కంపెనీ యొక్క ఉద్దేశ్యాలు మరియు సిద్ధాంతము
ఎఫ్ఎంసి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఇకనుండి “కంపెనీ” గా పేర్కొనబడుతుంది)వద్ద, మేము పరిశ్రమ ద్వారా సమాజానికి సేవ చేయడం అనే సిద్ధాంతములో నమ్మకం ఉంచుతాము". కంపెనీ యొక్క కార్పొరేట్ సామాజిక బాధ్యతా చొరవ, మా కార్పొరేట్ సుస్థిరతా సూత్రాలు, అనగా, భద్రతను పెంచడం, ప్రతిభను సాధికారపరచడం, పెరుగుతున్న నవ్యత, మన వనరులను దృష్టిలో ఉంచుకోవడం మరియు సమాజాన్ని బాగు చేయడం అనే మూలస్థంభాలపై నిర్మించబడింది. అలా చేయడంలో, దీర్ఘకాలిక సుస్థిర రూపాంతర మరియు సామాజిక సమ్మిళితానికి దారితీసే చొరవలకు మద్దతు ఇవ్వడం ద్వారా మరింత సమానత్వమైన మరియు చేకూర్పు సమాజమును నెలకొల్పడానికి మాకు మేము కట్టుబడి ఉండాలనుకుంటున్నాము.
కార్పొరేట్ సామాజిక బాధ్యత యొక్క అత్యున్నత ప్రమాణాలను తన భుజస్కంధాలపై వేసుకోవడానికి కంపెనీ కట్టుబడి ఉంది మరియు నవీకరించబడిన శక్తి మరియు అంకితభావముతో కమ్యూనిటీ చొరవలపై తన పురోగతిని కొనసాగిస్తోంది. తన సిఎస్ఆర్ కార్యకలాపాలలో ప్రభావశీలతను తీసుకురావడానికై మార్గదర్శకాలను నెలకొల్పడం సిఎస్ఆర్ విధానము యొక్క ఉద్దేశ్యముగా ఉంది, అది సమాజము యొక్క సుస్థిర అభివృద్ధిలో సహాయపడేందుకు చేపట్టబడుతూ ఉంది. కంపెనీ, తాను పనిచేస్తున్న కమ్యూనిటీలలో సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధికి దోహదపడేందుకు చురుకుగా పాటు పడుతూ ఉంది.
మనం ఆ విభజనను ఒక సమంజసమైన, మరింత సామాజిక చేకూర్పు ప్రపంచముగా పూరించాల్సిన అవసరం ఉంది. మనమందరమూ ప్రకృతి మరియు పర్యావరణాన్ని పణంగా పెట్టకుండా నివసించగలిగిన ఒక ప్రపంచము. చర్య తీసుకోవడానికి మనకు ఇంకా సమయం ఉంది. ఐతే వృథా చేయడానికి మనకు సమయం లేదు.
