అక్టోబర్ 10, 2023: ఉత్తరాఖండ్ రాష్ట్రం, పంత్ నగర్‌లోని జిబి పంత్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ (జిబిపియుఎటి)లో ఎంటమాలజీ విభాగంలో మొదటి సంవత్సరం చదువుతున్న పిహెచ్‌డి విద్యార్థిని కావ్య నార్నే, వ్యవసాయ విజ్ఞాన సంస్థ ఎఫ్ఎంసి ఇండియా ద్వారా ప్రతిష్టాత్మకమైన సైన్స్ లీడర్స్ స్కాలర్‌షిప్‌ను అందుకుంది. రైతులకు సహాయం చేయాలనే ఆమె కోరిక మరియు ఎఫ్ఎంసి ఇండియా మద్దతుతో కావ్య, పరిశోధన మరియు ఆవిష్కరణ విభాగంలో సంరక్షకురాలిగా ఉండాలని కోరుకుంటుంది, ఇది పంటల రక్షణ మరియు వ్యవసాయంలో సుస్థిరత యొక్క స్థితిని మరింత మెరుగుపరుస్తుంది.
కొనసాగుతున్న ఎఫ్ఎంసి సైన్స్ లీడర్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2021లో ప్రారంభించబడింది, ఇది వ్యవసాయ శాస్త్రాలను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఏటా ఇరవై స్కాలర్‌షిప్‌లను ప్రదానం చేస్తుంది. పిహెచ్‌డి అభ్యసిస్తున్న విద్యార్థులకు పది, అగ్రికల్చర్ సైన్సెస్‌లో ఎంఎస్సీ చదివే విద్యార్థులకు పది స్కాలర్‌షిప్‌లు అందజేయబడతాయి. వ్యవసాయ శాస్త్రాల్లో విజయవంతమైన కెరీర్‌ను సాధించాలని ఆకాంక్షించే మరియు ప్రతిభగల మహిళల కోసం ఈ స్కాలర్‌షిప్‌లలో, యాభై శాతం కేటాయించబడింది. ఈ కార్యక్రమం ద్వారా ఎఫ్‌ఎంసి ఇండియా, వ్యవసాయ పరిశోధన మరియు ఆవిష్కరణలలో వారి ప్రతిభను పెంపొందించడం ద్వారా ఔత్సాహిక శాస్త్రవేత్తలకు అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఒక పరిశ్రమలో కార్మికుడిగా ప్రవేశించాలని యోచిస్తున్న యువతకు సామర్థ్యం మరియు నైపుణ్య నిర్మాణం, పరిశోధన మరియు ఆవిష్కరణలకు వీలు కల్పించాలనే లక్ష్యంతో ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ రూపొందించబడింది.
ఎఫ్ఎంసి ఇండియా అధ్యక్షుడు రవి అన్నవరపు మాట్లాడుతూ, "ఎఫ్ఎంసి వద్ద మేము వ్యవసాయంలో సమగ్ర వృద్ధి కోసం విభిన్నమైన మరియు సమగ్రమైన పని సంస్కృతిని నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నాము. వ్యవసాయ శాస్త్రాల్లో తమ వృత్తిని కొనసాగించడానికి ప్రతిభావంతులైన యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించే దిశగా మేము ముందుకు సాగుతున్నాము. వ్యవసాయంలో మార్పు కోసం పరిశోధన మరియు ఆవిష్కరణలు చేసేందుకు ప్రతిభావంతులైన యువ శాస్త్రవేత్తల బలమైన వ్యవస్థను నిర్మించడం మరియు వారికి సాధికారత కల్పించడం అవసరం. ఇది అందరికీ స్థిరమైన భవిష్యత్తు కోసం దోహదపడుతుంది”
“ఎఫ్‌ఎంసితో జిబిపియుఎటి అవగాహన ఒప్పందం మా పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు పిహెచ్‌డి విద్యార్థులకు కీలకమైనది. ఇది మెంటరింగ్ మరియు ఇంటర్న్‌షిప్ అవకాశాల ద్వారా వారి ఆలోచనలను విస్తరించడంలో విద్యార్థులకు సహాయం చేస్తుంది. విద్యార్థులు, ఎఫ్‌ఎంసి సిబ్బందితో పాటు అడ్వైజరీ కమిటీ మధ్య పరస్పర సంభాషణలు కూడా విద్యార్థులను ఆలోచించేలా మరియు బలమైన పరిశోధన ప్రకటనను రూపొందించేలా ప్రోత్సహిస్తాయి. ఇది పరిశ్రమకు సంబంధించిన పరిశోధనా పనికి నాయకత్వం వహించేందుకు, బాధ్యత చేపట్టేందుకు వారిని ప్రోత్సహిస్తుంది. ఈ స్కాలర్‌షిప్‌లు విద్యార్థుల కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించడంలో, ప్రత్యేక శిక్షణ ద్వారా సమర్థవంతమైన ఆలోచనలు చేయడంలో, సంబంధిత జాతీయ, అంతర్జాతీయ సెమినార్లు, వర్క్‌షాప్‌లు మరియు మరిన్నింటికి హాజరు కావడానికి ప్రోత్సహిస్తుంది. ఈ పరిశ్రమ-విద్యా భాగస్వామ్యం పెద్ద ఎత్తున స్థిరమైన వ్యవసాయ పరిశ్రమను సాధించడంలో సహాయపడుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను." అని డాక్టర్ కిరణ్ పి. రావేర్కర్, డీన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్, జిబిపియుఎటి వెల్లడించారు.
