ఎఫ్ఎంసి ఇండియా తన కమ్యూనిటీ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్ అయిన ప్రాజెక్ట్ సమర్థ్ ద్వారా రైతులకు ఒక మెరుగైన మరియు శ్రేయోదాయకమైన జీవితం సాధించడానికి తగిన మద్దతును ఇస్తోంది.
నాలుగు కీలక అంశాలకు ప్రాధాన్యం కలిపించడం ద్వారా ఈ సంస్థ భారతీయ రైతు కుటుంబాల జీవితాలలో మార్పును తీసుకువస్తుంది, ఆ అంశాలు: సురక్షిత నీరు మరియు మంచి ఆరోగ్యం, మంచి వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయంలో శాస్త్ర విజ్ఞాన వినియోగం మరియు వ్యవసాయంలో మహిళల సాధికారత.
ప్రాజెక్ట్ సమర్థ్ యొక్క మూలస్తంభాలుగా, రైతులపై-దృష్టి సారించిన వివిధ ప్రాజెక్టులు అమలవుతున్నాయి లేదా ప్రారంభ దశలో ఉన్నాయి. ఉదాహరణకు, ప్రాజెక్ట్ సమర్థ్ కింద సురక్షితమైన త్రాగునీటి చొరవ కార్యక్రమం ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యం (ఎస్‌డిజి) 6.1 కి నేరుగా మద్దతు ఇస్తుంది "2030 నాటికి అందరికీ సురక్షితమైన మరియు స్థోమతకు తగిన త్రాగునీటికి సార్వత్రిక మరియు సమానమైన ప్రాప్యత". ఈ కార్యక్రమం ద్వారా, తదుపరి మూడు సంవత్సరాల లోపున దేశంలోని 200,000 వ్యవసాయ కుటుంబాలకు సురక్షితంగా మరియు సులువుగా లభించేలా త్రాగునీటిని అందించాలని ఎఫ్ఎంసి ఇండియా ఆశిస్తోంది.
సురక్షితమైన త్రాగునీటి కార్యక్రమం క్రింద, కంపెనీ 2019 లో 15 నీటి వడబోత ప్లాంటులను నెలకొల్పింది. ప్రతి కుటుంబమూ తన సురక్షిత త్రాగునీటి కేటాయింపును సులభంగా పొందడానికి గాను 20 లీటర్ల నీటిని విడుదల చేసే స్వైప్ కార్డుతో నీటి పంపిణీ యూనిట్లు నెలకొల్పబడ్డాయి. ఈ ప్లాంట్లు సహకార ప్రాతిపదికన గ్రామ కమ్యూనిటీ ద్వారా నిర్వహించబడతాయి, ప్లాంట్ల నిర్వహణ కోసం ఎఫ్ఎంసి సిబ్బంది స్థానిక కమ్యూనిటీలకు మద్దతును అందిస్తూ మార్గనిర్దేశకం చేస్తాయి.
కమ్యూనిటీపై ఈ కార్యక్రమం యొక్క ప్రభావాన్ని వివరిస్తూ, రామువాపూర్ చెందిన మణికాంత్ మిశ్రా ఇలా అన్నారు, "నీటిశుద్ధి ప్లాంటులను నెలకొల్పిన తర్వాత, వ్యాధులు కలగడమనేది దాదాపుగా 50 శాతం తగ్గింది. అదనంగా, ఈ వ్యాధుల చికిత్సపై అయ్యే ఖర్చుల నుండి కూడా ఇది మాకు స్వేచ్ఛను ఇచ్చింది.”
2020వ సంవత్సరంలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చెరకు కో-ఆపరేటివ్ సొసైటీలలో శుద్ధి చేయడం, కూలర్ మరియు నిల్వ సౌకర్యాలను కలిగియున్న 52 నీటి శుద్ధి యూనిట్లను కంపెనీ నెలకొల్పింది. ఈ యూనిట్లు ప్రతి గంటకు 40 లీటర్ల నీటిని శుద్ధి చేయు సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది సంవత్సరం పొడవునా చక్కెర సహకార-సంఘాలను సందర్శించే రైతులు మరియు సందర్శకులకు స్వచ్ఛమైన మరియు చల్లని నీటిని అందిస్తుంది. మార్చి 2021 లో 27 కొత్త కమ్యూనిటీ వాటర్ ప్యూరిఫికేషన్ యూనిట్లను నెలకొల్పడంతో ఇది మరింతగా మెరుగుపరచబడింది. ఈ రోజు, ఉత్తర ప్రదేశ్ మరియు పంజాబ్‌లోని 120 గ్రామాలు, 80,000 రైతు కుటుంబాలు ఈ కార్యక్రమం యొక్క ప్రయోజనాలను పొందవచ్చని ఆశించబడుతోంది. ఫైజ్‌పూర్ నుండి ఒక గృహిణి మిథిలేష్, తనకు సమయం మరియు శక్తిని ఆదా చేసుకోవడానికి సహాయపడుతూ మరియు తన కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ సౌకర్యవంతంగా చేసిన ఈ సదుపాయాన్ని అందించినందుకు ఎఫ్ఎంసి కి ధన్యవాదాలు తెలియజేసింది. "ఈ ప్రాజెక్ట్ మా ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి సహాయపడటం మాత్రమే కాకుండా సేవను పొందుతున్న కుటుంబాలలో ఆరోగ్యం, సంతోషము మరియు మనశ్శాంతిని కూడా తీసుకువచ్చింది” అని మరొక గ్రామస్థుడు వివరించారు. నీటిని పొందడానికి అయ్యే సమయాన్ని మేము ఆదా చేసుకున్నాము, దానిని వ్యవసాయం కోసం ఉపయోగించుకోవచ్చు.”
