ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

కొరాజెన్® కీటక నాశిని

కొరాజెన్® పురుగుల మందు అనేది గాఢత రూపంలో ఉండే ఒక ఆంత్రానిలిక్ డయామైడ్ కీటక నాశిని, ఇది అనేక రకాల కీటకాలను చంపుతుంది. కొరాజెన్® కీటక నాశిని ముఖ్యంగా లెపిడోప్టెరాన్ కీటకాల తెగుళ్ల పై ప్రభావవంతంగా, ఒక లార్విసైడ్‌గా పనిచేస్తుంది. కొరాజెన్® కీటక నాశిని క్రియాశీల పదార్థం రైనాక్సిపైర్® క్రియాశీల పదార్ధం ద్వారా శక్తిని పొందుతుంది, ఇది ఇతర కీటక నాశునులను నిరోధించే తెగుళ్లను నియంత్రించే ఒక విశిష్ట చర్యా రూపాన్ని కలిగి ఉంటుంది. అలాగే, ఇది నాన్-టార్గెట్ ఆర్థ్రోపాడ్స్ కోసం ఎంపిక చేయబడింది మరియు సురక్షితమైనది, సహజ పరాన్నజీవులు, మాంసాహారులు, పుప్పొడి రవాణా జీవులను సంరక్షిస్తుంది. ఈ లక్షణాలు కొరాజెన్® కీటక నాశినిను ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్‌మెంట్ (ఐపిఎం) ప్రోగ్రామ్‌ల కోసం అద్భుతమైన సాధనంగా చేస్తాయి మరియు ఆహార రిటైలర్లు, వినియోగదారుల డిమాండ్‌లకు అనుగుణంగా అధిక నాణ్యత గల ఉత్పత్తులను అందించడమే లక్ష్యంగా ఇవి పెంపకందారులకు తెగుళ్ల నిర్వహణలో ఎక్కువ సౌలభ్యాన్ని అందిస్తాయి.

సంక్షిప్త సమాచారం

  • ఒక దశాబ్దానికి పైగా లక్షాలది రైతుల విశ్వాసాన్ని చూరగొన్న నవీన సాంకేతికత
  • చీడపీడల నుండి సర్వోత్తమ రక్షణను అందిస్తుంది, పంటలలో గరిష్ట దిగుబడిని సాధించడానికి వీలు కల్పిస్తుంది
  • చీడల నుండి దీర్ఘకాలిక రక్షణను అందిస్తుంది
  • సమగ్ర చీడపీడల యాజమాన్యము (ఐపిఎం) నకు ఖచ్చితంగా సరిపోతుంది

ఉపయోగించిన పదార్ధాలు

  • రైనాక్సిపయర్ ®యాక్టివ్ – క్లోరాంత్రానిప్రోల్ 18.5% డబ్ల్యు/డబ్ల్యు ఎస్‌సి కలిగి ఉంది

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

4 లేబుల్స్ అందుబాటులో ఉన్నాయి

సపోర్టింగ్ డాక్యుమెంట్లు

ఉత్పత్తి అవలోకనం

కొరాజన్® కీటక నాశిని అనేది రైనాక్స్‌పైర్ ® అనే సక్రియ పదార్ధం శక్తితో, గ్రూపు 28 పనిచేసే విధానానికి చెందిన ఒక కీటక నాశిని, ఇది లక్షిత పురుగుల నుండి పంటలకు అద్భుతమైన రక్షణను అందిస్తుంది. ఈ అద్భుతమైన సాంకేతికత ఆర్థికంగా పంట నష్టానికి కారణమయ్యే లెపిడోప్టెరా మరియు ఇతర కీటక జాతులను నియంత్రిస్తుంది. ఈ ప్రత్యేకమైన ఫార్ములా వేగవంతమైన పనిచేసే శక్తి, అత్యుత్తమమైన పురుగు నియంత్రణ సామర్ధ్యం, దీర్ఘకాలిక నియంత్రణ , పంటలకు మరియు గురి చేయబడని ( మేలుచేసే) జీవులకు అద్భుతమైన భద్రత అందించటంతో పాటు వాడకంలో వెసులుబాటును కలిగి వుంది. కొరాజన్® ప్రధానంగా కిటకాలు తినడం ద్వారా వాటిపై పనిచేస్తూ, అన్ని దశల పురుగులను చంపివేస్తుంది, తద్వారా అద్భుతమైన మరియు దీర్ఘకాలిక పంట రక్షణను అందిస్తుంది. రైతులకు అందుబాటులో ఉన్న వివిధ మందులలో, కొరాజన్® చాలా రకాల పంటలపై ఉపయోగించడానికి సిఫారసు మరియు ఆమోదం కలిగి ఉంది మరియు టార్గెట్ చేసిన పంటలలో లెపిడోప్టెరా జాతి పురుగులను నియంత్రించడంలో రైతుల యొక్క అత్యుత్తమమైన ఎంపిక.

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

పంటలు

పేర్కొనబడిన పంటల జాబితా, లక్షిత తెగుళ్లు, వినియోగ సూచనలు, ఆంక్షలు మరియు జాగ్రత్తల గురించి ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్‌ని చూడండి. కావలసిన ఫలితాల కోసం పేర్కొనబడిన సూచనలను జాగ్రత్తగా చదవండి మరియు అనుసరించండి.

ఈ ఉత్పత్తి యొక్క నియంత్రణ మా పరిధిలో లేనందున, మేము ఉత్పత్తి యొక్క నాణ్యత పై మినహా వేటికి హామీ ఇవ్వము.

పూర్తి పంట జాబితా

  • చెరకు
  • సోయా చిక్కుడు
  • మొక్క జొన్న
  • వేరు శెనగ
  • శనగ
  • వరి
  • కంది
  • మినుములు
  • ప్రత్తి
  • క్యాబేజ్
  • మిరప
  • టొమాటో
  • వంకాయ
  • కాకరకాయ
  • బెండకాయ