ఈ అవకాశం గురించి మాట్లాడుతూ కావ్య, "చిన్నప్పటి నుంచి నాకు మొక్కలంటే మక్కువ ఎక్కువ, వ్యవసాయం నన్ను ఆకర్షించింది అదే వృత్తిలో నన్ను స్థిరపడేలా చేసింది. జిబి పంత్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చేరిన తర్వాత, నేను ఎఫ్ఎంసి సైన్స్ లీడర్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకున్నాను. వ్యవసాయం పట్ల నా అభిరుచిని కొనసాగించేందుకు, నాకు ఈ ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్ లభించడం నిజంగా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఆ రంగం గురించి మరింత తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నాను, అలాగే వ్యవసాయ రంగంలో విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్తగా ఎదగాలనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఎఫ్ఎంసి ఇండియాకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అలాగే, నా జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, నా ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి నిరంతరం కృషి చేస్తాను.”
కావ్య తన పాఠశాల విద్యను మరియు ఇంటర్మీడియట్ విద్యను ఆంధ్రప్రదేశ్ నుండి పూర్తి చేసింది, కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ బాపట్ల, ఎఎన్‌జిఆర్‌ఎయులో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేసింది, ఇక్కడే ఆమెకు వ్యవసాయంపై ప్రేమ రెట్టింపు అయింది. వ్యవసాయం పట్ల కావ్యకు ఉన్న అంకితభావం, ఉత్తరప్రదేశ్, మీరట్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయంలో ఆమెను ఎంటమాలజీ విభాగంలో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించేలా చేసింది. వ్యవసాయ సూత్రాలు మరియు పద్ధతులపై ఆమె చేసిన అధ్యయనం కావ్యను సమగ్ర అవగాహనతో సన్నద్ధం చేసింది.
ప్రతి సంవత్సరం, వ్యవసాయ శాస్త్రాలలో పిహెచ్‌డి/ఎంఎస్‌సి చదువుతున్న మరో ఇరవై మంది విద్యార్థులు, దేశం నలుమూలల నుండి ఇప్పటికే ఎఫ్ఎంసి సైన్స్ లీడర్స్ స్కాలర్‌షిప్ నుండి లబ్ది పొందుతున్న విద్యార్థుల సమూహంలో చేర్చబడతారు.
ఎఫ్ఎంసి పరిచయం
ఎఫ్‌ఎంసి అనేది ఒక ప్రపంచ స్థాయి వ్యవసాయ విజ్ఞాన సంస్థ. ఇది పెరుగుతున్న ప్రపంచ జనాభాకు సరిపడా ఆహార ధాన్యాలు, పంటలను మరియు ఇంధనాన్ని, మారుతున్న వాతావరణానికి అనుగుణంగా ఉత్పత్తి చేసే సాగుదారులకు సహాయం చేయడానికి కట్టుబడి ఉంది. ఎఫ్‌ఎంసి సంస్థ నుండి వినూత్నమైన పంట సంరక్షణ పరిష్కారాలు - జీవావరణ వ్యవస్థ, పంట పోషణ, డిజిటల్ మరియు ఖచ్చితమైన వ్యవసాయంతో సహా - సాగుదారులు, పంట సలహాదారులు మరియు టర్ఫ్, పెస్ట్ మేనేజ్‌మెంట్ నిపుణులు పర్యావరణాన్ని పరిరరక్షించడంలో వారికి ఎదురయ్యే ఆర్థికపరమైన సవాళ్లను పరిష్కరించుకోవడానికి వీలు కల్పిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వంద కంటే ఎక్కువ సైట్‌లలో సుమారు 6,400 ఉద్యోగులతో, కొత్త కలుపు నాశిని, కీటక నాశిని మరియు శిలీంద్ర నాశిని క్రియాశీల పదార్థాలు, ఉత్పత్తి సూత్రీకరణలను మరియు మన గ్రహానికి హానిని కలిగించని స్థిరంగా మెరుగ్గా ఉండే మార్గదర్శక సాంకేతికతలను కనుగొనడానికి ఎఫ్‌ఎంసి కట్టుబడి ఉంటుంది. సందర్శించండి fmc.com మరియు ag.fmc.com/in/en మరింత తెలుసుకోవడానికి మరియు ఎఫ్ఎంసి ఇండియాను ఫాలో అవ్వడానికి ఫేస్‌బుక్® మరియు యూట్యూబ్®.