ఒక స్పష్టమైన చర్చనీయాంశాలను పేర్కొనే కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్) విధానమును కంపెనీ అభివృద్ధి చేసింది, దాని ద్వారా మేము కమ్యూనిటీలకు నేరుగా దోహదపడటం కొనసాగిస్తాము. కంపెనీల చట్టము, 2013 (ఇకనుండీ ‘చట్టము’ అని పేర్కొనబడుతుంది) యొక్క సెక్షన్ 135 మరియు 2014 ఫిబ్రవరి 27 వ తేదీన భారత ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఇకనుండీ ‘మంత్రిత్వ శాఖ’ అని పేర్కొనబడుతుంది)చే ప్రకటించబడిన సిఎస్ఆర్ నియమాలు (ఇకనుండీ ‘నియమాలు’ అని పేర్కొనబడతాయి) మరియు జనవరి తేదీన చేయబడిన సవరణలను పరిగణన లోనికి తీసుకొని వాటికి అనుగుణంగా ఈ విధానము అభివృద్ధిపరచబడింది
22 వ తేదీ 2021. చట్టము యొక్క షెడ్యూలు VII ప్రకారము ఇండియాలో కంపెనీచే చేపట్టబడే సిఎస్ఆర్ ప్రాజెక్టులు/ ప్రోగ్రాములు అన్నింటికీ ఈ పాలసీ వర్తిస్తుంది. కంపెనీ యొక్క సుస్థిరత్వ సూత్రాలను పరిగణించుకొని, దోహదం చేయడానికి ఒక ముఖ్యమైన అంశముగా కంపెనీ నీటిని గుర్తించింది. మన దేశం లోని మారుమూల గ్రామాలు ఇప్పటికీ వాడుక నీరు మరియు సురక్షిత త్రాగునీటికి సతమతమవుతున్నాయి కాబట్టి, నీటి శుద్ధీకరణ ఉద్దేశ్యముతో సంబంధిత అమలుచేయు సంస్థ(ల) భాగస్వామ్యముతో ఈ అంశానికి సంబంధించిన కార్యక్రమాలను చేపట్టడంపై కంపెనీ దృష్టి సారిస్తుంది. అదనంగా, కంపెనీ ఈ విషయాలపై దృష్టి సారిస్తుంది
పర్యావరణ సుస్థిరత్వం యొక్క అంశాలు మరియు సాగు చేసే వారి కమ్యూనిటీ అభివృద్ధి.
సిఎస్ఆర్ కార్యకలాపాలకు సంబంధించిన నిబంధనలు మరియు పరిమితులు
ఏవైనా సిఎస్ఆర్ ప్రాజెక్టులు/ప్రోగ్రాములు/కార్యకలాపాలను చేపట్టేటప్పుడు సిఎస్ఆర్ కమిటీ మరియు డైరెక్టర్ల మండలి ఈ క్రింది షరతులు మరియు పరిమితులచే శాసించబడతాయి:
- ఈ పాలసీ ప్రకారము కంపెనీచే చేపట్టబడిన సిఎస్ఆర్ ప్రాజెక్టులు/ ప్రోగ్రాములు/ కార్యకలాపాలు, తన మామూలు విధులను నిర్వర్తించడానికి సంబంధించి చేయబడే కార్యక్రమాలను మినహాయిస్తాయి
- జాతీయ స్థాయిలో ఏదైనా రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతమునకు లేదా అంతర్జాతీయ స్థాయిలో ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ క్రీడాకారులకు ఇండియా బయట శిక్షణ కొరకు తప్ప, సిఎస్ఆర్ ప్రాజెక్టులు/ప్రోగ్రాములు/కార్యకలాపాలు ఇండియాలో మాత్రమే చేపట్టబడతాయి
- కంపెనీ యొక్క ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు మాత్రమే ప్రయోజనం కలిగించే ప్రాజెక్టులు/ ప్రోగ్రాములు/ కార్యకలాపాలు సిఎస్ఆర్ ఖర్చులుగా పరిగణించబడవు మరియు అర్హత పొందవు
