ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

టాల్ స్టార్® కీటక నాశిని

టాల్ స్టార్ ® కీటక నాశిని అనేది ప్రత్తిలో కాయతొలుచు పురుగు, ఆకుముడుత పురుగును మరియు వరిలో కాండం తొలుచు పురుగు మరియు చెరకులో చెదలపై ప్రభావవంతమైన నియంత్రణను అందించడానికి సంపర్కం మరియు అంతర్గ్రహణం ద్వారా పనిచేసే విస్తృత వ్యాప్తి గల కీటక నాశిని.

సంక్షిప్త సమాచారం

  • సర్వోత్తమ విస్తృత వ్యాప్తి మరియు అవశేషాల నియంత్రణ
  • పడగొట్టే ధర్మాలను ప్రదర్శిస్తుంది మరియు అందువల్ల వివిధ రకాల రసం పీల్చు మరియు నమిలివేసే పురుగులపై వేగవంతమైన పురుగు నియంత్రణను అందిస్తుంది
  • అధిక ఉష్ణోగ్రతల వద్ద స్థిరంగా ఉంటుంది, తక్కువ అస్థిరత మరియు చర్మానికి కలిగే హాని చాలా తక్కువగా ఉంటుంది
  • నీటితో పాటు నేల లోనికి ఇంకిపోదు మరియు నేలతో ఒక ఏకరూపమైన అడ్డుపొరను ఏర్పరచుకోవడం ద్వారా ఒక అనువైన చెదలనాశినిగా పనిచేస్తుంది

ఉపయోగించిన పదార్ధాలు

  • బైఫెంథ్రిన్ 10% ఇసి

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

4 లేబుల్స్ అందుబాటులో ఉన్నాయి

సపోర్టింగ్ డాక్యుమెంట్లు

ఉత్పత్తి అవలోకనం

టాల్ స్టార్ ® కీటక నాశిని, అకారిసిడల్ ధర్మాలు గల ఒక విస్తృత వ్యాప్తి గల కీటక నాశిని, త్వరితంగా పడగొట్టే దీని ధర్మాలు మరియు వివిధ రకాల రసం పీల్చు మరియు నమిలివేసే పురుగులపై ఎక్కువ కాలం పాటు నియంత్రణ కొరకు ప్రసిద్ధి చెందింది. ఆకు గుబురుపై చల్లినప్పుడు దీని విశిష్ట అణువుల నిర్మాణం కారణంగా, టాల్ స్టార్ ® కీటక నాశిని నిలకడగా నిలిచి ఉంటూనే అధిక ఉష్ణోగ్రత పరిస్థితులలో కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. నేల లోనికి చల్లినప్పుడు, దీని విశిష్టమైన నేలలో కలిసిపోయే ధర్మాలు చెదల యొక్క సర్వోత్తమ నియంత్రణ వలన ఇతర బ్రాండ్ల కంటే మెరుగ్గా పని చేస్తాయి. ఉత్పత్తి యొక్క తక్కువ అస్థిరత మరియు చర్మానికి తక్కువ హానిని కలిగించే ధర్మాలు సమర్థవంతమైన కీటక నియంత్రణ కోరుకునే రైతులకు దీనిని ఒక మెరుగైన ఎంపికగా చేస్తాయి.

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

పంటలు

పేర్కొనబడిన పంటల జాబితా, లక్షిత తెగుళ్లు, వినియోగ సూచనలు, ఆంక్షలు మరియు జాగ్రత్తల గురించి ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్‌ని చూడండి. కావలసిన ఫలితాల కోసం పేర్కొనబడిన సూచనలను జాగ్రత్తగా చదవండి మరియు అనుసరించండి.

ఈ ఉత్పత్తి యొక్క నియంత్రణ మా పరిధిలో లేనందున, మేము ఉత్పత్తి యొక్క నాణ్యత పై మినహా వేటికి హామీ ఇవ్వము.

పూర్తి పంట జాబితా

  • వరి
  • చెరకు
  • ప్రత్తి