సంక్షిప్త సమాచారం
•న్యూరోకాంబి® కీటక నాశిని అనేది ఒక విస్తృత శ్రేణిలో స్పర్శ ద్వారా మరియు జీర్ణకోశం మీద దాడి చేసే ఆవిరి చర్య కలిగిన పురుగు మందు
• ఇది రసం పీల్చుకునే మరియు నమిలే పురుగులను నియంత్రిస్తుంది
• ఆకు ఉపరితలంపై ఎక్కువ సమయం ఉండే కారణంగా ఇది ఎక్కువ కాలం పాటు ప్రభావం చూపుతుంది
లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్
సపోర్టింగ్ డాక్యుమెంట్లు
ఉత్పత్తి అవలోకనం
న్యూరోకాంబి® కీటక నాశిని దాని విస్తృతమైన కీటక నిరోధక పనితీరు కోసం ప్రసిద్ధి చెందిన, బహుళ-ప్రయోజనాలు అందించే కీటక నాశిని. ఇది మితమైన ఆవిరి చర్యతో స్పర్శను ప్రభావితం చేసి, జీర్ణకోశం మీద దాడి చేస్తుంది, అలాగే, రసం పీల్చే మరియు నమిలే పురుగులను సమర్థవంతంగా నియంత్రిస్తుంది. ఆకు ఉపరితలంపై ఎక్కువ సమయం ఉండే కారణంగా, ఎక్కువ కాలం పాటు ప్రభావం చూపడం అనేది దాని విశిష్ట లక్షణాలలో ఒకటి. ఈ సుదీర్ఘమైన చర్య న్యూరోకాంబి® కీటక నాశిని ఎక్కువ కాలం క్రియాశీలంగా ఉంటుందని, వ్యవసాయ క్షేత్రంలో ఉండే అనేక రకాల హానికరమైన తెగుళ్ళ నుండి బలమైన మరియు దీర్ఘకాలిక రక్షణను అందిస్తుందని హామీ ఇస్తుంది.
లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్
పంటలు
ప్రత్తి
ప్రత్తి పంట కొరకు లక్ష్యిత నియంత్రణ
ఈ ఉత్పత్తి ఈ క్రింది వాటిపై సమర్థవంతమైన నియంత్రణను అందిస్తుంది:
- పేనుబంక
- పచ్చ దోమ
- తామర పురుగులు
- తెల్లదోమ
- గులాబీ కాయ తొలుచు పురుగు
- మచ్చల పురుగు
- శనగ పచ్చ పురుగు
- పొగాకు లద్దె పురుగు
పేర్కొనబడిన పంటల జాబితా, లక్షిత తెగుళ్లు, వినియోగ సూచనలు, ఆంక్షలు మరియు జాగ్రత్తల గురించి ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్‌ని చూడండి. కావలసిన ఫలితాల కోసం పేర్కొనబడిన సూచనలను జాగ్రత్తగా చదవండి మరియు అనుసరించండి.
ఈ ఉత్పత్తి యొక్క నియంత్రణ మా పరిధిలో లేనందున, మేము ఉత్పత్తి యొక్క నాణ్యత పై మినహా వేటికి హామీ ఇవ్వము.