ప్రధాన విషయానికి వెళ్ళండి
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

గెలాక్సీ® కలుపు నాశిని

గెలాక్సీ®కలుపు నాశిని సోయా చిక్కుడు పంటలో కలుపుమొక్కలు మొలిచిన తర్వాత వెడల్పాటి ఆకుల కలుపు మొక్కల నియంత్రణ కోసం ఒక అనువైన, విశ్వసనీయమైన మరియు ప్రభావవంతమైన పరిష్కారాన్ని అందిస్తుంది. ఇది రైతులకు విస్తృత శ్రేణి కలుపు నియంత్రణ కోసం విశ్వసనీయమైన వెడల్పాటి ఆకుల కలుపు నాశిని భాగస్వామిని అందిస్తుంది.

సంక్షిప్త సమాచారం

  • వెడల్పాటి ఆకుల కలుపుమొక్కలపై త్వరగా వడలిపోవు మరియు శ్రేష్టమైన మండిపోవు చర్య, దాని ఫలితంగా 1-2 రోజుల కంటే తక్కువ సమయంలో కలుపు ఎండిపోవడం మరియు చనిపోవడం జరుగుతుంది
  • మార్కెట్లోని ఇతర ఉత్పత్తుల ద్వారా నియంత్రించబడలేని మొండి కలుపుమొక్కలను అదుపు చేస్తుంది
  • కమ్మెలినా మరియు అకాలిఫా పై సాటిలేని నియంత్రణ
  • నిరోధక నిర్వహణ కార్యక్రమం కోసం సరిపోతుంది
  • సల్ఫోనీల్యూరియా/ఎఎల్ఎస్ నిరోధక కలుపు మొక్కల పై ప్రభావవంతంగా పని చేస్తుంది

ఉపయోగించిన పదార్ధాలు

  • ఫ్లూథియాసెట్-మిథైల్

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

4 లేబుల్స్ అందుబాటులో ఉన్నాయి

సపోర్టింగ్ డాక్యుమెంట్లు

ఉత్పత్తి అవలోకనం

గెలాక్సీ® కలుపు నాశిని అనేది గ్రూప్ ఇ కలుపు నాశునుల యొక్క థియాడియాజోల్ తరగతి మందు. ఇది వెడల్పాటి ఆకుల కలుపుమొక్కల నియంత్రణ కోసం ఒక అధునాతన కలుపు నాశిని టెక్నాలజీ. గెలాక్సీ® కలుపు నాశిని అనేది సోయా చిక్కుడు‌లో వెడల్పాటి ఆకుల కలుపుమొక్కల కోసం మొలకెత్తిన తర్వాత చల్లే ఎంపిక మరియు అంతర్వాహక కలుపు నాశిని. గడ్డి నియంత్రణ కోసం గెలాక్సీ® కలుపు నాశనిని గడ్డి కలుపు నాశునులతో ట్యాంక్ మిశ్రమ మందుగా ఉపయోగించండి మరియు విస్తృత శ్రేణి నియంత్రణ పొందండి. గెలాక్సీ® కలుపు నాశిని అనేది వేగవంతంగా పనిచేసే రసాయన చర్య, ఇది కణజాల పొర విధ్వంసం (పిపిఓ) ప్రక్రియ ద్వారా ఆకులచే గ్రహించబడి వేగంగా అదుపు చేస్తుంది. ఇది ఒక అంతర్వాహక కలుపు నాశిని మరియు ఆకుల ద్వారా పని చేస్తుంది. దాని విశిష్ట చర్య రూపం కారణంగా ఇతర తరగతి కలుపు నాశునులకు దానికి పోటీ నిరోధకత ఉండదు. గెలాక్సీ® కలుపు నాశిని అనేది ఒక సురక్షితమైన రసాయన చర్య, ఇది మట్టిపై ఎటువంటి ప్రభావం చూపదు మరియు తదుపరి పంట కోసం సురక్షితమైనది. ఇది సోయా చిక్కుడు పొలంలోని ప్రధాన సమస్యలు అయిన కమ్మెలినా ఎస్‌పిపి, డిగేరా అర్వెన్సిస్, అకాలిఫా ఇండికా, అమరాంథస్ విరిడిస్ వంటి వెడల్పాటి ఆకుల కలుపును సమర్థవంతంగా నియంత్రిస్తుంది.

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

పంటలు

పేర్కొనబడిన పంటల జాబితా, లక్షిత తెగుళ్లు, వినియోగ సూచనలు, ఆంక్షలు మరియు జాగ్రత్తల గురించి ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్‌ని చూడండి. కావలసిన ఫలితాల కోసం పేర్కొనబడిన సూచనలను జాగ్రత్తగా చదవండి మరియు అనుసరించండి.

ఈ ఉత్పత్తి యొక్క నియంత్రణ మా పరిధిలో లేనందున, మేము ఉత్పత్తి యొక్క నాణ్యత పై మినహా వేటికి హామీ ఇవ్వము.

పూర్తి పంట జాబితా

  • సోయా చిక్కుడు