రైతు సమాజానికి సేవ అందించడానికి మరియు భారతదేశంలో సుస్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఎఫ్ఎంసి ఇండియా నిరంతరం తనని కొత్తగా ఆవిష్కరించుకుంటుంది. 2018 యొక్క ద్వితీయార్ధములో భారతదేశంలో మొక్క జొన్న పంటలపై దాడి చేసిన కత్తెర పురుగు (ఎఫ్ఎడబ్ల్యూ) యొక్క తాకిడి ముప్పును పరిష్కరించడానికి గాను, ఎఫ్ఎంసి, ఇండియాలోని ఒక సైన్స్ అడ్వొకసీ సలహా సంస్థ అయిన దక్షిణ ఆసియా బయోటెక్ కన్సార్టియం (ఎస్ఎబిసి) తో ఒడంబడికను కుదుర్చుకొంది. ఈ ప్రాజెక్ట్ ఈ క్రింది ఉద్దేశ్యాలతో ఎఫ్ఎంసి ప్రాజెక్ట్ సఫల్ (కత్తెర పురుగు నుండి వ్యవసాయం మరియు రైతులను రక్షించుట) గా పేర్కొనబడింది:
- ప్రతిష్టాత్మకమైన దేశీయ మరియు అంతర్జాతీయ వనరుల నుండి శాస్త్రీయ డేటా మరియు అనుభవం మరియు పరిశీలించదగిన నివేదికల ఆధారంగా కత్తెర పురుగు పై ఒక విజ్ఞాన వనరును అభివృద్ధి చేయడం
- ఐపిఎం పద్ధతులను ప్రదర్శించడానికి గాను సంబంధిత కెవికెల సమన్వయ సహకారంతో వ్యవసాయ ప్రదర్శనా క్షేత్రాలను ఏర్పాటు చేయుట
- సమాచారాన్ని విస్తరింపజేయడానికి గాను నెట్‌వర్క్ మరియు సంస్థల రిపోజిటరీతో ఎఫ్ఎడబ్ల్యు పై ప్రత్యేక వెబ్-ఆధారిత పోర్టల్
- సామర్థ్య పెంపుదల మరియు నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం
ఈ ప్రాజెక్ట్ ఎఫ్ఎంసి ఏషియా పసిఫిక్ రీజియన్ ప్రెసిడెంట్ శ్రీమతి బెత్‌వైన్ టోడ్, ఎఫ్ఎంసి ఇండియా ప్రెసిడెంట్ శ్రీ ప్రమోద్ మరియు ఎఫ్ఎంసి ఇండియా లీడర్‌షిప్ టీమ్ యొక్క సభ్యుల ద్వారా ప్రారంభించబడింది. ప్రాజెక్ట్ సఫల్ ఒక కేస్ స్టడీగా తయారయింది. అంతర్జాతీయ సస్య రక్షణ సదస్సు, ఏషియన్ సీడ్ కాంగ్రెస్, ఎఫ్ఎడబ్ల్యు కాన్ఫరెన్స్ ఇండోనేషియా మొదలైనటువంటి వివిధ అంతర్జాతీయ మరియు స్థానిక వేదికలలో ఇది ఒక ఆదర్శవంతమైన అట్టడుగు స్థాయి నుండి చేపట్టదగిన విస్తరణ ప్రాజెక్టుగా ఎన్నో ప్రశంసలు మరియు గుర్తింపును పొందినది.
గడచిన 18 నెలల పాటుగా పనిచేస్తున్న ప్రాజెక్ట్ సఫల్ ఇప్పుడు రైతులు మరియు ప్రభుత్వ అధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కెవికె, ఎన్జిఓలు మొదలైన ఇతర భాగస్వాములు అందరి వద్ద ఎఫ్ఎడబ్ల్యు పై అద్భుతమైన అవగాహనకు దారితీసింది. ఈ భయానకమైన పురుగును నియంత్రించడానికి ఇది మంచి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది మరియు అవగాహన మరియు సామర్థ్య పెంపుదల ద్వారా దేశం ఈ పురుగును సమర్థవంతంగా మరియు సకాలములో ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.
www.fallarmyworm.org.in క్రింద అభివృద్ధి చేయబడిన ఎఫ్ఏడబ్ల్యూ వెబ్‌సైట్ ఈ పురుగు పై భారతదేశంలో జరుగుతున్న అన్ని పరిశోధనలకు ప్రామాణికం మరియు సూచికగా మారింది. అవగాహన కల్పించడానికి గాను తయారు చేయబడిన పోస్టర్లు, కరపత్రాలు, బొమ్మలు మొదలైనటువంటి ప్రోత్సాహక సామాగ్రి, మొక్క జొన్నను పండిస్తున్న రాష్ట్రాలలోని వ్యవసాయ శాఖలు మరియు విశ్వవిద్యాలయాల ద్వారా విస్తృతంగా ఉపయోగించబడ్డాయి.