- సెక్షన్ 182 క్రింద ఏదైనా రాజకీయ పార్టీకి ప్రత్యక్షంగా గానీ లేదా పరోక్షంగా గానీ ఏదైనా విరాళంగా ఇచ్చే మొత్తము పరిగణించబడదు మరియు సిఎస్ఆర్ వ్యయముగా అర్హత పొందదు
- సిఎస్ఆర్ ప్రాజెక్టులు/ ప్రోగ్రాములు/ కార్యకలాపాల నుండి మిగిలిపోయిన మిగులు మొత్తము ఏదైనా ఉన్నట్లయితే, అది బిజినెస్ లాభము/కంపెనీ యొక్క లాభము యొక్క భాగంగా కాబోదు
- తన ఉత్పత్తులు లేదా సేవల కొరకు మార్కెటింగ్ ప్రయోజనాలను పొందడం కోసం ప్రాయోజితం ప్రాతిపదికన కంపెనీచే మద్దతు ఇవ్వబడే కార్యక్రమాలు (మారథాన్‌లు, అవార్డులు, ధార్మిక విరాళాలు, వ్యాపార ప్రకటనలు, టీవీ కార్యక్రమాలు మొదలైనవి) సిఎస్ఆర్ ఖర్చు యొక్క భాగంగా పరిగణించబడవు
- భారతదేశంలో అమలులో ఉన్న ఏవైనా చట్టాల క్రింద ఏవైనా ఇతర కర్తవ్యబాధ్యతలను నెరవేర్చడానికి చేపట్టబడే కార్యక్రమాలు సిఎస్ఆర్ ఖర్చులో భాగంగా పరిగణించబడవు
నిధుల కట్టుబాటు
కంపెనీల చట్టము 2013 (చట్టము) యొక్క సెక్షన్ 135(5)కు అనుగుణంగా, చట్టము లోని షెడ్యూల్ VII (సవరించబడినట్లుగా)లో జాబితా చేయబడిన కొన్ని గుర్తింపు పొందిన కార్యకలాపాల కొరకు తక్షణ మునుపటి మూడు ఆర్థిక సంవత్సరాలలో తాను చేసుకున్న సగటు నిఖర లాభాల నుండి 2% ఖర్చు చేయడానికి కంపెనీ కట్టుబడి ఉంది. ఇందులో, కంపెనీ ద్వారా నేరుగా మరియు అమలు చేయు సంస్థ(ల) ద్వారా చేపట్టబడిన కార్యక్రమాల ద్వారా చేయబడిన ఖర్చులు చేరి ఉంటాయి. ఒకవేళ కంపెనీ గనక అట్టి సగటు లాభాల యొక్క 2% కు మించి ఖర్చు చేసియున్న పక్షములో, దానిని అదనపు సిఎస్ఆర్ ఖర్చుగా పరిగణించాల్సి ఉంటుంది, దానిని చట్టములో పేర్కొనబడిన విధంగా పరిస్థితులకు లోబడి తక్షణం రాబోయే మూడు ఆర్థిక సంవత్సరాలలో సర్దుబాటు చేసుకోవలసి ఉంటుంది.
కంపెనీ ఏమైనా తక్కువ ఖర్చు చేసిందా లేదా ఎక్కువ ఖర్చు చేసిందా అని గణించడానికి గాను, అది ఈ క్రింది అంశాలను పరిగణిస్తుంది:
a. ప్రాజెక్టు వ్యయము – ఇది, ప్రాజెక్టుపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చేయబడిన డిజైనింగ్, అమలు, పర్యవేక్షణ మరియు మదింపు ఖర్చులను ఇమిడి ఉంటుంది
b. పరిపాలనా సంబంధిత పద్దులు – ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ యొక్క మొత్తం కార్పొరేట్ సామాజిక బాధ్యత ఖర్చులో అట్టి ఖర్చులు 5% కు మించకుండా చూసుకోవడం. తదుపరి ఈ ఖర్చులు కంపెనీచే డిజైనింగ్, అమలు చేయడం, పర్యవేక్షణ మరియు మదింపుకు చేసే ఖర్చులలో చేరకుండా చూసుకోవడం
అమలుచేసే ఏజెన్సీ ఎంపిక
సిఎస్ఆర్ ప్రాజెక్టులను మరింత సమర్థవంతంగా చేపట్టుటకు గాను, కంపెనీ ఒక అమలుచేయు సంస్థను నియమించుకోవచ్చు. ఎంపిక కొరకు మార్గదర్శక సూత్రాలు ఇవి:
