ప్రధాన విషయానికి వెళ్ళండి
ప్రస్తుత స్థానం
ఇండియా | ఇఎన్
మెనూ తెరవడానికి క్లిక్ చేయండి
క్లోజ్ చేయడానికి మెనూ‌ని క్లిక్ చేయండి
ప్రధాన కంటెంట్‌ను ప్రారంభించండి

గెజెకో® శిలీంద్ర నాశని

గెజెకో® శిలీంధ్రనాశని అనేది విస్తృత స్థాయిలో పని చేసే ఒక శిలీంధ్రనాశని, అధిక దిగుబడిని పొందడానికి ఇది వ్యాధుల నుండి రక్షణను అందిస్తుంది. ఈ ఉత్పత్తి వ్యాధి నియంత్రణను అందించడమే కాకుండా అనేక పంట లేబుళ్లు మరియు ముఖ్యమైన పంటల కోసం ప్రపంచవ్యాప్తంగా అనుసరించబడుతున్న ఎంఆర్ఎల్ లతో మొక్క ఆరోగ్యానికి ఇది అద్భుతమైన సహకారాన్ని అందిస్తుంది.

స్ట్రోబ్యూలిరిన్ మరియు ట్రైయాజోల్ రసాయనం యొక్క విశిష్ట సమ్మేళనం దీనిని ఒక సమర్థవంతమైన మరియు దీర్ఘకాలిక వ్యాధి యాజమాన్యం కోసం మరింత విశ్వసనీయమైన ఎంపికగా చేస్తుంది. గెజెకో® శిలీంధ్రనాశని మందును సకాలంలో వాడినట్లయితే మొక్కలను శిలీంధ్రాల దాడి నుండి రక్షిస్తుంది మరియు శిలీంధ్రాలు మరింత వృద్ధి చెందకుండా కూడా అడ్డుకుంటుంది.

సంక్షిప్త సమాచారం

 • శిలీంధ్రాల పై అద్భుతమైన రక్షణాత్మక చర్యతో రెండు విభిన్న ఆధునిక చర్యాత్మక అణువుల రూపాల యొక్క విశిష్ట కలయిక
 • ట్రైఫ్లోక్సిస్ట్రోబిన్ టెక్నికల్ శిలీంద్రాల యొక్క శ్వాస క్రియను అడ్డుకుంటుంది మరియు టెబుకోనాజోల్ శిలీంధ్ర కణాల గోడ నిర్మాణ ప్రక్రియను అడ్డుకుంటుంది
 • గెజెకో® శిలీంధ్రనాశని మందు పంట ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు మంచి ఆకుపచ్చని ప్రభావంతో పంటను ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు నాణ్యమైన దిగుబడి కోసం ఒక బలమైన పునాదిని అందిస్తుంది
 • Demonstrates mesostemic action (good penetration and re-distribution) which provides more reliable control, higher yields, and a better quality of harvested grain and fruit
 • వీటి రక్షణాత్మక వినియోగంతో తగిన సమర్థతను పొందవచ్చు

ఉపయోగించిన పదార్ధాలు

 • టెబుకోనాజోల్ 50%
 • ట్రైఫ్లోక్సిస్ట్రోబిన్ 25% డబ్ల్యుజి

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

4 లేబుల్స్ అందుబాటులో ఉన్నాయి

సపోర్టింగ్ డాక్యుమెంట్లు

ఉత్పత్తి అవలోకనం

వ్యాధుల సమస్యల పట్ల రైతులు సాధారణంగా సమగ్రమైన, తక్కువ ఖర్చు అయ్యే, విశ్వసనీయమైన మరియు దీర్ఘకాలిక పరిష్కారం కోసం చూస్తుంటారు. గెజెకో® శిలీంధ్రనాశని మందు తన విభిన్నమైన రెండు వైవిధ్యమయమైన చర్య అణువుల యొక్క విశిష్ట కలయికతో, పాము పొడ, డర్టీ పానికల్, బూడిద తెగులు, ఆకు మాడు తెగులు, ఆంత్రాక్నోస్, పసుపుపచ్చ త్రుప్పు వంటి ప్రధాన వ్యాధులపై మంచి ప్రభావమును అందిస్తుంది. ద్వివిధ రూపములోని చర్య నుండి అణువులు ఫ్రాక్ (3 + 11) సమూహము, వరి, గోధుమ మరియు ముఖ్యమైన పళ్ళు మరియు కూరగాయల పంటలలో ఆర్థికంగా ఇబ్బందికరమైన వ్యాధులపై అద్భుతమైన మరియు విశ్వసనీయమైన నియంత్రణను అందిస్తుంది. గెజెకో® శిలీంధ్రనాశని మందు అద్భుతమైన పంట భద్రతను అందిస్తుంది మరియు కావలసిన భౌతిక ప్రయోజనాలను అందిస్తుంది. పంట దిగుబడిపై మరియు పండించబడిన ధాన్యం యొక్క నాణ్యతపై ప్రయోజనకరమైన ప్రభావాలతో పాటు ఎక్కువకాలం మన్నే విధంగా, వాతావరణ-రక్షిత వ్యాధి నియంత్రణను అందిస్తుంది.

లేబుల్స్ మరియు ఎస్‌డిఎస్

పంటలు

పేర్కొనబడిన పంటల జాబితా, లక్షిత తెగుళ్లు, వినియోగ సూచనలు, ఆంక్షలు మరియు జాగ్రత్తల గురించి ఎల్లప్పుడూ ఉత్పత్తి లేబుల్‌ని చూడండి. కావలసిన ఫలితాల కోసం పేర్కొనబడిన సూచనలను జాగ్రత్తగా చదవండి మరియు అనుసరించండి.

ఈ ఉత్పత్తి యొక్క నియంత్రణ మా పరిధిలో లేనందున, మేము ఉత్పత్తి యొక్క నాణ్యత పై మినహా వేటికి హామీ ఇవ్వము.

పూర్తి పంట జాబితా

 • వరి
 • మిరప
 • టమాటా
 • గోధుమ
 • ఆపిల్
 • వేరుశెనగ
 • తేయాకు