరియు ఈ రంగము లోనికి అడుగు పెట్టాలని ఆకాంక్షిస్తున్న ఇతర మహిళలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా వారికి తగినంత స్ఫూర్తిని ఇవ్వాల్సిన అవసరం ఉంది. మహిళా నాయకులు మరియు పలుకుబడి గలవారు తమ గత ఉద్యమాల గురించిన విజయగాధలను వివరించడమనేది యుక్తవయసు అమ్మాయిలు తమ కెరీర్ మార్గాలను రూపొందించుకునేలా స్ఫూర్తిని కలిగించడానికి ప్రోత్సహించే కొన్ని మార్గాలుగా ఉంటాయి.



ఇతర ఉదాహరణల నుండి నేర్చుకోవడం



ఇతర ఆసియా దేశాలలో పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. ఫిలిపైన్స్, థాయిలాండ్ మరియు వియత్నామ్ లో, మహిళలు సమాన సంపాదనాపరులుగా గుర్తించబడతారు మరియు సమాజంలో వారి ఆర్థిక భాగస్వామ్యం సాపేక్షంగా చాలా ఎక్కువగా ఉంటుంది. పర్యవసానంగా, వ్యవసాయ వ్యాపారాల్లో ఎక్కువ భాగం మహిళలచే నడపబడతాయి లేదా వారు ముఖ్య నిర్ణయాధికారం కలిగినవారుగా ఉంటారు.



వాస్తవానికి, అనేక ఆసియా దేశాలలో, పురుషులు మరియు మహిళలు ఉభయులనూ దృష్టిలో ఉంచుకొని అన్ని కార్పొరేట్ మౌలికసదుపాయాలు నిర్మించబడ్డాయి. అనేక నగరాల్లో పిల్లల పగటి-సంరక్షణ సేవలు ఉన్న విధంగానే అత్యంత మారుమూల ప్రాంతాలలో సైతమూ మహిళల కొరకు టాయిలెట్లు వంటి ప్రాథమిక ఆవశ్యక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. నగరము లోపల, అదే విధంగా బయట కూడా రెండింటిలోనూ ప్రజా రవాణా ఉపయోగించి సులువుగా ప్రయాణించే మహిళల భద్రతపైన మరియు మహిళలను సాధికారపచడం పైన బలమైన దృష్టిసారింపు ఉంది.



భారతదేశంలోని వ్యవసాయ మరియు అనుబంధ రంగాలు ఈ విషయంలో తమ ఇరుగుపొరుగు నుండి సులభంగా కొన్ని అంశాలను గ్రహించవచ్చు. మరింత చేరిక సహిత వాతావరణం మన సాంస్కృతిక చట్రము నుండి బయట పడవేస్తుంది మరియు భవిష్యత్తుకు సిద్ధంగా ఉండడానికి మనకు బలమైన మరియు స్థిరమైన వైవిధ్యత మరియు చేరిక కలిగి పని సంస్కృతి ఉండాలి.