ఎఫ్ఎంసి ఇండియా నేడు ఒక కొత్త పరిశోధన-ఆధారిత పురుగుమందుల కార్‌ప్రైమా™ ను ప్రవేశపెట్టింది. ఎఫ్ఎంసి కి చెందిన ప్రపంచంలోనే అగ్రశ్రేణి రైనాక్సిపైర్® పురుగు నియంత్రణ సాంకేతికత కలిగి ఉన్న కార్‌ప్రెమా™ భారతదేశానికి చెందిన రైతులకు తీవ్రమైన సమస్యగా ఉన్న కాయ తొలుచు పురుగులకు వ్యతిరేకంగా మెరుగైన పంట రక్షణను అందిస్తుంది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసెర్చ్ ప్రకారం, దేశవ్యాప్తంగా టమాటో రైతులు ప్రతి సంవత్సరం కాయ తొలుచు పురుగుల కారణంగా వారి దిగుబడులలో 65 శాతం వరకు నష్టపోతున్నారు. పంటకు ఈ పురుగు సోకడం వలన పువ్వు రాలిపోతుంది మరియు మొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది, వీటి కారణంగా పండు నాణ్యత క్షీణించి పంట దిగుబడి తగ్గుతుంది.
కంపెనీ యొక్క రిటైలర్లు మరియు స్థానిక భాగస్వాములతో పాటు ఎఫ్ఎంసి ఇండియా అధ్యక్షుడి రవి అన్నవరపు సమక్షంలో రాయ్‌పూర్‌లో కొత్త ఉత్పత్తి ఆవిష్కరించబడింది. ఉత్పత్తి ఆవిష్కరణ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు మరియు హాజరైనవారి కోసం నాలెడ్జ్ సెషన్ జరిగాయి.
రాయ్‌పూర్‌లో ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎఫ్ఎంసి ఇండియా ప్రెసిడెంట్ శ్రీ రవి అన్నవరపు గారు ఇలా అన్నారు, "గత సంవత్సరం దేశంలో ఒక రికార్డ్ హార్టికల్చరల్ పంట ఉత్పత్తిని చూసింది. అయితే, ప్రతి సంవత్సరం, టమాటో మరియు బెండ రైతులు కాయ తొలుచు పురుగులు, వ్యాధులు మరియు పంటకోత తరువాతి నష్టాలు మరియు ఇటువంటి ఇతర కారణాల వలన భారీ నష్టాలను పొందుతున్నారు. ఎఫ్ఎంసి వద్ద, సుస్థిరమైన ఉత్పత్తులు మరియు పరిష్కారాలను ప్రవేశపెట్టడం ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి మేము ఆవిష్కరణను ఉపయోగిస్తాము. రైతుల పంట రక్షణ అవసరాలను తీర్చేందుకు వినూత్న పరిష్కారాలను అందించడానికి ఎఫ్ఎంసి యొక్క నిబద్ధతకు కార్‌ప్రెమా™ ఆవిష్కరణ అనేది ఒక నిదర్శనం. టమాటో మరియు బెండ రైతులకు అధిక దిగుబడులు మరియు మెరుగైన నాణ్యత ద్వారా తమ ఆదాయాలను మెరుగుపరచడానికి కార్‌ప్రెమా™ సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను.”
సరికొత్త పురుగుమందు కార్‌ప్రెమా™ దీర్ఘ కాలం పాటు పురుగు నియంత్రణను అందించడం, అలాగే మెరుగైన పువ్వు మరియు కాయ నిలిచి ఉండడం ద్వారా రైతులకు పెట్టుబడిపై మెరుగైన రాబడులను అందిస్తుంది, ఇది ఉత్తమ నాణ్యత కలిగిన గొప్ప దిగుబడులను అందిస్తుంది. రైనాక్సిపైర్® యాక్టివ్ కలిగి ఉన్న కార్‌ప్రెమా™, కాయ తొలుచు పురుగుల నుండి ఒక ఉత్తమమైన మరియు దీర్ఘకాలం నిలిచి ఉండే రక్షణను అందిస్తుంది, ఇది రైతుల సమయం, ఖర్చులు మరియు పంటలను రక్షించడానికి కృషి చేసే ప్రయత్నాన్ని ఆదా చేస్తుంది.
ఈ నెల ప్రారంభంలో కార్‌ప్రెమా™ దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టబడింది, ఈ కార్యక్రమం ఒక వర్చ్యువల్‌గా ఐదు భాషలు - హిందీ, మరాఠీ, తమిళ్, తెలుగు మరియు కన్నడ లో ప్రసారం చేయబడింది మరియు దేశంలోని రైతులు, రిటైలర్లు మరియు డిస్ట్రిబ్యూటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఛత్తీస్‌ఘడ్‌లో ఆవిష్కరణ అనేది మహారాష్ట్ర మరియు కర్ణాటక సహా మూడు నగరాల్లో భారతదేశ వ్యాప్తంగా నిర్వహించబడిన కార్యక్రమంలో భాగం. ఈ ఆవిష్కరణకి అనేక ప్రాంతీయ మీడియా సంస్థల దృష్టిని ఆకర్షించింది.
6gm, 17gm మరియు 34gm ప్యాక్‌లలో ప్రవేశపెట్టబడిన, కార్‌ప్రెమా™ చిన్న, సన్నకారు మరియు పెద్ద రైతుల పంట రక్షణ అవసరాలను తీర్చుతుంది. కార్‌ప్రెమా™ ఇప్పుడు ప్రముఖ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంది.
మరింత సమాచారం కోసం, దయచేసి కార్‌ప్రెమా™ పురుగుమందు | ఎఫ్ఎంసి ఏజి ఇన్ ని సందర్శించండి