భారతదేశంలో వ్యవసాయంలో ప్రతిభను ఆకర్షించడానికి మరియు అభివృద్ధి చేయడానికి ఎఫ్ఎంసి ఇండియా కట్టుబడి ఉంది మరియు ఈ దిశలో, ఎఫ్ఎంసి సైన్స్ లీడర్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ను పరిచయం చేయడం పట్ల మేము సంతోషిస్తున్నాము.
వ్యవసాయ రంగంలో నూతన ప్రతిభ ఆవశ్యకత ఉంది. దురదృష్టవశాత్తు, ఇతర రంగాలు మరింత ఆకర్షణీయమైనవిగా గుర్తించబడుతున్నాయి, దేశంలోని యువత తమ కెరీర్‌ని నిర్మించుకోవడానికి వ్యవసాయ శాస్త్రాన్ని ఎంచుకోవడం లేదు. మరోవైపు, వ్యవసాయ సుస్థిరతను నిర్ధారించడానికి గాను, వ్యవస్థలో సామర్థ్య పెంపుదల అవసరం. ఎఫ్ఎంసి సైన్స్ లీడర్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్, వ్యవసాయ రంగంలో స్థితిస్థాపకతను పెంచడానికి గాను వ్యవసాయ శాస్త్రాల పరిశోధన మరియు అభివృద్ధి అంశాలలో సామర్థ్య పెంపుదలకు తోడ్పాటు ఇవ్వడం లక్ష్యంగా చేసుకుంది.
ఎఫ్ఎంసి యొక్క కార్యక్రమం వ్యవసాయ పరిశోధన వ్యవస్థ లోపున ప్రతిభను వికసింపజేయడానికి మద్దతు ఇస్తుంది. వ్యవసాయ శాస్త్రాలలో ఉన్నత చదువులను అభ్యసించాలని కోరుకునే అర్హత కలిగిన విద్యార్థులకు ఈ కార్యక్రమం ఒక సంపూర్ణ మాస్టర్స్ లేదా పిహెచ్‌డి కార్యక్రమ డిగ్రీని గుర్తించి ఆర్థిక సహాయం చేస్తుంది. అవసరమైన పారిశ్రామిక అవగాహన మరియు మెంటర్‌షిప్ అందించడం ద్వారా ఎఫ్ఎంసి ఎంపిక చేయబడిన అభ్యర్థులకు కూడా తర్ఫీదును అందిస్తుంది, తద్వారా వారు తమ డిగ్రీ కార్యక్రమాలను పూర్తి చేసిన మీదట ఉన్నత స్థాయిలో దోహదపడగలుగుతారు.
మద్దతు ఇవ్వబడిన అభ్యర్థులు గనక కావాలనుకుంటే, భవిష్యత్తులో ఎఫ్ఎంసి వద్ద ప్రారంభించబడే అవసరమైన స్థానాలకు గాను ఎఫ్ఎంసి లో ఖాళీల భర్తీలో వారికి ప్రాధాన్యత కూడా ఇవ్వబడుతుంది. వ్యవసాయ కార్యక్రమాలలో మహిళలకు మద్దతు ఇవ్వడానికి గాను మహిళా అభ్యర్థులకు ఈ ప్రోగ్రాం 50% సీట్లు సైతమూ కేటాయిస్తుంది.