a. సిఎస్ఆర్ కార్యకలాపాలచే ఎంపిక చేయబడినట్టి అమలుచేయు సంస్థ ఆదాయపు పన్ను చట్టము, 1961 యొక్క సెక్షన్ 12 ఎ మరియు 80 జి క్రింద రిజిస్టర్ చేయబడి ఉండాలి లేదా ఎప్పటికప్పుడు సమయానుగుణంగా మంత్రిత్వ శాఖచే ప్రకటించబడే ప్రాతిపదికకు అనుగుణంగా ఉండాలి
b. అమలుచేయు సంస్థ అటువంటి విధమైన కార్యక్రమాలను చేపట్టుటలో కనీసం మూడు సంవత్సరాల అనుభవాన్ని నెలకొల్పుకొని ఉండాలి
c. అమలు చేయు సంస్థ కంపెనీల రిజిస్టారు వద్ద ఫారం సిఎస్ఆర్ – 1 నింపి ఉండాలి
d. ఈ కార్యక్రమాలను అత్యంత శ్రద్ధతో నిర్వర్తించడానికి గాను అమలు చేయు సంస్థ తగిన పట్టుదలను కలిగి ఉండాలి
e. అటువంటి అమలుచేయు సంస్థను నియామకం చేసే ముందు సముచితమైన లోతైన శ్రద్ధ చేపట్టబడవచ్చు
f. అమలుచేయు సంస్థ కూడా, మంత్రిత్వ శాఖచే ఎప్పటికప్పుడు సమయానుగుణంగా తెలియజేయబడే అట్టి ఇతర ప్రాతిపదికను నెరవేర్చవలసి రావచ్చు
అమలు మరియు పర్యవేక్షణ
అమలు
- కంపెనీ, సిఎస్ఆర్ ప్రాజెక్టుల క్రింద, గుర్తించబడిన ప్రాంతాలలో మరియు రూపొందించబడిన చట్టము మరియు నియమాల యొక్క నిబంధనల ప్రకారము రిజిస్టర్ చేయబడిన ఒక దాతృత్వ సంస్థ లేదా సొసైటీ ద్వారా సిఎస్ఆర్ ప్రాజెక్టులు/ప్రోగ్రాములు కార్యకలాపాలను చేపట్టవచ్చు
- అట్టి ప్రాజెక్టులు లేదా ప్రోగ్రాములపై వాటికోసం చేయబడిన చట్టము మరియు నియమాలకు అనుగుణంగా సంబంధిత కంపెనీల యొక్క సిఎస్ఆర్ కమిటీలు విడిగా రిపోర్టు చేసే స్థితిలో ఉండే లాగున కంపెనీ కూడా సిఎస్ఆర్ ప్రాజెక్టులు/ప్రోగ్రాములు/కార్యకలాపాలను చేపట్టేందుకు ఇతర కంపెనీలతో కూడా సమన్వయము చేసుకోవచ్చు
- కంపెనీ తనకు తాను స్వంతంగా సిఎస్ఆర్ సామర్థ్యాలను, అనగా, తన స్వంత సిబ్బంది, అదే విధంగా తన అమలు చేయు సంస్థల యొక్క సిబ్బంది సామర్థ్యాలను కనీసం మూడు ఆర్థిక సంవత్సరాల ట్రాక్ రికార్డును కలిగియున్న మరియు సిఎస్ఆర్ కమిటీ సముచితమని భావించినట్టి మరేదైనా ప్రాతిపదిక కలిగిన సంస్థల ద్వారా వృద్ధి చేసుకోవచ్చు
పర్యవేక్షణ
- అమలుచేయు సంస్థ లేదా విక్రేత నైతిక ఆచరణలు పాటించేట్లుగా కంపెనీ చూసుకుంటుంది మరియు అమలుచేయు సంస్థకు లేదా విక్రేతకు చేసే చెల్లింపులు అన్నియునూ మైలురాయి ఆధారితంగా ఉండేలా చూసుకోవడానికి కృషి చేస్తుంది
- గుర్తించబడిన ముఖ్య పరిమాణాత్మక మరియు నాణ్యతా పనితీరు సూచికల సహాయముతో, నిరంతరాయమైన ఫీడ్‌బ్యాక్ విధానముతో, మరియు ప్రభావశీలతను నిర్ధారించుకోవడానికై అవసరమైతే అమలులో మధ్యంతర సరిజేత కొరకు పునఃప్రక్రియతో పర్యవేక్షణ చేయబడుతుంది
