అగ్రగామి వ్యవసాయ శాస్త్రాల కంపెనీ అయిన ఎఫ్ఎంసి, ఇండియాలోని ఎనిమిది రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న ప్రధాన వ్యవసాయ పాఠశాలల కొరకు తన బహుళ-సంవత్సర స్కాలర్‌షిప్ ప్రోగ్రాము క్రింద ఈ రోజున హైదరాబాదులోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయము (పిజెటిఎస్ఎయు) తో ఒక అవగాహనా ఒప్పందము (ఎంఓయూ)ను కుదుర్చుకొంది. ఈ ఎంఓయూ పై ఎఫ్ఎంసి ఇండియా అధ్యక్షులు డా. రవి అన్నవరపు గారు మరియు పిజెటిఎస్ఎయు వైస్ ఛాన్సలర్ డా. ప్రవీణ్ రావు గారు సంతకాలు చేశారు.
ఒప్పందం క్రింద, వ్యవసాయ శాస్త్రాల్లో డాక్టరేట్లు మరియు మాస్టర్స్ డిగ్రీలు పొందాలని ఆశిస్తున్న విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఎఫ్ఎంసి వార్షికంగా రెండు స్కాలర్‌షిప్‌లను ప్రదానం చేస్తుంది. అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించడానికి మరియు శాస్త్ర మరియు పరిశోధన కోసం వారి పట్టుదలను అభివృద్ధి చేయడానికి గాను ఎఫ్ఎంసి విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేస్తుంది. వ్యవసాయ శాస్త్ర మరియు పరిశోధనలో తమ నైపుణ్యాలను వృద్ధి చేసుకోవాలనుకునే మహిళలను ప్రోత్సహించడానికి గాను యాభై శాతం స్కాలర్‌షిప్‌లు మహిళా అభ్యర్థుల కొరకు కేటాయించబడ్డాయి. స్కాలర్‌షిప్‌లకు అదనంగా, విశ్వవిద్యాలయంతో తన సమన్వయాత్మక పరిశోధన పనిని ఎఫ్ఎంసి పెంపొందించుకుంటుంది.
"వ్యవసాయ పరిశోధనలో యువ ప్రతిభను భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దడానికి ఎఫ్ఎంసి కృషి చేస్తోంది. మా ప్రతిభా వ్యూహంలో భాగంగా, ఎఫ్ఎంసి వద్ద అంతర్జాతీయ పరిశోధకుల యొక్క సమృద్ధమైన వైవిధ్యత ద్వారా ప్రోత్సహించబడిన స్థానిక శాస్త్రవేత్తల బలమైన మూలమును మేము దర్శిస్తున్నాము, వారు భారతదేశం, మరియు ప్రపంచం కోసం భారతదేశంలో సాంకేతిక నవ్యతలను ముందుకు తీసుకువెళతారు. విశ్వవిద్యాలయంతో మా భాగస్వామ్యం, ఆకాంక్షించేవారి సామర్థ్యాన్ని బహిర్గతం చేస్తుంది మరియు పరిశ్రమ నిపుణులు మరియు బోధకుల నుండి మార్గదర్శకత్వంతో విజయానికి బాటలు వేసుకోవడానికి వారికి సహాయపడుతుంది" అని ఎఫ్ఎంసి ఇండియా అధ్యక్షులు రవి అన్నవరపు గారు అన్నారు. "భారతదేశంలో పరిశోధన మరియు అభివృద్ధి పెట్టుబడులు గణనీయమైన వేగముతో పెరుగుతున్నాయి మరియు ఆవిష్కరణలు ప్రపంచ గుర్తింపును పొందుతున్నాయి. ఎఫ్ఎంసి సైన్స్ లీడర్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా, ఈ ఎదుగుదల మలుపు యొక్క ముందు భాగములో ఉండటానికి యువ ప్రతిభను సాధికారపరచడం మా లక్ష్యంగా ఉంది.”
భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ, డాక్టర్ వి ప్రవీణ్ రావ్, వైస్ ఛాన్సలర్, పిజెటిఎస్ఎయు ఇలా అన్నారు: "ప్రాపంచిక మరియు జాతీయ స్థాయిలో వ్యవసాయ సవాళ్లను ప్రస్తావించే సుస్థిరమైన సాంకేతికతల రంగంలో ఎఫ్ఎంసి చేపట్టిన వినూత్న కార్యక్రమాల పట్ల మేము అభినందనలు తెలియజేస్తున్నాము. సురక్షితమైన నీరు, మంచి ఆరోగ్యం, జిఎపి, వ్యవసాయంలో మహిళలను సాధికారత చేయడం మరియు యువతలో శాస్త్ర పరిజ్ఞానమును ప్రోత్సహించడం వంటి ప్రాజెక్ట్ సఫల్ మరియు ప్రాజెక్ట్ సమర్థ్ యొక్క అనేక కార్యక్రమాల ద్వారా గ్రామీణ భారతదేశంలో చేపట్టబడిన అవుట్‌రీచ్ కార్యకలాపాలు ఎఫ్ఎంసి చేసిన గణనీయమైన ప్రయత్నాలు." సైన్స్ లీడర్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రశంసిస్తూ, డాక్టర్ రావ్ గారు ఇలా జోడించారు "వ్యవసాయ రంగానికి విలువను జోడించడానికి ఆకాంక్షించే యువ భారతీయ ప్రతిభకు మా భాగస్వామ్యం అవసరమైన తోడ్పాటును అందించడానికి మరియు ప్రస్తుత మరియు భవిష్యత్తు ప్రతిభ అవసరాల కోసం ఒక సంభావ్య ప్రతిభా మార్గమును నిర్మించడానికి ఎఫ్ఎంసి తో మా భాగస్వామ్యం సహాయపడుతుంది. ప్రశస్తమైన వ్యవసాయం, అగ్రిటెక్ వెంచర్ క్యాపిటల్, సుస్థిరమైన కీటక యాజమాన్య పరిష్కారాలు మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిజెటిఎస్ఎయు యొక్క దత్తత గ్రామాల్లో అవలంబించబడిన రైతు కనెక్ట్ కార్యక్రమం వంటి ఉమ్మడి లక్ష్యాలపై పనిచేయడానికై ఎఫ్ఎంసి తో సమన్వయం చేసుకోవడానికి పిజెటిఎస్ఎయు ఎదురుచూస్తోంది.”
వ్యవసాయ పరిశ్రమలోని అత్యంత ఘనమైన ఆవిష్కరణ మరియు అభివృద్ధి మార్గాలలో ఒకదానికి మార్గనిర్దేశం చేయడానికి 800 కంటే ఎక్కువ మంది శాస్త్రవేత్తలు మరియు సహాయకులు కలిగియున్న ప్రపంచ స్థాయి పరిశోధన మరియు అభివృద్ధి సంస్థతో, వ్యవసాయ పర్యావరణ వ్యవస్థ లోపున ఎఫ్ఎంసి, శాస్త్రీయ సమాజం మరియు విద్యావేత్తలలో సహకారాన్ని బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నట్లుగా చెబుతోంది. ఎఫ్ఎంసి ఇటీవలనే పంత్ నగర్ మరియు ఉత్తరాఖండ్ లోని వ్యవసాయ మరియు టెక్నాలజీ యొక్క జిబి పంత్ విశ్వవిద్యాలయము మరియు గుంటూరులోని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయముతో అటువంటి అవగాహనా ఒప్పందాలనే కుదుర్చుకుంది.
ఎఫ్ఎంసి యొక్క బహుళ-సంవత్సర స్కాలర్‌షిప్ ప్రోగ్రాము, ఇండియా వ్యాప్తంగా ఎనిమిది విశ్వవిద్యాలయాలలో 10 పిహెచ్‌డి (ఎజి) మరియు 10 ఎం.ఎస్.సి (ఎజి) స్కాలర్‌షిప్‌లను అగ్రానమీ, ఎంటమాలజీ, పెథాలజీ, సాయిల్ సైన్స్ మరియు హార్టికల్చర్ వంటి బోధనాంశాలలో మద్దతు ఇవ్వడానికి ప్రతిన బూనింది. ఉపకార వేతనాల కార్యక్రమం క్రింద, కంపెనీలో పూర్తి స్థాయి ఉపాధి అవకాశాలలో ప్రాధాన్యతను పొందడానికి అదనంగా, అవార్డు పొందిన వారికి వారి సమగ్ర అభివృద్ధి కోసం ఇంటర్న్‌షిప్ మరియు పరిశ్రమ మెంటర్‌షిప్ కూడా అందించబడుతుంది.