ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

గిలార్డో® కలుపు నాశిని

ఏటేటా మొక్క జొన్న పంటను పండించే విస్తీర్ణము పెరుగుతూ ఉండటంతో, కలుపుమొక్కలను నియంత్రించడం అనేది భారతీయ రైతులకు కఠినమైన సవాలుగా మారింది. గిలార్డో®కలుపు నాశిని మందు విస్తృత వ్యాప్తి నియంత్రణను అందిస్తుంది, దీని సహాయంతో రైతులు మొక్క జొన్న పంటలో వెడల్పాటి ఆకుల మరియు సన్నటి ఆకుల కలుపుమొక్కలను సమర్థవంతంగా నియంత్రించవచ్చు.

సంక్షిప్త సమాచారం

  • మొక్క జొన్నపై సురక్షితం మరియు కలుపు మొక్కలపై కఠినమైనది
  • గిలార్డో ® కలుపు నాశిని మందు యొక్క వాడకముతో, పంట మరియు కలుపుమొక్కల మధ్య పోషకాల కోసం పోటీ తక్కువగా ఉంటుంది. దీనివల్ల మెరుగైన నాణ్యత గల పంట మరియు దిగుబడి వస్తుంది
  • కలుపు యాజమాన్యంలో తక్కువ జోక్యం, ఇది కూలీల అవసరాలను తక్కువ చేస్తుంది
  • ఇది చాలా అధికమైన పంట భద్రతా ప్రొఫైల్‌ను కలిగి ఉంది- తదుపరి పంటల కోసం సురక్షితం
  • 2 గంటల పాటు వర్షపాతాన్ని తట్టుకుంటుంది

ఉపయోగించిన పదార్ధాలు

  • టోప్రమెజోన్

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

4 లేబుల్స్ అందుబాటులో ఉన్నాయి

సపోర్టింగ్ డాక్యుమెంట్లు

ఉత్పత్తి అవలోకనం

గిలార్డో® కలుపు నాశిని మందు హెచ్‌పిపిడి ని దాచే కలుపు నాశిని మందుల యొక్క విశిష్ట ఉప తరగతికి చెందిన ఒక పైరాజోలోన్. ఇది వార్షిక గడ్డి మరియు వెడల్పాటి ఆకుల కలుపుమొక్కల నియంత్రణ ద్వారా విస్తృత వ్యాప్తి చర్యను చూపుతుంది. ఇది ఆర్గానోఫాస్ఫేట్ కీటక నాశునులతో సహా ప్రస్తుతం పిచికారీ చేసే కీటక నాశునులు అన్నింటితోనూ ఉపయోగించవచ్చు. గిలార్డో® కలుపు నాశిని మందు సన్నటి గడ్డి మరియు వెడల్పాటి ఆకుల కలుపుమొక్కలపై చాలా త్వరగా పని చేస్తుంది. ఇది వేరు మరియు కొమ్మల ద్వారా గ్రహించబడే ఒక విశిష్టమైన చర్య రూపాన్ని కలిగి ఉంది మరియు మొక్కలో అంతర్వాహకంగా లక్ష్యిత కణజాలము-కొమ్మల కణవ్యవస్థ లోనికి స్థానాంతరం చెందుతుంది. ఫలితంగా, పత్రహరితం యొక్క ఆక్సీకరణ క్షీణత సంభవిస్తుంది, తద్వారా సన్నటి కలుపుమొక్కల యొక్క ప్రత్యేకమైన తెల్లదనం లేదా "బ్లీచింగ్" కు దారితీస్తుంది. గిలార్డో® కలుపు నాశిని మందు అన్ని పొలాలు మరియు ప్రత్యేకించి మొక్క జొన్న కంకులపై రకంతో సంబంధం లేకుండా; పాప్‌కార్న్, సీడ్ కార్న్ మరియు స్వీట్ కార్న్ యొక్క సున్నితమైన రకాలకు కూడా అత్యంత సురక్షితం. దీని వాడకము యొక్క విస్తృత వ్యాప్తి రైతులకు వాడకపు అనుకూలతను కూడా ఇస్తుంది.

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

పంటలు

పేర్కొనబడిన పంటల జాబితా, లక్షిత తెగుళ్లు, వినియోగ సూచనలు, ఆంక్షలు మరియు జాగ్రత్తల గురించి ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్‌ని చూడండి. కావలసిన ఫలితాల కోసం పేర్కొనబడిన సూచనలను జాగ్రత్తగా చదవండి మరియు అనుసరించండి.

ఈ ఉత్పత్తి యొక్క నియంత్రణ మా పరిధిలో లేనందున, మేము ఉత్పత్తి యొక్క నాణ్యత పై మినహా వేటికి హామీ ఇవ్వము.

పూర్తి పంట జాబితా

  • మొక్క జొన్న