- కంపెనీ, ఆయా ఉదంతమును బట్టి, కాలానుగత ప్రాతిపదికన క్షేత్ర సందర్శనలు లేదా సమీక్షా సమావేశాల ద్వారా ప్రాజెక్టు అమలును మరియు అమలు చేయు సంస్థ/ల పనితీరును పర్యవేక్షణ చేస్తుంది మరియు అట్టి పర్యవేక్షణ కొరకు హోదా కల్పించబడిన ఉద్యోగుల యొక్క ఒక బృందము నియమింపబడవచ్చు
- ప్రభావ విశ్లేషణ – మూడు తక్షణ మునుపటి ఆర్థిక సంవత్సరాలలో రు. 10 కోట్లు లేదా అంతకు ఎక్కువ సగటు సిఎస్ఆర్ కర్తవ్యబాధ్యత ఉన్న పక్షములో, రు.1 కోటి లేదా అంతకు మించిన వ్యయం కలిగియున్న సిఎస్ఆర్ ప్రాజెక్టుల కొరకు ఒక స్వతంత్ర సంస్థ ద్వారా ప్రభావ విశ్లేషణ చేపట్టబడే విధంగా కంపెనీ చూసుకుంటుంది. అట్టి విశ్లేషణకు చేయబడే ఖర్చు ఆ ఆర్థిక సంవత్సరంలో చేయబడిన మొత్తం సిఎస్ఆర్ ఖర్చులో 5% కి
లేదా 50 లక్షల రూపాయలు, ఏది తక్కువైతే అది, కి మించి ఉండకూడదు
వార్షిక యాక్షన్ ప్లాన్
కంపెనీ, సంవత్సరములో చేయాల్సిన కార్యకలాపాలు మరియు ఖర్చు చేయాల్సిన సిఎస్ఆర్ వ్యయమును గుర్తించుటకు కంపెనీ యొక్క వార్షిక కార్యాచరణ ప్రణాళికను తయారు చేస్తుంది, అందులో నియమాలలో కనబరచబడిన విధంగా వివరాలు చేరి ఉంటాయి.
తదుపరిగా, వార్షిక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి అవసరమైన మార్గదర్శక సూత్రాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
a. సిఎస్ఆర్ ప్రోగ్రాములు సవరించబడిన సిఎస్ఆర్ నియమాల క్రింద నిర్బంధం విదించబడిన కార్యకలాపాలను చేరి ఉండవు.
b. సిఎస్ఆర్ కార్యక్రమాల కొరకు ప్రాధాన్యతను కంపెనీ స్థానిక ప్రాంతాలకు మరియు తాను పనిచేస్తున్న చుట్టుపట్ల ప్రాంతాలకు ఇవ్వాలి.
c. సిఎస్ఆర్ కార్యకలాపాలను నేరుగా గానీ లేదా అమలు చేయు సంస్థ/ల ద్వారా గానీ చేపట్టవచ్చు.
d. అమలుచేయు సంస్థలు లేదా విక్రేతలకు చేసే చెల్లింపులు మైలురాళ్ళ ఆధారితంగా ఉండాలి.
e. సిఎస్ఆర్ కార్యకలాపాలను అమలు చేయుటకు మరియు పర్యవేక్షణ కొరకు పాటించవలసిన మార్గదర్శక సూత్రాలు అన్నింటినీ కూడా ఈ సందర్భంగా పాటించాల్సి ఉంటుంది
మరియు వార్షిక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి.
ఏదైనా ఆర్థిక సంవత్సరంలో, కొత్త ప్రాజెక్టు (ల) కారణంగా గానీ లేదా ఆమోదించబడిన ప్రాజెక్టు (ల) వ్యయపు పద్దులో పెంపుదల వల్ల గానీ ఏదైనా బడ్జెట్ చేయబడని ఖర్చులను చేర్చడానికై కంపెనీ యొక్క వార్షిక కార్యాచరణ ప్రణాళికను ఆధునీకరించవచ్చు. చట్టము యొక్క నిబంధనలకు లోబడి, కంపెనీ తన సిఎస్ఆర్ వ్యయాలను ఒక మూలధన ఆస్తిని సృష్టించు లేదా స్వాధీనం చేసుకునే దిశగా కూడా వినియోగించుకోవచ్చు.
