ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

సంఘ భాగస్వామ్యం మరియు అభివృద్ధి అనేది సుస్థిరత్వం మరియు కార్పొరేట్ సామాజిక బాధ్యత దిశగా ఎఫ్ఎంసి యొక్క నిబద్ధత యొక్క అంతర్గత భాగంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో గ్రామీణ మరియు ఉప-పట్టణ కమ్యూనిటీల ఆరోగ్యం మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి గాను వారికి వనరుల యొక్క మెరుగైన ప్రాప్యతతో సహాయపడుతూ మేము పనిచేస్తాము. గ్రామీణ సమాజంతో పాటుగా, మా తయారీ ప్లాంట్ల చుట్టుపట్ల నివసిస్తున్న సంఘాల పై మా ప్రత్యేక దృష్టి ఉంటుంది.

పనోలి, గుజరాత్‌లో ఎఫ్ఎంసి ఇండియాకి అత్యాధునిక తయారీ ప్లాంట్ ఉంది. ప్లాంట్ చుట్టుపట్ల ఉన్న సామాజిక మౌలిక సదుపాయాల అభ్యున్నతికి దోహదపడేందుకు గాను మేము అనేక కార్యక్రమాలను చేపట్టి ఉన్నాము, అవి వనరుల ప్రాప్యతను మరింతగా మెరుగుపరచడానికి సహాయపడతాయి. మా ఇటీవలి పనులలో కొన్ని, సమీపంలోని గ్రామ పాఠశాలకు కంప్యూటర్ల వితరణ, మంచినీటి కోసం బోరు బావి త్రవ్వకం మరియు నెలకొల్పడం, క్రీడల టోర్నమెంట్ల కొరకు స్పాన్సర్‌షిప్ మరియు గ్రామ మినీ-స్టేడియం యొక్క ఆధునీకరణ కార్యక్రమం వంటివి ఉన్నాయి. పారిశ్రామిక పార్కు ప్రవేశద్వారము వద్ద ఒక హరిత తోరణం అభివృద్ధి చేయడానికి కూడా మేము బాధ్యత తీసుకున్నాము. పచ్చికబయళ్ళ నిర్వహణ, మొక్కలు మరియు పొదలు నాటడం, నీటి స్ప్రింక్లర్స్ నెలకొల్పడం, నడక కోసం జాగర్స్ బాట ఏర్పాటు చేయడం మరియు ఆ ప్రదేశములో నీటి సంరక్షణ కుంట యొక్క నిర్వహణ ఇవన్నీ ఎఫ్ఎంసి చే చేపట్టబడతాయి. ఆ పరిసర ప్రాంతములో మేము క్రమం తప్పకుండా మొక్కలు నాటే కార్యక్రమాలు, గ్రామంలో బెంచీల ఏర్పాటు, వలస కార్మికులకు ఆహార పొట్లాల పంపిణీలు మొదలైన ఇతర కార్యకలాపాలను నిర్వహిస్తాము.

పనోలి సైట్ అనేది ఎఫ్ఎంసి యొక్క మొట్టమొదటి తయారీ సైట్, ఆ సైట్ వద్ద 50 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ద్వారా దాని ఎనర్జీ ఆవశ్యకతలో 15% ని పొందుతుంది. మేము సౌర శక్తిని మరింతగా ఉపయోగించుకొని మా కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను మరింతగా తగ్గించడాన్ని లక్ష్యంగా కలిగి ఉన్నాము.

అటువంటి చొరవలు మరియు మరిన్ని సంక్షేమ పథకాల పై దృష్టితో, మా కమ్యూనిటీలతో తదుపరి స్థాయికి నిమగ్నం కావడానికి మరియు మా పర్యావరణ వ్యవస్థల అభివృద్ధిలో దోహదపడటానికి మేము కట్టుబడి ఉన్నాము.