ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

ఆసియాలో, మరీ ప్రత్యేకించి భారతదేశంలో, వ్యవసాయంలో మహిళలు ఒక బలీయమైన చోదకశక్తిగా ఉన్నారు. గ్రామీణ భారతదేశంలో, తమ జీవనోపాధి కోసం వ్యవసాయం పై ఆధారపడి ఉన్న మహిళల శాతం 84% వరకు ఉంది. మహిళలు రైతులుగా సుమారు 33% మరియు వ్యవసాయ కూలీలుగా దాదాపుగా 47% శాతం ఉంటున్నారు (దేశంలోని ఆహారోత్పత్తి రంగాల్లో పశుసంపద, మత్స్య పరిశ్రమ మరియు వివిధ ఇతర అనుబంధ రూపాలలో ఉన్నవారిని మినహాయించి). 2009 లో, పంటల సాగులో నిమగ్నమైన మహిళా వ్యవసాయ కూలీలలో 94% మంది తృణధాన్యాల ఉత్పత్తిలో ఉన్నారు.

కూలీల సంఖ్యలో వారు ఆధిపత్యం కలిగి ఉన్నప్పటికీ, భారతదేశంలోని మహిళలు వేతనాల చెల్లింపు, భూమి హక్కులు మరియు స్థానిక రైతు సంస్థలలో ప్రాతినిధ్యము విషయాలలో ఇప్పటికీ వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా, సాధికారత లోపించడం వలన వారి పిల్లలలో విద్యాభ్యాసం తక్కువగా ఉంటుంది మరియు కుటుంబ ఆరోగ్య పరిస్థితి కూడా దయనీయ స్థితిలో ఉంటుంది.

పై విషయాలను దృష్టిలో ఉంచుకొని, భారతదేశంలో వ్యవసాయ రంగం లోని మహిళలలో సామర్థ్యాన్ని పెంపొందించడానికి మరియు వారి స్వంత కాళ్ళపై వారు నిలబడి జాతి నిర్మాణంలో దోహదపడటానికి గాను ఎఫ్ఎంసి ఒక కార్యక్రమం రూపొందిస్తుంది.