పరిపాలనా విధానము
మా సిఎస్ఆర్ విధానము కంపెనీ యొక్క డైరెక్టర్ల మండలిచే శాసించబడుతున్నది. ఎప్పటికప్పుడు సమయానుగుణంగా పాలసీ మరియు ప్రోగ్రాములను పర్యవేక్షించడానికి గాను మండలి కనీసం ఇద్దరు డైరెక్టర్లతో ఒక సిఎస్ఆర్ కమిటీని ఏర్పాటు చేసింది.
a. డైరెక్టర్ల మండలి
- సిఎస్ఆర్ కార్యక్రమాల యొక్క పనితీరు మరియు ప్రభావాన్ని బోర్డు పర్యవేక్షిస్తుంది మరియు సమీక్షిస్తుంది, అవసరమైతే సలహా సూచనలు మరియు కోర్సు సవరణలను అందజేస్తుంది మరియు పంపిణీ చేయబడిన సిఎస్ఆర్ నిధులు కంపెనీ యొక్క సిఎస్ఆర్ విధానముతో అనువుగా ఉన్నట్లు మరియు దాని ఉద్దేశ్యాల మేరకు మరియు దానిచే ఆమోదించబడిన తీరులో వినియోగించబడినట్లుగా తనకు తానుగా సంతృప్తి చెందుతుంది.
- సిఎఫ్ఓ (ఒకవేళ నియమించబడి ఉంటే) లేదా ఆర్థిక నిర్వహణకు బాధ్యులైన ఎవరైనా ఇతర వ్యక్తి, పంపిణీ చేయబడిన సిఎస్ఆర్ నిధులు దాని ఉద్దేశ్యాల కొరకు మరియు బోర్డుచే ఆమోదించబడిన తీరులోనే వినియోగించబడినాయనే వాస్తవాన్ని ధృవీకరిస్తారు.
b. డైరెక్టర్ల మండలి యొక్క సిఎస్ఆర్ కమిటీ
సిఎస్ఆర్ పనితీరు పైన సిఎస్ఆర్ కమిటీ అజమాయిషీ చేస్తుంది మరియు మార్గదర్శనం అందిస్తుంది మరియు సిఎస్ఆర్ పాలసీ, నిబద్ధతలు మరియు వర్తించు సిఎస్ఆర్ నిబంధనలతో సమ్మతి వహింపును పర్యవేక్షిస్తుంది.
సిఎస్ఆర్ కమిటీ యొక్క విధులు మరియు బాధ్యతలు ఇవి:
- పద్ధతి ప్రకారము కంపెనీచే చేపట్టబడవలసిన కార్యకలాపాలను సూచించే ఒక సిఎస్ఆర్ పాలసీని రూపొందించడం మరియు బోర్డుకు సిఫార్సు చేయడం
చట్టము
- కంపెనీ యొక్క సిఎస్ఆర్ విధానమును ఎప్పటికప్పుడు సమయానుగుణంగా పర్యవేక్షించుట
- చట్టము యొక్క నిబంధనల ప్రకారము ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుట మరియు బోర్డుకు సిఫార్సు చేయుట
- సంవత్సరంలో ఏ సమయములోనైనా వార్షిక కార్యాచరణ ప్రణాళికలో ఏవేని మార్పుచేర్పుల యొక్క సిఫార్సు మరియు ఏదైనా ఉంటే సిఎస్ఆర్ పాలసీకి అవసరమైన ఆధునీకరణ
- వార్షిక కార్యాచరణ ప్రణాళిక ప్రకారము సిఎస్ఆర్ కార్యక్రమాల అమలు మరియు పర్యవేక్షణ
-చట్టము యొక్క నిబంధనల ప్రకారము కంపెనీ యొక్క ప్రాజెక్టులను ‘కొనసాగుతున్న ప్రాజెక్టులు’ గా గుర్తించుట మరియు వాటిని బోర్డుకు సిఫార్సు చేయుట
- వార్షిక సిఎస్ఆర్ ఖర్చు బడ్జెట్‌ను ఆమోదము కొరకు బోర్డుకు సిఫార్సు చేయుట;
- వర్తించినప్పుడల్లా సిఎస్ఆర్ ప్రాజెక్టుల కొరకు తృతీయ పక్షాల ద్వారా ప్రభావ విశ్లేషణను నిర్వహించుట
