ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

భారతదేశంలోని రైతుల కోసం ఎఫ్ఎంసి డ్రోన్ స్ప్రే సేవలను ప్రవేశపెట్టింది

09 ఫిబ్రవరి, ముంబై

వ్యవసాయ విజ్ఞాన సంస్థ ఎఫ్ఎంసి కార్పొరేషన్, నేడు భారతదేశంలోని రైతుల కోసం డ్రోన్ స్ప్రే సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది.

భారతదేశంలో విమాన రవాణా సేవల నియంత్రణకు బాధ్యత వహించే ప్రభుత్వ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఆమోదించిన ఈ డ్రోన్ సేవ, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరుస్తుందని, అదే సమయంలో మానవీయ శ్రమ అవసరాన్ని తగ్గిస్తుందని సర్వత్రా భావిస్తున్నారు. ఏడు ప్రాంతీయ భాషలకు మద్దతు ఇచ్చే ఎఫ్ఎంసి ఇండియా రైతు యాప్ ద్వారా మీరు ఎఫ్ఎంసి డ్రోన్ స్ప్రే సేవలను పొందవచ్చు. ప్రస్తుతం ఈ సేవ ఆంధ్రప్రదేశ్‌లో అందుబాటులో ఉంది. ఈ నెల చివరి నాటికి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో అందుబాటులోకి రానుంది.

drone 1

ఎఫ్‌ఎంసి ఇండియా ప్రెసిడెంట్ శ్రీ రవి అన్నవరపు మాట్లాడుతూ, "వ్యవసాయ రంగంలో సాంకేతికత అభివృద్ధి చెందుతున్నందున, 2030 సంవత్సరం చివరి నాటికి దేశంలో మొత్తం వ్యవసాయ యంత్రాల ఖర్చులో డ్రోన్లు 2 శాతంగా ఉంటాయని అంచనా.. ఈ పైలట్ దశలో ఎఫ్ఎంసి, భారతీయ వ్యవసాయ కమ్యూనిటీ ప్రయోజనం కోసం డ్రోన్ అప్లికేషన్‌లో మా లోతైన ప్రపంచ జ్ఞానం మరియు నైపుణ్యాన్ని ఎఫ్ఎంసి ఉపయోగించుకుంటుంది. మేము మొదటి మూడు నెలల్లో ఎంపిక చేసిన రాష్ట్రాల్లోని భారతీయ రైతుల మధ్య మా పరిధిని పెంచాలని ప్లాన్ చేస్తున్నాము మరియు తదుపరి ఖరీఫ్ సీజన్ ప్రారంభమవడానికి ముందు దేశవ్యాప్తంగా రైతులకు సేవలను విస్తరించాలని మేము ప్లాన్ చేస్తున్నాము" అని తన అభిప్రాయం తెలిపారు

వ్యవసాయ మానవ రహిత వైమానిక వాహనాలు (యుఎవిలు) స్ప్రే యూనిఫార్మిటీ మరియు కవరేజీపై మరింత నియంత్రణను అందిస్తాయి, అలాగే ఎఫ్ఎంసి యొక్క ప్రీమియం మరియు రైతుల చేత విశ్వసించబడే బ్రాండ్‌లు కొరాజెన్® కీటక నాశిని మరియు బెనివియా® కీటక నాశిని వంటి పంట రక్షణ ఉత్పత్తులతో ఖచ్చితత్వాన్ని మెరుగుపరుస్తాయి. ప్రతి స్ప్రే డ్రోన్ 15-20 నిమిషాలలో 3-4 ఎకరములకు చికిత్సను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, పిచికారీ పనిని ఇది సులభంగా మరియు వేగంగా పూర్తి చేస్తుంది. యుఎవిలను ఉపయోగించడం వలన వడ దెబ్బ వంటి వాతావరణ ప్రమాదాల నుండి కూడా రైతులకు రక్షణ అందుతుంది.

drone2

శ్రీ అన్నవరపు గారు అదనంగా ఈ మాటలను కూడా జోడించారు, "మా ప్రయత్నాలు ఎల్లప్పుడూ రైతులకు వినూత్న పరిష్కారాలను అందించే దిశగా సాగుతాయి, తద్వారా వారు స్థిరమైన పద్ధతిలో దిగుబడిని పెంచుకోవచ్చు.. గ్రామీణ వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి డ్రోన్ టెక్నాలజీ, శిక్షణ మరియు నిధులకు ప్రాప్యతను అందజేస్తాము.. అదనంగా, సాంకేతికతతో వ్యవసాయాన్ని ఆధునీకరించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుంది, అదే సమయంలో డ్రోన్ కార్యకలాపాల వంటి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది, ఖచ్చితమైన వ్యవసాయాన్ని విస్తృతంగా చేపట్టేలా చేస్తుంది. భారతీయ వ్యవసాయం మార్పు అంచున ఉంది మరియు వ్యవసాయ పద్ధతులను మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని మేము నమ్ముతున్నాము. భారతీయ రైతు సమాజానికి సేవలందించే మార్గదర్శకుల్లో ఒకరిగా ఉన్నందుకు మేము గర్విస్తున్నాము.”

ఎఫ్ఎంసి రైతు యాప్‌ను ఐఒఎస్ యాప్ స్టోర్ మరియు ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ రెండింటి నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఎఫ్ఎంసి పరిచయం

ఎఫ్‌ఎంసి అనేది ఒక ప్రపంచ స్థాయి వ్యవసాయ విజ్ఞాన సంస్థ. ఇది పెరుగుతున్న ప్రపంచ జనాభాకు సరిపడా ఆహార ధాన్యాలు, పంటలను మరియు ఇంధనాన్ని, మారుతున్న వాతావరణానికి అనుగుణంగా ఉత్పత్తి చేసే సాగుదారులకు సహాయం చేయడానికి కట్టుబడి ఉంది. ఎఫ్‌ఎంసి సంస్థ నుండి వినూత్నమైన పంట సంరక్షణ పరిష్కారాలు - జీవావరణ వ్యవస్థ, పంట పోషణ, డిజిటల్ మరియు ఖచ్చితమైన వ్యవసాయంతో సహా - సాగుదారులు, పంట సలహాదారులు మరియు టర్ఫ్, పెస్ట్ మేనేజ్‌మెంట్ నిపుణులు పర్యావరణాన్ని పరిరరక్షించడంలో వారికి ఎదురయ్యే ఆర్థికపరమైన సవాళ్లను పరిష్కరించుకోవడానికి వీలు కల్పిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 100 పైగా ప్రాంతాల్లో సుమారు 6,400 మంది ఉద్యోగులతో నిర్మితమై ఉన్న ఎఫ్‌ఎంసి సంస్థ, కొత్త హెర్బిసైడ్, క్రిమిసంహారకాలు మరియు శిలీంద్ర సంహారిణి క్రియాశీల పదార్థాలు, ఉత్పత్తి సూత్రీకరణలను మరియు మన గ్రహ పరిరక్షణ కోసం స్థిరంగా మెరుగ్గా ఉండే మార్గదర్శక సాంకేతికతలను కనుగొనడానికి కట్టుబడి ఉంటుంది. ఫేస్‌బుక్® మరియు యూట్యూబ్® పై ఎఫ్ఎంసి ఇండియా గురించి మరింత తెలుసుకోవడానికి మరియు అనుసరించడానికి fmc.com మరియు ag.fmc.com/in/en ను సందర్శించండి.