అద్భుతమైన ఫలితాలను అందించడానికి గాను, కార్పొరేట్ వ్యవహారాలు, రెగ్యులేటరీ, పరిశోధన మరియు అభివృద్ధి మరియు వాణిజ్య బృందాలతో సన్నిహితంగా పనిచేస్తూ టీమ్ వర్క్ ద్వారా ప్రాజెక్ట్ సఫల్ శ్రేష్టతలో ఎఫ్ఎంసి సంస్కృతిని ఉదాహరణగా చూపించింది. ప్రాజెక్ట్ యొక్క వార్షిక నివేదిక ఇటీవల న్యూఢిల్లీలో ఆవిష్కరించబడింది.
ఈ ప్రతిష్టాత్మక విజ్ఞాన నాయకత్వ కార్యక్రమాన్ని ప్రారంభించి 2 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి అయ్యాయి మరియు ఇప్పటికే సఫల్ బృందం ఎవరూ సాధించని విజయాలను అందుకుంది.
“మా విస్తృత ప్రపంచ జ్ఞానం మరియు సుస్థిరమైన పరిష్కారాల ద్వారా భారతదేశ రైతులకు సేవలు అందించడానికి మేము ఈ అవకాశాన్ని కలిగి ఉన్నందుకు సంతోషిస్తున్నాము", అని మా ముంబై ప్రధాన కార్యాలయం నుండి మే 2019 లో ప్రాజెక్టును ప్రారంభిస్తున్న సందర్భంగా బెత్‌వైన్ అన్నారు.
“ప్రాజెక్ట్ సఫల్ అనేది, భారతీయ రైతులు తమ పంటలను కత్తెర పురుగు వంటి భయంకరమైన పురుగుల నుండి రక్షించడానికి ఎఫ్ఎంసి చూపిన చొరవలలో ఒకటి, అది రైతుల ఆదాయం పెంపొందడానికి మరియు వ్యవసాయ సుస్థిరతకు దారితీస్తుంది. ప్రాజెక్ట్ సఫల్ తో ఈ కృషిలో ఎస్ఎబిసి ని భాగస్వామ్యం చేయడం పట్ల మేము గర్వపడుతున్నాము." - అన్నారు ఎఫ్ఎంసి ఇండియా ప్రెసిడెంట్, ఎజిఎస్ బిజినెస్ డైరెక్టర్ శ్రీ ప్రమోద్ తోటా గారు.
“లోతట్టు ప్రాంతాలలోని వ్యవసాయ విస్తరణ వ్యవస్థలో మేము చెప్పుకోదగిన విప్లవాన్ని సాధించగలిగాము. భారతదేశంలో సామాజిక-ఆర్థిక, ఆహార మరియు దాణా భద్రతకు అడ్డంకిని నివారించడంలో సహాయపడటానికి మేము ఐసిఎఆర్ సంస్థలు, కెవికెలు, ఎస్ఎయు లు మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖలు మరియు స్వచ్ఛంద సంస్థలతో సహా వివిధ ఏజెన్సీలను విజయవంతంగా ఒక్క తాటి పైకి తీసుకురాగలిగాము", - డాక్టర్ సి డి మాయీ, అధ్యక్షుడు, దక్షిణ ఆసియా బయోటెక్నాలజీ సెంటర్.
“ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ, రెగ్యులేటరీ, పరిశోధనా మరియు అభివృద్ధి మరియు వాణిజ్య బృందాలతో సహా ఎఫ్ఎంసి బృందం యొక్క ఉత్తమ ప్రయత్నం వలన ప్రాజెక్ట్ విజయవంతం అయింది. ఎపిఎసి స్థాయిలో ప్రాజెక్ట్‌కి లభించిన అంతర్గత గుర్తింపు చాలా సంతృప్తికరంగా ఉంది" - రాజు కపూర్, హెడ్-పబ్లిక్ మరియు పారిశ్రామిక వ్యవహారాలు.
మట్టి ఆరోగ్యం
సురక్షితమైన ఆహారం మరియు సుస్థిరమైన వ్యవసాయానికి దారి తీసే విధంగా తమ పంట దిగుబడులను పెంచుకోవడానికి సహాయపడటంలో రైతులకు మద్దతు ఇవ్వడానికి ఎఫ్ఎంసి ఇండియా కట్టుబడి ఉంది. నేల ఆరోగ్యాన్ని నిలిపి ఉంచడం, ఒక సుస్థిరమైన పద్ధతిలో వ్యవసాయ సాగు వనరులను ఉపయోగించడం మరియు వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మరియు సురక్షితంగా చేయడం లక్ష్యంగా మంచి వ్యవసాయ పద్ధతుల కూర్పు ద్వారా భారతదేశ వ్యాప్తంగా ఎఫ్ఎంసి క్షేత్ర నిపుణులు రైతులకు శిక్షణ ఇస్తారు.
