ఒక ప్రముఖ వ్యవసాయ పరిశోధన సంస్థ అయిన ఎఫ్ఎంసి కార్పొరేషన్ కి గుర్తింపు సర్టిఫికెట్ భారతదేశంలో నీటి యాజమాన్యంలో అత్యుత్తమ సహకారానికి గాను ప్రపంచ నీటి దినోత్సవం-2022 నాడు టిఇఆర్ఐ-ఐడబ్ల్యూఎ-యుఎన్‌డిపి నీటి సుస్థిరత అవార్డులు 2021-22 లో సర్టిఫికేట్ ఆఫ్ రికగ్నిషన్ అందజేయబడింది. ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇంటర్నేషనల్ వాటర్ అసోసియేషన్ మరియు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా అవార్డ్స్ ప్రోగ్రాం సంయుక్తంగా నిర్వహించబడింది.
భారతదేశంలో 2024 నాటికి 200,000 మంది రైతు కుటుంబాలకు సురక్షితమైన మరియు త్రాగునీటిని అందించాలని కోరుతూ ఎఫ్ఎంసి తన ప్రధాన ప్రాజెక్ట్ సమర్థ్ కింద ఒక ప్రస్తుత ప్రచారాన్ని నిర్వహిస్తుంది. ప్రాజెక్ట్ సమర్థ్ ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్, పంజాబ్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 57 కమ్యూనిటీ వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్‌లను ప్రారంభించింది, దాదాపు 100,000 వ్యవసాయ కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చింది. 2022 లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు గుజరాత్ సహా మరిన్ని రాష్ట్రాలను కవర్ చేయడానికి కంపెనీ ఇప్పుడు ఈ కార్యక్రమం యొక్క ఫరిదిని విస్తరిస్తోంది.
""సుస్థిరత దిశగా మనం చేస్తున్న కృషికి గుర్తింపు లభించడం ఒక గౌరవం" అని ఎఫ్ఎంసి ఇండియా అధ్యక్షుడు శ్రీ రవి అన్నవరపు గారు తన ఆనందం వ్యక్తం చేసారు, అంతేకాక, "ప్రాజెక్ట్ సమర్థ్ లాంటి వివిధ కార్యక్రమాలు మరియు సంఘ సేవా కార్యక్రమాల ద్వారా రైతు సమాజానికి సాధికారత కల్పించడం, వారి జీవన ప్రమాణాలను పెంచడం మా లక్ష్యం.. 4,000 కంటే ఎక్కువ ఎఫ్ఎంసి సాంకేతిక రంగ నిపుణులు మంచి వ్యవసాయ పద్ధతులు మరియు నీటి వినియోగాన్ని ఆప్టిమైజ్ చేస్తూ ఉత్పాదకతను పెంచడానికి నీటి స్థిరమైన వినియోగం గురించి రైతులతో చర్చిస్తారు. నీటి వినియోగంలో ఉత్తమ పద్ధతుల గురించి సమాజానికి ఎక్కువగా అవగాహన కల్పించడానికి మేము ప్రయత్నిస్తున్నాము, మరియు మేము టిఇఆర్‌ఐ-ఐడబ్ల్యూఎ -యుఎన్‌డిపి ద్వారా ఈ గుర్తింపుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. నీటి సారథ్యం అనే మా లక్ష్యంలో ముందుకు సాగడానికి ఇది మమ్మల్ని ప్రోత్సహిస్తుంది.”
నీటి శుద్దీకరణ ప్లాంట్లను ప్రారంభించడమే కాకుండా, ఎఫ్ఎంసి దాని సాంకేతిక నిపుణులు మరియు ఛానెల్ భాగస్వాముల విస్తృత నెట్‌వర్క్ ద్వారా వ్యవసాయంలో నీటి యొక్క స్థిరమైన వినియోగాన్ని కూడా ప్రోత్సహిస్తుంది.
ముఖ్య అతిథిగా విచ్చేసిన లోక్‌పాల్ యొక్క భారతదేశ కార్యదర్శి, జల్ జీవన్ మిషన్ యొక్క మాజీ అదనపు కార్యదర్శి అయిన శ్రీ భరత్ లాల్, మరియు శ్రీమతి శోకో నోడా సమక్షంలో ఎఫ్ఎంసి ఇండియా ప్రభుత్వ మరియు పరిశ్రమ వ్యవహారాల డైరెక్టర్ అయిన మిస్టర్ రాజు కపూర్ అవార్డును స్వీకరించారు, భారతదేశంలో యుఎన్‌డిపి నివాస ప్రతినిధి.
'వాటర్ న్యూట్రాలిటీ' విధానాన్ని అవలంబించడం ద్వారా వివిధ వాటాదారుల నీటి వినియోగాన్ని తగ్గించడం ద్వారా యుఎన్ స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధించడాన్ని ప్రోత్సహించడం టిఇఆర్ఐ-ఐడబ్ల్యుఎ-యుఎన్‌డిపి నీటి సుస్థిరత అవార్డుల లక్ష్యం. నీటి రంగంలో అనేక విభాగాలు మరియు డొమైన్లలో ఈ అవార్డులు అందించబడతాయి మరియు ఈ స్థానిక ఉద్యమాన్ని మార్పు దిశగా, ప్రభావవంతంగా మరియు వినూత్న మార్గంలో ముందుకు తీసుకువెళుతున్న వ్యక్తులు, సివిల్ సొసైటీ సంస్థలు, పరిశ్రమలు, మునిసిపల్ బోర్డులు, గ్రామ పంచాయితీలు మరియు ఆర్‌డబ్ల్యుఎల వంటి వివిధ భాగస్వాములను గుర్తించి ప్రోత్సహించడమే వీటి లక్ష్యం.