ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

ఎఫ్ఎంసి భారతదేశంలో జాతీయ భద్రతా కౌన్సిల్ అవార్డును అందుకుంది

పనోలి, 24 మార్చి 2023: ఒక ప్రముఖ వ్యవసాయ శాస్త్రాల కంపెనీ అయిన ఎఫ్ఎంసి కార్పొరేషన్ భారతదేశం యొక్క నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ (ఎన్ఎస్‌సి) నుండి పనోలి తయారీ ప్లాంట్ యొక్క అద్భుతమైన భద్రతా పనితీరు కోసం ఒక సిల్వర్ ట్రోఫీ అందుకుంది.



తయారీ రంగంలో అద్భుతమైన ఆక్యుపేషనల్ సేఫ్టీ మరియు హెల్త్ (ఒఎస్‌హెచ్) పనితీరు మరియు పని ప్రదేశంలో గాయాలను తగ్గించడానికి అచంచలమైన నిబద్ధత చూపిన సంస్థలను కౌన్సిల్ యొక్క సేఫ్టీ అవార్డ్స్ 2022 గుర్తించి గౌరవిస్తాయి. గత మూడు సంవత్సరాల భద్రతా పనితీరు, ఎన్ఎస్‌సి భద్రతా నిపుణుల ప్యానెల్ ద్వారా ఒక సంపూర్ణ ఆడిట్ మరియు పరిశోధనాత్మక ప్రక్రియతో సహా ఒక కఠినమైన మదింపు ప్రక్రియ తర్వాత విజేతలు ఎంపిక చేయబడతారు.

Image

ఎఫ్ఎంసి ఇండియా ప్రెసిడెంట్ అయిన శ్రీ రవి అన్నవరపు గారు ఈ విజయం గురించి మాట్లాడుతూ, "ఎఫ్ఎంసి వద్ద భద్రతకి మౌలికపరమైన ప్రాధాన్యతను ఇస్తాము. సంస్థలోని అన్ని స్థాయిలకు చెందినవారు నిమగ్నం అయ్యే విధంగా ఒక క్రియాశీలమైన భద్రతా సంస్కృతి ద్వారా మా కార్మికులకు రక్షణను అందిచడం మా లక్ష్యం. పనోలి ప్లాంట్‌లోని ప్రతి ఉద్యోగి సైట్‌లో పర్యావరణ, ఆరోగ్యం మరియు భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడానికి చేసిన కఠోర పరిశ్రమకు ఎన్‌ఎస్‌సి ద్వారా లభించిన గుర్తింపు గౌరవప్రదమైనది. వరుసగా 500 కంటే ఎక్కువ రోజులపాటు పనోలి తయారీ ప్లాంట్‌లో ఎవరికీ ఎటువంటి గాయాలు అవ్వలేదు అని మేము గర్వంగా ప్రకటిస్తున్నాము, మరియు భద్రత పట్ల మా నిబద్ధతను మేము కొనసాగిస్తాము మరియు మా ఉద్యోగుల కోసం ప్రతి రోజును ఒక సురక్షితమైన పని రోజుగా మారుస్తాము



దేశవ్యాప్తంగా తయారీ రంగంలో గుర్తింపు కోసం ఎఫ్ఎంసి 600 సంస్థల నుండి ఎంపిక చేయబడిన 18 సంస్థలలో ఒకటి. పనోలి సైట్ సిల్వర్ ట్రోఫీని సాధించడం ఇది తొలిసారి, గతంలో కౌన్సిల్ యొక్క సేఫ్టీ అవార్డులు 2021 మరియు 2019 లో సంస్థకి ప్రశంసా పత్రాలు లభించాయి. భద్రత, ఆరోగ్యం మరియు పర్యావరణం పై ఎన్ఎస్‌సి యొక్క 13వ జాతీయ కాన్ఫెరెన్స్‌లో ఎఫ్ఎంసి తరఫున పనోలి తయారీ సైట్ యొక్క ప్లాంట్ మేనేజర్ శ్రీ మనోజ్ ఖన్నా అవార్డును అందుకున్నారు.

ఆరోగ్యం, భద్రత మరియు పర్యావరణం (హెచ్ఎస్ఇ)కు ప్రోత్సాహం అందించడానికి 1966 లో భారత ప్రభుత్వం యొక్క కార్మిక మంత్రిత్వ శాఖ ద్వారా ఎన్ఎస్‌సి ఏర్పాటు చేయబడింది, ఇది అనేక కార్యకలాపాలను నిర్వహిస్తుంది మరియు హెచ్ఎస్ఇ లో కొత్త సవాళ్లను పరిష్కరించడానికి సాంకేతిక నైపుణ్యం మరియు సామర్థ్యాలను పెంపొందించడానికి ఇది అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.



ఎఫ్ఎంసి పరిచయం

ఎఫ్‌ఎంసి అనేది ఒక ప్రపంచ స్థాయి వ్యవసాయ విజ్ఞాన సంస్థ. ఇది పెరుగుతున్న ప్రపంచ జనాభాకు సరిపడా ఆహార ధాన్యాలు, పంటలను మరియు ఇంధనాన్ని, మారుతున్న వాతావరణానికి అనుగుణంగా ఉత్పత్తి చేసే సాగుదారులకు సహాయం చేయడానికి కట్టుబడి ఉంది. ఎఫ్‌ఎంసి సంస్థ నుండి వినూత్నమైన పంట సంరక్షణ పరిష్కారాలు - జీవావరణ వ్యవస్థ, పంట పోషణ, డిజిటల్ మరియు ఖచ్చితమైన వ్యవసాయంతో సహా - సాగుదారులు, పంట సలహాదారులు మరియు టర్ఫ్, పెస్ట్ మేనేజ్‌మెంట్ నిపుణులు పర్యావరణాన్ని పరిరరక్షించడంలో వారికి ఎదురయ్యే ఆర్థికపరమైన సవాళ్లను పరిష్కరించుకోవడానికి వీలు కల్పిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 100 పైగా ప్రాంతాల్లో సుమారు 6,400 మంది ఉద్యోగులతో నిర్మితమై ఉన్న ఎఫ్‌ఎంసి సంస్థ, కొత్త హెర్బిసైడ్, క్రిమిసంహారకాలు మరియు శిలీంద్ర సంహారిణి క్రియాశీల పదార్థాలు, ఉత్పత్తి సూత్రీకరణలను మరియు మన గ్రహ పరిరక్షణ కోసం స్థిరంగా మెరుగ్గా ఉండే మార్గదర్శక సాంకేతికతలను కనుగొనడానికి కట్టుబడి ఉంటుంది. ఫేస్‌బుక్® మరియు యూట్యూబ్® పై ఎఫ్ఎంసి ఇండియా గురించి మరింత తెలుసుకోవడానికి మరియు అనుసరించడానికి fmc.com మరియు ag.fmc.com/in/en ను సందర్శించండి.