- కంపెనీ యొక్క సిఎస్ఆర్ కార్యక్రమాల అమలు, వర్తించే ఫ్రేమ్‌వర్క్ లోపున జరిగేలా చూసుకోవాల్సి ఉంటుంది
- సమగ్ర అవకాశమును నిర్ధారించడం, సలహా సూచనలు అందించడం, మరియు సిఎస్ఆర్ నివేదికను స్వీకరించాల్సిందిగా కంపెనీ యొక్క డైరెక్టర్ల మండలికి సిఫార్సు చేయడం
- ఏదైనా చట్టబద్ధమైన లేదా నిబంధనాయుత ఆవశ్యకతల క్రింద అవసరమని భావించబడిన అట్టి ఇతర విధుల నిర్వర్తనను కమిటీ మరియు ఎప్పటికప్పుడు సమయానుగుణంగా బోర్డుచే అప్పగించబడిన విధంగా నిర్వర్తించాల్సి ఉంటుంది
సవరించబడిన విధంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత నియమాలు, 2013 కు సంబంధించి జారీ చేయబడిన విధానము (పాలసీ) మండలి యొక్క సిఎస్ఆర్ కమిటీచే సిఫార్సు చేయబడింది మరియు డైరెక్టర్ల మండలిచే ఆమోదించబడింది
పరిమితి మరియు సవరణ
డైరెక్టర్ల మండలి తమ విచక్షణ మేరకు మరియు సిఎస్ఆర్ కమిటీ యొక్క సిఫార్సు మేరకు ఎప్పటికప్పుడు సమయానుగుణంగా ఈ పాలసీకి మార్పులు/చేర్పులు మరియు/లేదా సవరణలు చేయవచ్చు. కోరమ్, మీటింగ్ నోటీసు, డాక్యుమెంటేషన్ మొదలైన వాటికి సంబంధించిన ఆవశ్యకతలు, ఇతరత్రా వ్యక్తీకరించి పేర్కొనబడి ఉంటే తప్ప, భారత కంపెనీ సెక్రెటరీల సంస్థచే జారీ చేయబడిన వర్తించే సెక్రెటేరియల్ ప్రమాణాలతో సరితూగేలా ఉంటాయి మరియు కేంద్ర ప్రభుత్వముచే ఆమోదించబడి ఉంటాయి.
ఈ పాలసీ యొక్క నిబంధనలు మరియు చట్టము లేదా ఏవేని ఇతర చట్టబద్ధమైన అమలు విషయాలు, నియమాలు, అట్టి చట్టము యొక్క నిబంధనలు లేదా చట్టబద్ధమైన అమలు విషయాల మధ్య ఏదైనా వివాదము తలెత్తిన సందర్భములో, నియమనిబంధనలు వాటిపై నిలిచి ఉంటాయి మరియు ఈ పాలసీకి తమంతట తాముగా వర్తిస్తాయి మరియు పాలసీ యొక్క సంబంధిత నిబంధనలు కాలక్రమములో చట్టముతో సుస్థిరంగా ఉండేలా చేయడానికి గాను సవరించబడతాయి/ మార్పు చేయబడతాయి.
రిపోర్టు చేయడం
- చట్టం మరియు నియమాల ప్రకారం అవసరాలకు అనుగుణంగా కంపెనీ యొక్క సిఎస్ఆర్ కార్యకలాపాలు కంపెనీ యొక్క వార్షిక నివేదికలో పేర్కొనబడతాయి
- కంపెనీ యొక్క డైరెక్టర్ల మండలి సిఎస్ఆర్ కమిటీ యొక్క కూర్పును మరియు మండలిచే ఆమోదించబడిన సిఎస్ఆర్ పాలసీ మరియు ప్రాజెక్టులు ఏవైనా ఉంటే, వాటిని ప్రజల అందుబాటు కొరకు తన వెబ్‌సైట్ పై వెల్లడి చేస్తుంది
_____________________________________________________________________________