ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

ఉత్తమ బ్రాండ్ల సదస్సు-2023లో ఎఫ్ఎంసి పరిశ్రమకు చెందిన రైనాక్సిపైర్®️యాక్టివ్ కీటక నియంత్రణ సాంకేతికతకు ప్రత్యేక గుర్తింపు లభించింది

ముంబై, 21 డిసెంబర్ 2023: వ్యవసాయ విజ్ఞాన సంస్థ ఎఫ్‌ఎంసి ఇండియా ఆధ్వర్యంలో రూపొందించిన కీటక నియంత్రణ సాంకేతికత రైనాక్సిపైర్® యాక్టివ్‌, బెస్ట్ బ్రాండ్స్ కాంక్లేవ్ 2023లోని వ్యవసాయ విభాగంలో ఉత్తమ బ్రాండ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. భారతదేశపు ప్రముఖ మీడియా సంస్థ ది టైమ్స్ గ్రూప్‌ ఆధ్వర్యంలో ది ఎకనామిక్ టైమ్స్ (ఇటి) ఎడ్జ్ నిర్వహించిన ఈ సమావేశంలో, ఎఫ్ఎంసి రూపొందించిన రైనాక్సిపైర్®️ యాక్టివ్, భారతదేశ వ్యవసాయ రంగంపై చూపిన విశేష ప్రభావానికి గాను ప్రత్యేక గుర్తింపును అందుకుంది.

ET Edge

రైనాక్సిపైర్® యాక్టివ్ పురుగుమందు కత్తెర పురుగులు, దాసరి పురుగులు, వెండి ఆకు తెగుళ్ళు, తెల్లదోమ గుడ్లు, ఆకు తొలుచు పురుగు లార్వా మరియు మరిన్ని పురుగుల విస్తృత శ్రేణి నియంత్రణను అందిస్తుంది. ఇది భారతదేశంలో కొరాజెన్® కీటక నాశిని, ఫెర్టెర్రా® కీటక నాశిని అనే రెండు ప్రముఖ పంటల రక్షణ ఉత్పత్తుల బ్రాండ్ల వెనుక గల అద్భుతమైన చోదక శక్తి. ఈ ప్రధాన బ్రాండ్ల ద్వారా రైనాక్సిపైర్® యాక్టివ్ దేశంలోని 16 ముఖ్యమైన పంటల కోసం అద్భుతమైన పంట రక్షణను అందిస్తుంది. ఒక దశాబ్ద కాలానికి పైగా ఇది రైతులకు సాటిలేని సమర్థతతో సేవలను అందిస్తోంది, భారతదేశంలోని మిలియన్ల మంది రైతులకు అత్యంత విశ్వసనీయమైన ఎంపికగా మిగిలిపోయింది.

ఈ సందర్భంగా ఎఫ్ఎంసి ఇండియా, సౌత్-వెస్ట్ ఆసియా అధ్యక్షుడు శ్రీ రవి అన్నవరపు మాట్లాడుతూ, "రైనాక్సిపైర్® యాక్టివ్‌ను వ్యవసాయ రంగంలో అత్యుత్తమ బ్రాండ్లలో ఒకటిగా గుర్తించినందుకు మేము సంతోషిస్తున్నాము.. ఇది రైనాక్సిపైర్® యాక్టివ్ బ్రాండ్ సహకారాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించడమే కాకుండా, వ్యవసాయంలో స్థిరమైన వృద్ధి కోసం వినూత్నమైన పంట రక్షణ పరిష్కారాల ప్రాముఖ్యతను గురించి నొక్కి చెబుతుంది. రైతులతో భాగస్వామ్యం అవ్వడానికి, వారికి అధునాతన, శాస్త్రీయంగా నిరూపితమైన మరియు స్థిరమైన పంట పరిష్కారాలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము, వారి ఉత్పాదకత మరియు లాభదాయకతను పెంచేందుకు అహర్నిశలు కృషి చేస్తాము" అని తెలిపారు.