భారతదేశ వ్యాప్తంగా మరో ఐదు రాష్ట్రాలను చేర్చడానికి గాను ఎఫ్ఎంసి ఈ ప్రాజెక్ట్ యొక్క పరిధిని విస్తరిస్తోంది మరియు 2021 లో ఎంచుకున్న రాష్ట్రాల్లో 35 కమ్యూనిటీ నీటి వడబోత (శుద్ధి) యూనిట్ల వరకు నెలకొల్పబోతున్నది. అదే విధమైన ప్లాంట్ల సంఖ్య 2022 కు షెడ్యూల్ చేయబడింది. వ్యవసాయ కమ్యూనిటీ కోసం సురక్షితమైన మరియు విశ్వసనీయమైన నీటి వనరులకు ప్రాప్యత వలన వారు ప్రతి రోజు నీటి కోసం చేసే పోరాటాన్ని తగ్గిస్తుంది మరియు ఈ సమయాన్ని ఆదాయాన్ని పెంచుకోవడానికి మరియు సుస్థిరమైన సేద్య పద్ధతులను ఆచరించగల ఇతర మార్గాలలో ఉపయోగించుకోవచ్చు.
సురక్షితమైన త్రాగునీటి చొరవ కార్యక్రమం యొక్క పొడిగింపుగా, మంచినీటి వనరుల సుస్థిరమైన నిర్వహణను పెంచడానికి గాను కంపెనీ రైతులకు ఉత్తమ పద్ధతులపై అవగాహన కల్పిస్తూ ఉంది. ఉదాహరణకు, ప్రపంచ నీటి దినోత్సవం 2021 కోసం, దేశవ్యాప్తంగా రైతు కమ్యూనిటీలో 14,000 కంటే ఎక్కువ చేరుకుంటూ 18 రాష్ట్రాల వ్యాప్తంగా 400 కంటే ఎక్కువ రైతుల సమావేశాలను నిర్వహించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసి ఒక అవగాహనా ప్రచారోద్యమాన్ని ప్రారంభించింది. వ్యవసాయంలో నీటి సారధ్యబాధ్యతను ప్రోత్సహించుటలో సహాయపడటానికి, 4,000 కంటే ఎక్కువ మంది ఎఫ్ఎంసి టెక్నికల్ క్షేత్ర నిపుణులు వ్యవసాయ సుస్థిరత్వాన్ని పెంపొందించడానికి గాను ఉత్తమ వ్యవసాయ పద్ధతుల గురించి మాట్లాడారు మరియు నీటి వాడకాన్ని అనుకూలీకృతం చేయడానికి, నీటి సామర్థ్యాన్ని పెంచడానికి మరియు సంరక్షించడానికి వివిధ పద్ధతులను తెలియజేశారు.
సురక్షితమైన నీటి కార్యక్రమంతో పాటుగా, భారతదేశంలోని రైతులకు అనుకూలీకృత పరిష్కారాలను అందించే స్థానికీకృత పరిశోధన మరియు అభివృద్ధి ప్రయత్నాల ద్వారా అభివృద్ధి చేయబడిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో రైతులకు మద్దతు ఇస్తున్న ప్రముఖ పంట రక్షణ కంపెనీలలో ఒకటి అయిన ఎఫ్ఎంసి, వ్యవసాయ కమ్యూనిటీ యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి మరియు సుస్థిరత్వాన్ని మెరుగుపరచడానికి ఇతర ప్రాజెక్టులపై కూడా చురుకుగా పని చేస్తోంది. కేవలం స్వచ్ఛమైన నీరు మరియు పరిశుభ్రత అనే ఐక్యరాజ్య సమితి యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యానికి తోడ్పడటంపై దృష్టి సారించడం మాత్రమే కాకుండా, ఆకలి లేకుండా చేయడంపై కూడా సంస్థ దృష్టి సారించింది.
ఎఫ్ఎంసి యొక్క ప్రధాన విలువలలో ఒకటైన సుస్థిరత్వం, రైతులు ఒక క్షేమకరమైన మరియు సురక్షితమైన ఆహార సరఫరాను నిర్వహించేలా మద్దతు ఇవ్వడానికై కంపెనీ అంకితభావంతో పని చేస్తుంది. వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించే మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతుల జీవితాలు మరియు జీవనోపాధులను సమృద్ధపరచే పరిష్కారాలు మరియు పరిజ్ఞానాన్ని అందించడానికి మా బృందాలు రోజులో ఇరవై నాలుగు గంటలూ పనిచేస్తాయి.
సురక్షితమైన నీరు, మంచి వ్యవసాయ పద్ధతులు, పంట రక్షణ ఉత్పత్తుల యొక్క సహేతుకమైన వినియోగము మరియు గ్రామీణ అభివృద్ధిపై దృష్టి సారిస్తూ గత సంవత్సరం చెరకు రైతుల కోసం ఒక ప్రయోగాత్మక ప్రాజెక్టులో డిసిఎం శ్రీరామ్ గ్రూప్‌తో ఎఫ్ఎంసి భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. 2020 సంవత్సరంలో మంచి వ్యవసాయ పద్ధతులపై అసంఖ్యాకమైన అవగాహన మరియు శిక్షణ శిబిరాల ద్వారా 3.2 మిలియన్ మంది రైతులను చేరుకోవడం జరిగింది.
(కథనం మూలం: https://indiacsr.in/csr-ఎఫ్ఎంసిs-samarth-promotes-water-stewardship-and-sustainable-agriculture-in-india/)