వివిధ పంటలు మరియు భౌగోళిక ప్రాంతాల వ్యాప్తంగా ప్రతి సంవత్సరం మిలియన్ల కొద్దీ రైతులకు ఎఫ్ఎంసి క్షేత్ర బృందాలు శిక్షణ ఇస్తాయి. ఈ క్రింది సాధనాలను ఉపయోగించి ఒక వ్యవస్థీకృత కార్యక్రమం ద్వారా ఇది చేయబడుతుంది:
- రైతుల అవగాహన శిబిరాలు
- రైతు శిక్షణ శిబిరాలు
- క్లాస్‍రూమ్ ట్రైనింగ్
- పొలంలో శిక్షణ
- పొలం ప్రదర్శనలు
- పంటకోత రోజులను ఏర్పాటు చేయుట
- ఆన్‌లైన్ రైతుల శిక్షణ సెషన్లు మొదలైనవి.
ప్రపంచ మట్టి ఆరోగ్య రోజు 2020 థీమ్ 'మట్టిని జీవించి, మట్టి బయోడైవర్సిటీని రక్షించండి'’. ఈ రోజు, డిసెంబర్ 5 నాడు, ఎఫ్ఎంసి ఇండియా, విజయవంతమగు సేద్యం కోసం నేల ఆరోగ్యం యొక్క కీలక ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడానికి దృష్టి సారించిన ఒక మొట్టమొదటి ప్రచారోద్యమం అయిన యుజిఎఎం (ఉగమ్) ను ప్రారంభించింది. నేల యాజమాన్యము, నేల జీవవైవిధ్య నష్టము మరియు క్షీణించిపోతున్న నేల పోషకపదార్థాల నిర్వహణలో పెరుగుతున్న సవాళ్లను పరిష్కరించడం ద్వారా ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలు మరియు మానవ శ్రేయస్సును నిర్వహించే ప్రాముఖ్యత గురించి అవగాహనను పెంపొందించడాన్ని ఉగమ్ లక్ష్యంగా చేసుకుంది.
పంట ఆరోగ్యం మరియు ఉత్పత్తి యొక్క నాణ్యతను నిర్ణయించడంలో నేల ఆరోగ్యం ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. నేల ఆరోగ్య సమస్యలు మరియు సంబంధిత వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి తదుపరి రెండు దశాబ్దాలలో వ్యవసాయ పద్ధతులలో గణనీయమైన మార్పులు జరగాలని మేము నమ్ముతున్నాము. ఐక్యరాజ్య సమితి, ఎఫ్ఎఓ మరియు యుఎన్డిపి తో సహా ప్రపంచంలోని ప్రముఖ సంస్థలు నేల ఆరోగ్యం మరియు వ్యవసాయానికి సంబంధించిన అంశాల్లో అనేక చొరవలు తీసుకుంటున్నాయి. మా అంతర్జాతీయ సుస్థిరత ఇతివృత్తం 'బాగా పండించండి' యొక్క ఒక స్ఫూర్తి అయిన ఉగమ్‌తో, ఈ ప్రపంచ ఉద్యమాలకు వినయపూర్వక మద్దతు ఇవ్వడమే మా ప్రయత్నంగా ఉంది.
డిసెంబర్ 5న, వివిధ కమ్యూనికేషన్ మరియు విద్యా సాధనాలతో అనుకూలీకృతం చేయబడిన ఒక నేల ఆరోగ్య వ్యాన్ మరియు భూసార పరీక్షా కిట్లు సదరు ఉద్దేశ్యముతో మన దేశం యొక్క మారుమూల ప్రాంతాలకు ప్రయాణించడానికి తరలి వెళ్ళాయి. ఈ వ్యాన్ గుజరాత్ రాష్ట్రంలో తన ప్రయాణం ప్రారంభమైంది మరియు కంపెనీ నాయకులచే వర్చ్యువల్‌గా ప్రారంభించబడింది. నేల ఆరోగ్యం మరియు పోషకాల గురించి సమాచారాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి ఇతర కార్యకలాపాల ద్వారా కూడా మా క్షేత్రస్థాయి బృందాలు వేలాది మంది రైతులు, పంపిణీదారులు, రిటైలర్లు మరియు ఇతర భాగస్వాములను చేరుకున్నారు.