10 వేర్వేరు పరిశ్రమలలోని 120కి పైగా కంపెనీలను నిశితంగా అంచనా వేసిన తరువాత, ఎఫ్ఎంసి అందించిన రైనాక్సిపైర్® యాక్టివ్ ఉత్తమ బ్రాండ్లలో ఒకటిగా ఎంపికైంది. వారి అమ్మకాల టర్నోవర్, మార్కెట్ పరిమాణం, బ్రాండ్ రీకాల్, కస్టమర్ సమీక్షలు, పరిశ్రమకు సహకారం మరియు మొత్తం మార్కెట్ ప్రభావం ఆధారంగా వారి ప్రొఫైల్‌లు స్వతంత్రంగా విశ్లేషించబడ్డాయి.  

ఇటి ఎడ్జ్ బెస్ట్ బ్రాండ్స్ అవార్డు రైనాక్సిపైర్® యాక్టివ్‌ను, లక్ష్య తెగుళ్ళ కోసం దీర్ఘకాలిక మరియు వేగవంతమైన రక్షణ అందించే పరిశ్రమలో కెల్ల అత్యుత్తమ పదార్ధంగా మరింత బలపరుస్తుంది. ఇది 2008లో భారతదేశంలో ఉపయోగం కోసం నమోదు చేయబడింది, నేడు 120 కంటే ఎక్కువ దేశాలలో అందుబాటులో ఉంది.

ఎఫ్ఎంసి బలమైన పరిశోధన మరియు అభివృద్ధి కోసం దిక్సూచిగా ఉంది, ఇది వ్యవసాయ పరిశ్రమలోనే పంటల రక్షణ కోసం నూతన ఆవిష్కరణలను అందించడానికి కట్టుబడి ఉంది. స్థిరమైన సాంకేతిక పరిజ్ఞానాలతో రైతులకు మద్దతు ఇవ్వడం ద్వారా ఎఫ్ఎంసి, ఈ నేలపై కనీస ప్రభావాన్ని చూపుతూ సురక్షితమైన, భద్రమైన మరియు స్థిరమైన ఆహార సరఫరాకు దోహదం చేస్తోంది.

ఎఫ్ఎంసి పరిచయం

ఎఫ్‌ఎంసి అనేది ఒక ప్రపంచ స్థాయి వ్యవసాయ విజ్ఞాన సంస్థ. ఇది పెరుగుతున్న ప్రపంచ జనాభాకు సరిపడా ఆహార ధాన్యాలు, పంటలను మరియు ఇంధనాన్ని, మారుతున్న వాతావరణానికి అనుగుణంగా ఉత్పత్తి చేసే సాగుదారులకు సహాయం చేయడానికి కట్టుబడి ఉంది. ఎఫ్‌ఎంసి సంస్థ నుండి వినూత్నమైన పంట సంరక్షణ పరిష్కారాలు - జీవావరణ వ్యవస్థ, పంట పోషణ, డిజిటల్ మరియు ఖచ్చితమైన వ్యవసాయంతో సహా - సాగుదారులు, పంట సలహాదారులు మరియు టర్ఫ్, పెస్ట్ మేనేజ్‌మెంట్ నిపుణులు పర్యావరణాన్ని పరిరరక్షించడంలో వారికి ఎదురయ్యే ఆర్థికపరమైన సవాళ్లను పరిష్కరించుకోవడానికి వీలు కల్పిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వంద కంటే ఎక్కువ సైట్‌లలో సుమారు 6,600 ఉద్యోగులతో, కొత్త కలుపు నాశిని, కీటక నాశిని మరియు శిలీంద్ర నాశిని క్రియాశీల పదార్థాలు, ఉత్పత్తి సూత్రీకరణలను మరియు మన గ్రహానికి హానిని కలిగించని స్థిరంగా మెరుగ్గా ఉండే మార్గదర్శక సాంకేతికతలను కనుగొనడానికి ఎఫ్‌ఎంసి కట్టుబడి ఉంటుంది. సందర్శించండి fmc.com మరియు ag.fmc.com/in/en మరింత తెలుసుకోవడానికి మరియు ఎఫ్ఎంసి ఇండియాను ఫాలో అవ్వడానికి ఫేస్‌బుక్® మరియు యూట్యూబ్®.

 

***